Actress Wamiqa Gabbi Buys First Car American Brand Jeep Meridian Price And Details - Sakshi
Sakshi News home page

Wamiqa Gabbi Buys First Car: కొత్త కారు కొన్న ఆనందంలో రచ్చ రచ్చ చేసిన వామిక గబ్బి - వైరల్ వీడియో

Published Thu, Jul 13 2023 8:56 PM | Last Updated on Fri, Jul 14 2023 11:17 AM

Actress Wamiqa Gabbi first car american brand jeep meridian price and details - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే పంజాబీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించిన 'వామిక గబ్బి' (Wamiqa Gabbi) ఇటీవల అమెరికన్ బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కాగా ఈ భామ ఇటీవల కొనుగోలు చేసిన కారు జీప్ కంపెనీకి చెందిన మెరిడియన్. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

జీప్ మెరిడియన్ డెలివరీ తీసుకునే సమయంలో వామిక ముంబైలోని కంపెనీ డీలర్‌షిప్‌లో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇదే ఆమె మొదటి కారు కావడం ఇక్కడ విశేషం. వీడియో పోస్ట్ చేస్తూ నా తల్లితండ్రులు సహకారంతో.. అభిమానుల ఆదరాభిమానాలతో ఇది సాధ్యమైందని వెల్లడించింది.

(ఇదీ చదవండి: ఆ ప్రదేశం చూడగానే ఆకర్షిస్తుంది.. ఒక రాత్రి అక్కడ ఉండగలనా అంటే!)

జీప్ మెరిడియన్..
ఇక జీప్ మెరిడియన్ విషయానికి వస్తే.. వామికా కొనుగోలు చేసిన కారు వెల్వెట్ రెడ్ షేడ్‌లో చూడచక్కగా ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ కలిగి.. ఫ్లోటింగ్-టైప్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్‌ రంగాన్నే షేక్‌ చేసిన ఇండియన్‌!)

ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ 170 హార్స్ పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 32.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ధరలు మారుతాయి. వామిక ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement