
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో శారదా బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డేంజర్ లెవెల్‌కు దిగువన నీటిమట్టం చేరుకుంది. ఇప్పటకీ శారది నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని అధికారులు వెల్లడించారు.
అదే విధంగా శారదా బ్రిడ్జి గేట్లను అధికారులు ఎత్తివేసినట్లు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. రెడ్ అలెర్ట్‌ను కూడా జారీ చేశారు. భారీ వర్షంతో పలు నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పలు రహదారులు కొట్టకుపోయాయి.
ఉత్తరఖాండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్సాలతో గోరీగంగా నది ఉప్పొంగి వరద ఉధృతికి కొట్టుకుపోయిన మున్సియారి-జౌల్‌జిబి రహదారి
Comments
Please login to add a commentAdd a comment