సాక్షి, ముంబై: జిఎస్‌టీ ప్రభావంతో దేశంలో నాల్గవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కూడా ధరలు పెంచేసింది. వివిధ మోడళ్ల కార్లపై రూ. 7వేల నుంచి రూ. 89వేల దాకా ధరలను పెంచింది. పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్ల కార్లపై పెంచిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. సెస్ భారీగా పెరగడంతో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.సెప్టెంబర్ 11నుంచి ఈ సవరించిన ధరలను అమలు చేయనునట్టు హోండా ప్రకటించింది. దీంతో సిటీ, బిఆర్-వి, సిఆర్-వి మోడల్ కార్ల ధరలు భారీగా పెరగనున్నారు.
హోండా సిటీ కారు దేశంలో టాప్ మిడ్ సైజ్ కారువిక్రయాల్లో టాప్ 2 స్థానంలో ఉంది. దీని ధర పెంచిన ధరల ప్రకారం రూ. 13.62 లక్షలు. అటాగే టాప్ ఎండ్ బడ్జెట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ బీఆర్-వి (డీజిల్ వెర్షన్) ప్రస్తుత ధర రూ. 13.22 లక్షలు. ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్-వి ధర రూ.26.36లక్షలుగా ఉండనుంది.
కాగా జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా ఇటీవల ఇటియోస్, కొరిల్లా ఆల్టిస్, ఇన్నోవా క్రిస్తా, ఫార్య్చూనర్ ధరలను రూ.1.6లక్షల మేర పెంచుతున్నట్టు ప్రకటించింది.