డెహ్రాడూన్: జీపు లోయలో పడ్డ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి అల్మోరా ప్రాంతంలోని లోయలో పడింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతిచెందారని చెప్పారు. గాయపడ్డవారిని రక్షించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే వీరు ఒకే కుటుంబానికి చెందినవారా.. ఎవరు అన్నది తెలియరాలేదు. బాధితుల పూర్తి వివరాలూ తెలియాల్సి ఉంది.