
లాస్‌ఏంజెల్స్ : ప్రపంచంలోని అతిపెద్ద ఆటో షో ప్రారంభం కానుంది. లాంజ్ ఏంజెల్స్ ఎల్‌ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నవంబరు 30-డిసెంబరు 9 మధ్య దిగ్గజ ఆటో కంపెనీలన్నీ తన వాహానాలను ప్రద్శనకు ఉంచనున్నాయి. దాదాపు వెయ్యి దాకా కార్లు ఈ ఆటోషోలో విడుదల కానున్నాయి. . ఈ సందర్భంగా మీడియా ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు.
బీఎండబ్ల్యూ, వోల్వో, మెర్సిడెస్ బెంజ్, పోర్షే, వోక్స్‌వ్యాగన్ ఆడి, ల్యాండ్‌రోవర్ జాగ్వార్, ఫోర్డ్, టయోటా, హ్యుందాయ్‌లాంటి దిగ్గజ కంపెనీల లగ‍్జరీ, పాసింజర్ ఎస్‌యేవీలు ఆవిష్కతం కానున్నాయి. ముఖ్యంగా జీప్ తన మొదటి ట్రక్ గ్లాడియేటర్‌ను ఈ ఆటో షోలో పరిచయం చేసింది.
హ్యందాయ్‌కు చెందిన 8 పాసింజర్ ఎస్‌యూవీ పాలిసేడ్ పేరుతో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ రెండు వాహనాలను 2019 మార్చినాటికి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని కంపెనీలు ప్రకటించాయి.



