కేవలం రూ. 12 వేలకే జీప్‌ కారు..! ఇంకా దానిపై రూ. 200 డిస్కౌంట్‌..!  | Anand Mahindra Posts Pic Of 60s Jeep Sold For Rs 12421 What It Costs Now | Sakshi
Sakshi News home page

కేవలం రూ. 12 వేలకే జీప్‌ కారు..! ఇంకా దానిపై రూ. 200 డిస్కౌంట్‌..! ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ వైరల్‌

Published Tue, Mar 8 2022 9:15 PM | Last Updated on Tue, Mar 8 2022 9:29 PM

Anand Mahindra Posts Pic Of 60s Jeep Sold For Rs 12421 What It Costs Now - Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా ఒక జీప్‌కు సంబంధించిన ట్వీట్‌ను ఆనంద్‌ మహీంద్రా నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారంది.   

కేవలం రూ. 12 వేలకే..!
ఆనంద్ మహీంద్రా 1960 నాటి ఒక ప్రకటనను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ప్రకటనలో వీల్లీస్‌ జీప్ కారు ధర రూ.12,421కు రానుంది. దీనిపై రూ. 200 రూపాయల డిస్కౌంట్‌ను కూడా అందిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ ప్రకటనను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఒక మంచి స్నేహితుడు ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ను తన ఆర్కేవ్స్ నుంచి తీసిచ్చారని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అతని కుటుంబం చాలా కాలంగా తమ వాహనాలను పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. పాత రోజులే బాగున్నాయని ఆనంద్‌ మహీంద్రా  గుర్తు చేసుకున్నారు.
 

ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు..!
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ పోస్ట్‌పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా ఫోలోవర్లలో ఒకరు తన కోసం దయ చేసి ఆ పాత కాలం నాటి ధరతోనే రెండు జీప్ కార్లు బుక్ చేయాలంటూ రిప్లే ఇచ్చారు. అలాగే మరో నెటిజన్.. రూ.12,421కు ఇప్పుడు ఫ్లోర్‌ మ్యాట్స్, పర్‌ఫ్యూమ్ బాటిల్, డస్ట్ కవర్, కారు ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వంటి వాటికి సరిపోతుందని ఫన్నీ రిప్లే ఇచ్చారు. 2022లో కేవలం ఒక పది బొమ్మకార్లు వస్తాయని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన కారు వీల్లీస్‌ సీజే జీప్‌.  ప్రస్తుతం ఈ జీప్‌ ధర రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంది. 


చదవండి: క్రేజీ ఆఫర్‌..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement