Ambassador car
-
అలనాటి అందాల కింగ్ ఆఫ్ రోడ్... ఫోటోలు చూస్తే ఫిదా
-
1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!
మనం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నప్పటికీ అంబాసిడర్ వంటి అద్భుతమైన కార్లను ఎవ్వరూ మరచిపోలేరు. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందిన ఈ బ్రాండ్ కారు ఇప్పుడు మార్కెట్లో విక్రయానికి లేనప్పటికీ, అప్పుడప్పుడూ రోడ్లమీద కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలను ముందు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మొదలైనవారు ఈ కార్లను తెగ ఉపయోగించారు. అంతే కాకుండా అప్పట్లో రాయల సీమలో ఈ కార్లను ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అయితే ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ధర ఎంత అనే విషయాన్నీ ఈ కథనంలో చదివేద్దాం. 1964లో అంబాసిడర్ కారు ధర ఎంత అనేదానికి సంబంధించిన ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దీని ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం. వినటానికి కొంత వింతగా ఉన్నా.. అప్పట్లో ఈ కారు ధర అంతే అనటానికి కొన్ని ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1990 దశకంలో ఒక మెరుపు మెరిసిన అంబాసిడర్ కార్లను 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఆ తరువాత మారుతి కార్లు మార్కెట్లో విడుదలకావడం వల్ల వీటి ఆదరణ కొంత తగ్గింది, అయినప్పటికీ కొంత మంది అంబాసిడర్ అభిమానులు వీటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా వీటి అమ్మకాలు తగ్గడం వల్ల 2014లో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: Odysse EV Bike: ఒక్క ఛార్జ్‌తో 125 కిమీ రేంజ్.. రూ. 999తో బుక్ చేసుకోండి!) ఇక తాజాగా బయటపడిన అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ బిల్ ప్రకారం, ఇది 1964లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా తెలుస్తోంది. దీని ధర అప్పుడు రూ. 16.495 మాత్రమే. దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసింది. ఇందులో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు కూడా చూడవచ్చు. -
వచ్చేస్తోంది..ఇండియన్ రోడ్ల రారాజు..అంబాసీడర్ ఎలక్ట్రిక్ కార్
కోల్‌కత: సి.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది. -
ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!
షేర్ మార్కెట్ అదొక అర్థం కాని మయాజాలం. గ్రాఫులు , లెక్కలు, విశ్లేషణలు, మార్కెట్ పండితులు ఇలా ఎందరు ఎన్ని చెప్పినా అంచనాలు క్షణాల్లో పట్టు తప్పుతుంటాయ్. పదేళ్ల డేటాతో చేసిన విశ్లేషణ కంటే కూడా సెంటిమెంట్ పవర్ ఎక్కువ మార్కెట్లో. చాన్నాళ్ల తర్వాత మార్కెట్‌కి సెంటిమెంట్ రుచి చూపించి ఇన్వెస్టర్లకు రూపాయికి రూపాయి లాభం అది రెండు వారాల వ్యవధిలోనే అందించింది ఓ బ్రాండ్. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజులా వెలిగింది అంబాసిడర్ కారు. బిర్లాలకు చెందిన హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఈ కారును మార్కెట్లోకి తెచ్చింది. మార్కెట్లోకి రావడం ఆలస్యం ట్యాక్సీ డ్రైవర్ నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసును దోచుకుంది. 90వ దశకం వరకు సినిమాల్లో ఈ కారే కనిపించేది. అంబాసిడర్ అంటే స్టేటస్ సింబల్‌గా వెలిగిపోయింది. విదేశీ కార్లు ఇండియాలోకి వచ్చినా రాజకీయ నేతలు చాన్నాళ్ల పాటు అంబాసిడర్‌ని వదల్లేక పోయారు. అయితే ఆధునికతను సంతరించుకోక క్రమంగా అంబాసిడరే కనుమరుగై పోయింది. అంబాసిడర్ సెంటిమెంట్ పాత అంబాసిడర్‌కు కొత్తగా ఎలక్ట్రిక్ హంగులు అద్ది మార్కెట్లోకి తెస్తామంటూ హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు విదేశీ కంపెనీతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు వెల్లడించింది. రాబోయే ఎలక్ట్రిక్ అంబాసిడర్ కారు ప్రొటోటైప్ ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. పాత కాలం అంబాసిడర్‌ను కొత్త లుక్‌లో చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి చూపించింది. అంబాసిడర్ మీద ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. షేర్ల ధరకు రెక్కలు గడిచిన ఐదేళ్లుగా హిందూస్తాన్ మోటార్స్ షేరు రూ. 7 నుంచి రూ 10 దగ్గరే తిరుగాడుతోంది. కేవలం రెండు సార్లు మాత్రమే స్వల్ప కాలం పాటు రూ.15 గరిష్టాలను అందుకుంది. అంబాసిడర్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతుందన్న వార్త వచ్చిన తర్వాత హిందూస్థాన్ మోటార్స్ షేర్లకు రెక్కలు వచ్చాయి. లాభాలే లాభాలు మే 24న హిందూస్థాన్ మోటార్స్ ఒక్క షేరు ధర రూ. 10.80 దగ్గర ఉండగా జూన్ 8న షేరు ధర రూ.22.05కి చేరుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో షేరు ధర రెట్టింపు అయ్యింది. మే 24న ఎలక్ట్రిక్ అంబాసిడర్ వార్త విని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రెండు వారాలు తిరిగే సరికి మరో లక్ష లాభం కళ్ల చూడగలిగారు. ఇక ఎప్పటి నుంచో ఈ షేర్లను అట్టిపెట్టుకున్న వారు ఒక్క వార్తతో బూరెల బుట్టలో పడ్డట్టు అయ్యింది. చాలా కాలం పాలు లాభాలు అందివ్వని హిందూస్థాన్ మోటార్స్ షేర్లు ఒక్క వార్తతో తారా జువ్వలా లాభాల్లోకి దూసుకుపోయాయి. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు.. ఇప్పుడది దూసుకొస్తోంది
ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన అంబాసిడర్ కారు మార్కెట్లోకి వస్తోంది. అది కూడా కొత్త రూపులో కొత్త టెక్నాలజీతో అనే వార్తలు బయటకు రావడం ఆలస్యం అందరి దృష్టి అంబాసిడర్ మీదే పడింది. సామాన్యులు మొదలు ఇండస్ట్రియలిస్టుల వరకు అంబాసిడర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా ట్విటర్లో స్పందిస్తూ... మిలీనియం ముందు తరం వాళ్లకు అంబాసిడర్ గురించి బాగా తెలుసు. అదొక గొప్ప కారు మాత్రమే కాదు. కుటుంబంలో ఓ భాగం. అలాంటి కారు మళ్లీ తిరిగి రావడం సంతోషకరం అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరికొందరు నెటిజన్లు అంబాసిడర్ కారు పుట్టుపూర్వోత్తరాలను తవ్వి తీస్తున్నారు. చాలా మందికి తెలియని విషయాలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అంబాసిడర్ కారును తయారు చేసింది హిందూస్థాన్ మోటార్స్ అనే సంస్థ. పేరు వినగానే ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటాం. కానీ హిందూస్థాన్ మోటాన్స్ ప్రైవేటు సంస్థ. దాని వ్యవస్థాపకుడు సీకే బిర్లా. అంటూ అంబాసిడర్ కారు గురించి ఇప్పటి తరానికి తెలియని విషయాలు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే టాటాలకే కాదు బిర్లాలకు కూడా కార్ల కంపెనీ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. Little known fact is that this was a Birla car… HM belonged to my uncle Mr. CK #Birla!@hvgoenka 🙏 https://t.co/KhlnuxSg9l — Vedant Birla (@birla_vedant) May 30, 2022 హిందూస్థాన్ మోటార్ సంస్థ ఫ్రెంచ్‌కి చెందిన ప్యూగట్ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం త్వరలో సరికొత్త హంగులతో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా అంబాసిడర్‌ను ఇండియాలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఒకప్పటి ఐకానిక్ కారు మళ్లీ మార్కెట్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు చాలా మంది. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా?
అంబాసిడర్ కారు. పరిచయం అక్కర్లేని పేరు. భారత ఆటోమొబైల్ మార్కెట్లో లెజెండ్. ట్రెండ్‌కు అనుగుణంగా అప్డేట్ అవ్వకపోవడంతో 'సర్కారీ గాడి' సేల్స్ తగ్గిపోయాయి. దీంతో హిందుస్తాన్ ఆటోమొబైల్ ఆ కార్లకు స్వస్తి చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే కారు ఎలక్ట్రిక్ వెహికల్‌గా మార్కెట్‌కి పరిచయం కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ కొత్త అంబాసిడర్ ఎలక్ట్రిక్ కార్ మోడల్ ఇలా ఉంటుందంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన హిందుస్తాన్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్‌ఎంఎఫ్‌సీఎల్) డైరెక్టర్ ఉత్తమ్ బోస్ సైతం అంబాసీడర్ కారు లుక్ 'అంబోయ్'(amboy) తరహాలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో తన సొంత కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో అంబాసిడర్ కారు మెకానికల్, డిజైన్ వర్క్‌తో పాటు అడ్వాన్స్‌గా స్టేజ్‌తో కొత్త ఇంజిన్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం హిందుస్తాన్ మోటార్స్ ఫ్రెంచ్ కార్ మేకర్ పుజో(peugeot)తో చేతులు కలిపినట్లు పేర్కొన్నారు. ఆంబోయ్ మోడల్ తరహాలో ఉండే ఈ కారును 2024 ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు రాయిటర్స్ సైతం తన కథనంలో హైలెట్ చేసింది. మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారీ గతంలో హిందుస్తాన్ మోటార్స్ చెన్నై మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో మిత్సుబిషి కార్లను, వెస్ట్ బెంగాల్ ఉత్తరపార తయారీ ఫ్లాంట్లలో అంబాసిడర్ కార్లను తయారు చేసేది.కానీ మిత్సుబిషి కార్ల డిమాండ్ తగ్గడంతో పీకల్లోతో నష్టాల్లో కూరుకుపోయింది. అందుకే హిందుస్తాన్ మోటార్స్ 2014 సెప్టెంబర్‌లో మిత్సుబిషి కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. మూడు సంవత్సరాల తర్వాత 2017లో అంబాసీడర్ కారు మ్యాని ఫ్యాక్చరింగ్ హక్కుల్ని సైతం రూ.80కోట్లకు ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోకి అమ్మేసింది. తిరిగి మళ్లీ ఇప్పుడు చెన్నై ఫ్లాంట్‌లో హిందుస్తాన్ మోటార్స్ - పుజో భాగస్వామ్యంలో అంబాసిడర్‌ను కొత్త అవతార్‌లో తయారు చేస్తుంది. చదవండి👉 నా వ్యక్తిగత ఫోటోలతో ఇబ్బంది పెడుతున్నారు - అంకితి బోస్ స్వతంత్రం రాక ముందు భారత్‌కు స్వతంత్రం రాకముందు తొలిసారి హిందుస్తాన్ మోటార్స్(హెచ్‌ఎంఎఫ్‌సీఎల్) ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇండిపెండెన్స్ డే ముందు రోజుల్లో హెచ్‌ఎంఎఫ్‌సీఎల్ గుజరాత్ పోర్ట్ ఓఖా కేంద్రంగా అంబాసిడర్ కారు తయారీ ప్రయత్నాల్ని ప్రారంభించింది. కానీ నాటి అన్వేక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే రాచరికపు సంకెళ్లు తెంచుకుని సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాతి సంవత్సరం 1948లో బీఎం బిర్లా (బసంత్ కుమార్ బిర్లా) వెస్ట్ బెంగాల్ ఉత్తరపారలో చిన్న కార్ల తయారీ ఫ్లాంట్‌ను ప్రారంభించారు. అందులో ఐకానిక్ కార్లు మోరిస్10ను హిందుస్థాన్ 10లను తయారు చేసి మార్కెట్లో విడుదల చేశారు. మోరీస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 3 రైట్స్ హిందుస్తాన్‌దే 1950 సంవత్సరం మధ్య కాలంలో హిందుస్తాన్ మోటార్స్ అధినేత బీఎం బిర్లా భారత్ మార్కెట్లో అంబాసిడర్ బ్రాండ్ కార్లను అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని అనుకున్నారు. తొలత మోరిస్ ఆక్స్ ఫర్డ్ సిరీస్ 2 కారు ఆధారంగా హిందుస్తాన్ ల్యాండ్ మాస్టర్‌ను తయారు చేశారు. తర్వాతి కాలంలో మోరీస్ ఆక్స్ ఫర్డ్ సిరీస్ 3 హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఈ కారు ప్రేరణతో అంబాసిడర్ తయారీకి పునుకున్నారు. అలా మొదట్లో అంబాసిడర్ కారు సైడ్ వాల్వ్ ఇంజిన్‌తో వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, కొనుగోలు దారుల అభిరుచికి తగ్గట్లు అదే కారును ఓవర్‌హెడ్ వాల్వ్ ఇంజిన్‌గా తీర్చిదిద్దారు. ఇన్నోవేటీవ్‌గా, యజమానులకు ఈజీగా ఉండేందుకు కారును మోనోకోక్ మోడల్‌గా మార్చారు. సర్కారీ గాడీ బిర్లా కుటుంబంపై పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్కు ఎక్కువగా ఉండేది. అందుకే స్వదేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించేలా 1954 నాటి ప్రభుత్వ విధానాల్ని అనుసరించి తయారు చేసిన కార్లలో అంబాసిడర్ సర్కారీ గాడీగా గుర్తింపు పొందింది. కాంపిటీటర్ కార్లతో పోలిస్తే అంబాసిడర్ కార్ల వేరియంట్లు ప్రీమియర్ పద్మిని, స్టాండర్డ్10 కార్ల పరిమాణం విశాలంగా, రఫ్‌గా ఉండటం వల్ల ఇండియన్ రోడ్ల రారాజుగా దశాబ్దాల పాటు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది. ఈ కార్లను ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిరిగా వినియోగించే వారు. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, సంపన్నులు ఉపయోగించడంతో మార్కెట్‌ను శాసించింది. మారుతి 800 ఎంటర్ అంబాసిడర్ కారు ఐకానిక్ కారు స్టేటస్ సింబల్‌గా మారింది. దశాబ్దాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. కానీ 1980ల ప్రారంభంలో కాస్ట్ ఎక్కువ,మైలేజ్ తక్కువ కావడంతో పాటు, నాసికరంగా అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో వాటి అమ్మకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మారుతీ 800 లాంటి మోడల్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. ధర తక్కువ కావడం, మైలేజ్, ట్రెండ్‌కు తగ్గట్లు మోడళ్లు మార్కెట్లోకి రావడంతో అంబాసిడర్ కారుకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. 1980 నుంచి సంవత్సరానికి 20వేల కార్లు అమ్ముడుపోగా..రాను రాను ఆసేల్స్ 2వేలకు పడిపోయాయి. దీంతో 57ఏళ్ల పాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న అంబాసిడర్ కారు తయారీని హిందుస్తాన్ ఆటోమొబైల్ సంస్థ 2014లో నిలిపివేసింది. 2017లో అంబాసిడర్ కారు మ్యాని ఫ్యాక్చరింగ్ హక్కుల్ని రూ.80కోట్లకు ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోకి అమ్మేసింది. రీ ఎంట్రీ అదిరిపోయేలా అయితే ఇప్పుడు మళ్లీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారుతో రీ ఎంట్రి అదిరిపోయేలా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా హిందుస్తాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ “అప్పట్లో మా ఉద్యోగుల సంఖ్య 2,300 గా ఉండేది. ఇప్పుడు 300కి తగ్గింది. ప్రస్తుతం ఆర్ధిక సమస్యల నుంచి బయట పడ్డాం. ఇప్పుడు