
జీఎస్‌టీతో చిన్న కార్ల ధరలు అప్!
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమల్లోకి రాబోయే వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంతో చిన్న, మధ్య స్థాయి కార్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. ప్రస్తుతం వీటిపై వ్యాట్ మొదలైన వివిధ పన్నులు 27–27.5 శాతం దాకా ఉంటున్నాయి.
జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఇవి 28 శాతానికి పెరుగుతాయని, ఫలితంగా చిన్న కార్ల ధరలు కూడా స్వల్పంగా పెరగవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. పది రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో జీఎస్‌టీ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.