
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రూరల్ ఏజెన్సీలోని పెద్ద వలస బోడు వలస వద్ద జీపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో కొయ్యూరు మండలం వద్ద జీపు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.
మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులతో కలిసి అధికారులు సహయక చర్యలను చేపట్టారు. జీపులో పదిమంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను, బాధితుల వివరాలపై దర్యాప్తు చేపట్టారు.
చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి
Comments
Please login to add a commentAdd a comment