ఈవీఎంను జీప్‌లో మర్చిపోయారు! | Gujarat Poll Officials 'Forget' EVM In Jeep, Driver Brings It Back | Sakshi
Sakshi News home page

ఈవీఎంను జీప్‌లో మర్చిపోయారు!

Published Mon, Dec 11 2017 4:01 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

Gujarat Poll Officials 'Forget' EVM In Jeep, Driver Brings It Back - Sakshi

రాజ్‌పిప్లా: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్‌ సిబ్బంది తమ అలసత్వాన్ని బయటపెట్టుకున్నారు. నర్మాదా జిల్లాలో దడియపద నియోజకవర్గంలో పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను రాజ్‌పిప్లాలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాల్సిన అధికారులు.. ఓ ఈవీఎం యూనిట్‌ను ప్రైవేటు జీప్‌లో మర్చిపోయి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని జీప్‌ డ్రైవర్‌ గమనించి స్థానిక నేతలకు, అధికారులకు సమాచారమిచ్చారు. వ్యవహారం బయటకు పొక్కడంతో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్‌ఎస్‌ నినమా నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆ ఈవీఎం యూనిట్‌ను పోలింగ్‌కు వినియోగించలేదన్నారు. పోలింగ్‌ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి ఆరు ఈవీఎం యూనిట్లను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలోని ఓ యూనిట్‌ను అధికారులు జీప్‌లో మర్చిపోయారన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈసీకి ఇప్పటికే నివేదిక సమర్పించామన్నారు. విధుల్లో అలసత్వం వహించినందున సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీచేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement