uttarkhand floods
-
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో శారదా బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డేంజర్ లెవెల్‌కు దిగువన నీటిమట్టం చేరుకుంది. ఇప్పటకీ శారది నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా శారదా బ్రిడ్జి గేట్లను అధికారులు ఎత్తివేసినట్లు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. రెడ్ అలెర్ట్‌ను కూడా జారీ చేశారు. భారీ వర్షంతో పలు నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పలు రహదారులు కొట్టకుపోయాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్సాలతో గోరీగంగా నది ఉప్పొంగి వరద ఉధృతికి కొట్టుకుపోయిన మున్సియారి-జౌల్జిబి రహదారి -
ఉత్తరాఖండ్‌పై వరద పడగ
దేశం కనీవినీ ఎరుగని వరద బీభత్సం ఈ ఏడాది హిమాలయ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. జూన్ 14 నుంచి వారానికిపైగా చెలరేగిన వరదల్లో దాదాపు ఆరువేల మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అత్యధికులు ‘చార్ధామ్’ యాత్రికులు. వేలాది మంది కొండకోనల్లో, గడ్డకట్టే చలిలో చిక్కుకుపోయి ఆకలితో అల్లాడిపోయారు. కుండపోత వానల్లో ఉత్తరాఖండ్ చివురుటాకులా వణికిపోయింది. వర్షపాతం సాధారణస్థాయి కంటే 375 శాతం ఎక్కువగా నమోదైంది. గంగ, దాని ఉపనదులైన అలకనంద, మందాకినిలు వెల్లువెత్తి విరుచుకుపడ్డాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, రుద్రప్రయాగ్, గౌరీకుండ్, సోన్‌ప్రయాగ్ తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు, పర్యాటకులు విలవిల్లాడారు. కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల వందలాది శవాలు తేలాయి. -
తొలగించలేదు... నేనే తప్పుకున్నా: జయంతి
న్యూఢిల్లీ: వివిధ పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల మంజూరులో జాప్యం చేసినందుకే తనను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్లు వచ్చిన వార్తలను జయంతి నటరాజన్ ఆదివారం ఖండించారు. నూరు శాతం పార్టీ పనుల కోసమే తాను పదవికి రాజీనామా చేసినట్లు పునరుద్ఘాటించారు. ఇంతకుమించి మరే కారణాలు లేవన్నారు. అలాగే తన హయాంలో ప్రాజెక్టులకు అనుమతులను ఎక్కడా నిలిపేయలేదని స్పష్టం చేశారు. అయితే ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో డ్యామ్‌లు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించిన మాట వాస్తవమేనన్నారు.