uttrakhand
-
ఉపాధ్యాయులకు షాక్.. క్లాస్ రూమ్స్‌లో ఫోన్ల వాడకంపై ఆంక్షలు
డెహ్రాడూన్: క్లాస్ రూమ్స్‌లో ఫోన్లు వాడే టీచర్లకు బిగ్ షాక్ తగిలింది. క్లాస్ రూమ్‌ల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ శంకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా టీచర్ల వద్ద క్లాస్ రూమ్స్‌లో ఫోన్లు కలిగి ఉన్నట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రూల్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తరగతి గదుల్లో కూడా ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లతో బిజీగా ఉండటం చాలా కాలంగా గమినిస్తున్నట్టు చెప్పారు. ఫోన్లలో బిజీగా గేమ్స్ ఆడటం, చాటింగ్‌లు చేయడం వంటివి గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుండి తమకు చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అలాగే విద్యార్థులు, ఫిర్యాదులను ధృవీకరించడానికి అధికారులను పంపించినట్టు తెలిపారు. అయితే, ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను పాఠశాలలకు తీసుకెళ్లవచ్చు కానీ.. ఫోన్లను ప్రిన్సిపాల్ గదిలో భద్రపరచాలని స్పష్టం చేశారు. వారు మొబైల్ ఫోన్లు లేకుండా తరగతి గదిలోకి ప్రవేశించాలని ఆదేశాలు జారీ చేసినట్టు పాండే చెప్పారు. అయితే, టీచర్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చని తెలియజేసారు. కాగా, ప్రిన్సిపాల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఫోన్ తమ వద్ద పెట్టుకోవచ్చనని సూచించారు. ఈ క్రమంలోనే తమ ఆకస్మిక తనిఖీల్లో ఎవరైనా ఉపాధ్యాయులు ఫోన్‌ను వాడుతున్నట్టు గమినిస్తే.. కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ కూడా బాధ్యత వహించాలన్నారు. Following complaints from students, parents that teachers were engaged with their phones in classrooms, an order has been issued which makes it mandatory for teachers to deposit their phones to Principal. Strict action in case of violation:Vinay S Pandey, Haridwar DM, Uttarakhand pic.twitter.com/B4GVDVwKcU — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022 -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు.. గెలుపెవరిదో?
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం నేడు తుదిదశకు చేరుకోనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలకానున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్‌గా భావించే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల నాయకత్వ పగ్గాలు ఏ పార్టీల చేతికొస్తాయో వెల్లడికానుంది. ఓట్ల లెక్కింపు క్రతువులో 50 వేల మంది అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) భాగస్వాములను చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించేందుకు దాదాపు 1,200 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధంచేశారు. 75 జిల్లాల్లో 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో 750 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పంజాబ్‌లో 200 కేంద్రాలు రెడీ అయ్యాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 650కి పైగా కౌంటింగ్ పర్యవేక్షకులు విధుల్లో పాల్గొంటారు. ర్యాండమ్‌గా ఒక్కో నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్‌ల చొప్పున అక్కడి ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లనూ సరిపోల్చనున్నారు. కౌంటింగ్ నిరాటంకంగా కొనసాగేలా సాయపడేందుకు ఉప రిటర్నింగ్ అధికారి విధుల్లో ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు కౌంటింగ్ రోజున అమలుచేసేలా కోవిడ్ అదనపు నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్ ముగిశాక లెక్కింపు కేంద్రాలను తప్పకుండా శానిటైజ్ చేయాలి. భౌతిక దూరం పాటించేలా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విస్తృత పరిధిలో కౌంటింగ్ సెంటర్లను సిద్ధంచేశారు. రెండు కోవిడ్ టీకాలు తీసుకున్నాసరే కరోనా లక్షణాలుంటే వారిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోరు. అధికారులు, భద్రతా బలగాల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరికీ మాస్క్, శానిటైజర్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ గ్లౌజ్‌లు అందించనున్నారు. యూపీ సహా మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి ఫిబ్రవరి 10న మొదలైన ఈ పోలింగ్ ప్రక్రియ మార్చి ఏడో తేదీన ముగిసిన విషయం తెల్సిందే. యూపీలో బీజేపీ, పంజాబ్ ఆప్? ► గోవాలో హంగ్ ► లోక్‌నీతి–సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ అంచనాలు న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా కొన్ని గంటలు ఉందనగా లోక్‌నీతి–సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని, పంజాబ్ కోటలో ఆప్ పాగా వేస్తుందని అంచనా వేసింది. ఇక ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలున్నాయన్న ఆ సంస్థ గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడి తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారుతుందని పేర్కొంది. యూపీలో బీజేపీ 43% ఓట్ల షేర్‌తో సునాయాసంగా భారీ విజయం సాధిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ 35% ఓట్లకే పరిమితమైపోతుందని అంచనా వేసింది. -
Assembly election 2022: 51 మంది అభ్యర్థుల ఆస్తులు రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. గత ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలతో పోలిస్తే , ప్రస్తుత ఎన్నికల్లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలు రెట్టింపయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 51 మంది అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. ఇందులో 40 మంది బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, మరో 10 కాంగ్రెస్ తరఫున, ఒకరు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. ఈ 51 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ 2017 ఎన్నికల్లో సగటున రూ.4.72 కోట్లుగా ఉండగా, అది 2022 నాటికి రూ.7.05 కోట్లకు పెరిగిందని ఏడీఆర్ వెల్లడించింది. సగటున ఆస్తుల విలువ రూ.2.33 కోట్లు అంటే... 49 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ఇందులో బీజేపీకి చెందిన 40 మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో రూ.4.85 కోట్లుగా ఉంటే అవి ప్రస్తుతం సగటున రూ.7.23 కోట్లకు చేరాయని వెల్లడించింది. బీజేపీ తరఫున సోమేశ్వర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేఖా ఆర్య ఆస్తులు గత ఎన్నికల్లో రూ.12.78 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 25.20 కోట్లుగా ఉందని తెలిపింది. ఇదే పార్టీ తరఫున రూర్కీ నుంచి బరిలో ఉన్న ప్రదీప్ బత్రా ఆస్తులు రూ.3.81కోట్ల నుంచి రూ.12.06 కోట్లకు చేరాయని తెలిపింది. ఇక కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న 10మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో సగటున రూ.4.61 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అవి రూ.6.83 కోట్లకు చేరాయని వెల్లడించింది. -
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో శారదా బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డేంజర్ లెవెల్‌కు దిగువన నీటిమట్టం చేరుకుంది. ఇప్పటకీ శారది నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా శారదా బ్రిడ్జి గేట్లను అధికారులు ఎత్తివేసినట్లు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. రెడ్ అలెర్ట్‌ను కూడా జారీ చేశారు. భారీ వర్షంతో పలు నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పలు రహదారులు కొట్టకుపోయాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్సాలతో గోరీగంగా నది ఉప్పొంగి వరద ఉధృతికి కొట్టుకుపోయిన మున్సియారి-జౌల్జిబి రహదారి -
కోవిడ్ రాయని మరణ శాసనం
తల్లి, ఇద్దరు బిడ్డలు... మూడు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఈ మరణాలను నిర్ణయించింది కోవిడ్ కాదు, వైద్యులు. గర్భిణిని హాస్పిటల్లో చేర్చుకోలేదెవ్వరూ. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఐదు హాస్పిటళ్ల మెట్లెక్కింది. ఆమె కడుపులో పెరుగుతున్న ఇద్దరు బిడ్డలు భూమ్మీదకొస్తామని తల్లిని తొందర పెడుతున్నారప్పటికే. ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘోరానికి బలైపోయిన ప్రాణం పేరు సుధా సైనీ. ఇంత పెద్ద శిక్షా! సుధాసైనీ ఒక పేదింటి మహిళ. భర్త కమలేశ్ కురిపిస్తున్న ప్రేమ సంపన్నత తప్ప, సమాజంలో బతకగలిగిన సంపన్నత లేదు. కమలేశ్ భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. సుధకు ఏడు నెలలే నిండాయి. అయినా సరే... పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె నెలనెలా చూపించుకుంటున్న ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లింది. నర్సులు... ‘తొమ్మిది నెలలు నిండిన తర్వాత రండి’ అని పంపించేశారు. ‘నొప్పులు భరించలేకపోతున్నాను, హాస్పిటల్లో చేర్చుకోండి’ అని వేడుకున్నా కనికరించలేదు. డెహ్రాడూన్‌లోని డూన్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, కోరోనేషన్ హాస్పిటల్‌తోపాటు మరో రెండు ప్రైవేట్ హాస్పిటళ్లకు కూడా వెళ్లింది. అందరూ వెనక్కి పంపేశారు. సుధ నొప్పులతోనే ఇంటికి వెళ్లిపోయింది. ఈ నెల తొమ్మిదో తేదీన ఇంట్లోనే ప్రసవం అయింది. బిడ్డలిద్దరూ కొంతసేపటికే ప్రాణాలు వదిలేశారు. మరో మూడు రోజులకు తల్లి ప్రాణం కూడా బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. శుక్రవారం భార్య అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు కమలేశ్. బిడ్డల అంతిమ సంస్కారం చేసిన రోజు నుంచే తిండి మానేశాడతడు. ఇప్పుడు భార్యను కూడా కాటికి అప్పగించేసి జీవచ్ఛవంలా ఉన్నాడు. ‘‘భూమ్మీదకు రావడానికి నా బిడ్డలు తెలియక తొందరపడ్డారు, డాక్టర్లు వైద్యం చేయకుండా నా బిడ్డలకు ఇంత పెద్దశిక్ష వేస్తారా? బిడ్డలను భూమాత కడుపులో దాచి వచ్చిన తర్వాత సుధ నాతో ‘మన దగ్గర బాగా డబ్బు ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు కదా. మన బిడ్డలు బతికేవాళ్లు’ అని కన్నీళ్లు పెట్టుకుంది. సుధ మాట నిజమే కదా’’ అని కూడా అంటున్నాడు కమలేశ్. నిజంగా కరోనా వచ్చిందా! సుధా సైనీని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించిన డాక్టర్ల అనుమానం ఒక్కటే ‘ఆమె కరోనా పేషెంట్ కావచ్చు’ అని. ఆమె ప్రాణం పోయిందని తెలిసి ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘ఆమె ఇప్పటి వరకు చూపించుకున్న హాస్పిటల్ ఎందుకు చేర్చుకోలేదు’ అనే తెలివైన ప్రశ్న సంధించారు. స్థానిక ఎమ్మెల్యే హర్భజన్ కపూర్ జోక్యంతో దర్యాప్తు మొదలైంది. జిల్లా ప్రధాన వైద్యాధికారి చెప్తున్న కారణం మరీ విచిత్రంగా ఉంది. ‘హాస్పిటల్‌కు వచ్చేటప్పటికే ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందిట’ అని సెలవిచ్చారు. మరి... హాస్పిటల్‌కు వైద్యసహాయం అవసరమైనప్పుడు కాకుండా, హాయిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాలిడే వెకేషన్‌కు వచ్చినట్లు వస్తారా? వైద్యుల్లో సున్నితత్వం కనుమరుగైందని సుధా సైనీ మరణమే చెబుతోంది. ఇంగితం కూడా హరించుకుపోయిందా? ‘చనిపోయిన పేషెంట్ స్వాబ్ శాంపిల్స్ తీసుకున్నాం, కరోనా పరీక్ష నిర్వహిస్తాం’ అని చెప్తున్నారు. పరీక్షించి ఏం చెబుతారు? ఏం చెప్పినా ఒరిగేదేముంటుంది? సుధ, ఆమె బిడ్డలు తిరిగి రారు. వైద్యులు ఒక విషయాన్ని మాత్రం నిర్ధారించగలిగేది ఈ మరణాన్ని కరోనా మరణం కింద నమోదు చేసుకోవాలా, ఇతర మరణం కింద నమోదు చేసుకోవాలా అనేది మాత్రమే. ‘డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సంభవించిన మరణం’ అనే కాలమ్ మన అడ్మినిస్ట్రేషన్ చార్టుల్లో ఎక్కడా లేదు కాబట్టి... ప్రభుత్వ లెక్కల ప్రకారం సు«ధది సహజ మరణమే. ఇంకా చెప్పాలంటే... ‘వైద్యసదుపాయాలెన్ని కల్పించినప్పటికీ హాస్పిటళ్లకు వెళ్లకుండా ఇంట్లోనే పురుడు పోసుకోవడం వల్ల సంభవించిన మరణం ఇది’ అని భాష్యం చెప్పడానికి కూడా ఎవరికీ గొంతుకు ఏమీ అడ్డుపడకపోవచ్చు. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రడూన్ : ఆరు నెలల పాటు మంచుతో కప్పబడిన కేథర్నాథ్ ఆలయం బుధవారం ఉదయం 6:10 గంటలకు తిరిగి తెరుచుకుంది. ఏటా ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తజన సందోహం తరలివస్తారు. కానీ కరోనా కారణంగా ఈ సంవత్సరం భక్తులెవరినీ అనుమతించలేదు. తాత్కాలిక ఆలయం దర్శనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన పూజారి సహా అతికొద్దిమంది సమక్షంలో ఉదయం విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. ( ‘కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం’ ) చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యమైన డోలి యాత్రలో నిజానకి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ ఈసారి ఆ సందడి లేదు. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శించేందుకు ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. కానీ ఈసారి భక్త జన కోలాహాలం లేకుండానే తంతు పూర్తిచేశారు ఆలయ అర్చకులు. ఐదుగురు పండితులు కేథర్నాథ్ ఆలయానికి పంచముఖీ స్వామిని పల్లకిలో తీసుకువచ్చారు. Uttarakhand: Portals of the Kedarnath temple were opened at 6:10 am today. 'Darshan' for the devotees is not allowed at the temple as of now. https://t.co/v4Cj8RQja9 pic.twitter.com/jn5vUBN42N — ANI (@ANI) April 29, 2020 అత్యంత మంచుతో నిండిన ప్రాంతం అయినప్పటికీ పండితులు చెప్పులు లేకుండానే యాత్ర కొనసాగించారు. సాధారణంగా హిందూ పంచాగం ప్రకారం తీర్థయాత్రలు తేదీలు ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నిర్ణయిస్తారు. కానీ ఈ సంత్సరం కరోనా కట్టడి నేపథ్యంలో అన్ని తీర్థయాత్రలను రద్దు చేస్తూ నిర్ణయించారు. కొన్ని ప్రముఖ ఆలయాలకు అనుమతి ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించరు. -
ఉత్తరాఖండ్ సీఎంకు సమన్లు
-
ఓటుకు నోటు కేసు: ఉత్తరాఖండ్ సీఎంకు సమన్లు
ఉత్తరాఖండ్-లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (ఓటుకు నోటు) రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. గత ఏడాది దుమారం రేపిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై విచారణలో భాగంగా సీబీఐ ఈ చర్య తీసుకుంది. విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో సీఎంకు వ్యతిరేకంగా బయటపడిన స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 26 (సోమవారం)న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడంతోపాటు బీజేపీ లోని కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు వ్యతిరేకంగా దుమారం చెలరేగింది. 23మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వారితో మాట్లాడుతుండగా రికార్డయిన ఆడియో టేపు, వీడియో (సీడీ) వివాదాన్ని రాజేసింది. సీఎం హరీష్ రావత్ డబ్బులిస్తానని తమను మభ్యపెట్టేందుకు యత్నించారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించడం సంచలనానికి దారి తీసింది. దీనిపై సీబీఐ విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
డెహ్రాడూన్: జీపు లోయలో పడ్డ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి అల్మోరా ప్రాంతంలోని లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతిచెందారని చెప్పారు. గాయపడ్డవారిని రక్షించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే వీరు ఒకే కుటుంబానికి చెందినవారా.. ఎవరు అన్నది తెలియరాలేదు. బాధితుల పూర్తి వివరాలూ తెలియాల్సి ఉంది.