
న్యూఢిల్లీ: అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ తన కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని 2017 తర్వాత తిరిగి భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ 2020 గ్వాంగ్‌జౌ ఆటో షోలో ఆవిష్కరించబడిన ఎస్‌యూవీ మాదిరిగానే ఉంటుంది. జనవరి 2021 చివరి నాటికి ఈ కారు యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎస్‌యూవీల కంటే తక్కువ ధరకే లభిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. ఇందులో గత మోడల్ కంటే అప్డేటెడ్ ఫీచర్స్, అప్డేటెడ్ ఇంటీరియర్స్, రిఫ్రెష్ స్టైలింగ్ ను కలిగి ఉంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.(చదవండి: ఫార్చూనర్ కొత్త వెర్షన్...)
కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఫుల్-ఎల్ఈడి హెడ్లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఇడి టైల్లైట్స్, 7 స్లాట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్‌తో కొత్త ఫ్రంట్ బంపర్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్ ఉన్నాయి. ఫ్రంట్, రియర్ బంపర్స్ రెండూ కూడా సవరించబడ్డాయి. కొత్త డాష్‌బోర్డ్‌లో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఎఫ్‌సిఎ యొక్క కొత్త యుకనెక్ట్ 5 టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఎస్‌యూవీ యొక్క వెనుక భాగంలో పెద్దగా ఎటువంటి మార్పులు జరగలేదు. కొత్త జీప్ కంపాస్‌లో ఏడు-ఎయిర్‌బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి), బ్రేక్ అసిస్ట్ (బిఎ), టెర్రైన్ మోడ్లు, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ యొక్క డాష్‌బోర్డ్‌లో డబుల్-స్టిచ్చింగ్ బ్రౌన్ లెదర్ ఇన్సర్ట్‌లను మరియు బ్రష్ చేసిన అల్యూమినియం లాంటి ట్రిమ్‌ను కూడా పొందుతుంది. (చదవండి: కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment