రోడ్డెక్కిన బుల్లి జీపు! | Battery Operated Ride On Jeep | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన బుల్లి జీపు!

Jul 11 2024 12:28 PM | Updated on Jul 11 2024 12:28 PM

Battery Operated Ride On Jeep

సాక్షి, హైదరాబాద్‌: బ్యాటరీతో నడిచే బుల్లి జీపు రోడెక్కింది. రయ్‌ రయ్‌ మంటూ ఇతర వాహనాలతో పోటీగా పరుగులు పెడుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మెహదీపట్నం నుంచి లక్డీకాపూల్‌ మీదుగా రోడ్డు మీద బుధవారం సాయంత్రం వేళలో వెళుతుండగా ‘సాక్షి’ కంట పడింది. 

రోడ్డు మీద వడివడిగా పరుగులు పెడుతున్న ఈ జీప్‌ను పలువురు వాహనదారులు ఫొటోలు, వీడియోలు తీస్తూ సంబరపడిపోయారు. వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్‌ వంటి పలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశారు. అయితే నంబరు ప్లేట్‌ లేకుండా, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకుండా రోడ్డుపై పరుగులు పెడుతున్న ఈ బుల్లి జీపుపై ట్రాఫిక్‌ పోలీసులు ఎలా స్పందిస్తారో!? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement