విశాఖ: విశాఖపట్టణం జిల్లా పెద్దబయలు మండలం తురకలవలస గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఒక జీపు లోయలో పడిపోయింది. అయితే జీపు పడిన ప్రాంతంలో ప్రయాణికులు ఎవరూ లేరు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు లోయలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. జీపు ఎవరిది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది. అందులో ప్రయాణిస్తున్నవారు ఏమయ్యారు అనే వివరాలు తెలియరాలేదు. పోలీసులు వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.