అంబాడిడర్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని అనుకున్నాం. ఇందుకోసం చైనీస్ ఈవీ సంస్థల్ని సంప్రదించాం. కానీ యూరోపియన్ కంపెనీలతో జతకట్టాలని నిర్ణయించుకున్నాం. రూ.600కోట్ల పెట్టుబడితో ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోతో కలిసి అంబాసిడర్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేయబోతున్నట్లు" ఉత్తమ్ బోస్ వెల్లడించారు. చదవండి👉మనోడు గట్టొడే! ఏకంగా ఈలాన్ మస్క్ మీదే వేశాడు పెద్ద పంచ్ -
హిందుస్తాన్ మోటార్స్.. కొత్త అవతార్!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ మోటార్స్.. దేశీయంగా తొలి కార్ల తయారీ సంస్థ. హుందాతనం ఉట్టిపడే అంబాసిడర్ కార్ల తయారీతో ఓ వెలుగు వెలిగింది. అయితే, కాలక్రమంలో వచ్చిన కొత్త మార్పులు, కస్టమర్ల అభిరుచులను అందిపుచ్చుకోలేక రేసులో వెనుకబడిపోయింది. చివరికి కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. అయితే, ఇప్పుడు మరోసారి ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈసారి సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)తో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం యూరోపియన్ ఆటోమొబైల్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అవగాహనా ఒప్పందం కుదుర్చుకోగా .. వచ్చే 2–3 నెలల్లో ఇవి ఒక కొలిక్కి రానున్నట్లు సంస్థ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ వెల్లడించారు. ముందుగా ద్విచక్ర వాహనాలు, ఆ తర్వాత కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ వెంచర్ ఏర్పాటు పైనే చర్చలు జరుగుతున్నప్పటికీ హిందుస్తాన్ మోటార్స్‌లో సదరు యూరోపియన్ కంపెనీ వాటాలు కొనుగోలు చేసే అవకాశాలూ ఉండొచ్చని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పారాలో .. 295 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంటును జేవీ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. గతం ఘనం..: హిందుస్తాన్ మోటార్స్‌ను (హెచ్ఎం) 1942లో బీఎం బిర్లా ప్రారంభించారు. 1970ల నాటికి హెచ్ఎంకు దేశీయంగా 75 శాతం పైగా మార్కెట్ వాటా ఉండేది. అయితే, 1983లో మారుతీ సుజుకీ కొత్తగా మారుతీ 800 కార్లను ప్రవేశపెట్టిన తర్వాత నుంచి కంపెనీ ప్రాభవం తగ్గడం మొదలైంది. 1984–1991 మధ్య కాలంలో అంబాసిడర్ మార్కెట్ వాటా దాదాపు 20 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత కాలంలో విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు కూడా భారత్‌లో భారీగా విస్తరించడం మొదలుపెట్టడంతో కంపెనీ పతనం మరింత వేగవంతమయ్యింది. హెచ్ఎంకు ఉత్తర్‌పారాలో దాదాపు 700 ఎకరాల స్థలం ఉండేది. కార్యకలాపాలు కుదేలు కావడంతో 2007లో 314 ఎకరాల మిగులు స్థలాన్ని శ్రీరామ్ ప్రాపర్టీస్‌కు విక్రయించేందుకు డీల్ కుదుర్చుకుంది. గతేడాది లాజిస్టిక్స్, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు కోసం మరో 100 ఎకరాలను కొనుగోలు చేసేందుకు హెచ్ఎంతో హీరానందానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. 2014 మేలో నిధుల కొరత, ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడం, ఉత్పాదకత పడిపోవడంతో ఉత్తర్‌పారా ప్లాంటులో ఉత్పత్తిని హెచ్ఎం నిలిపివేసింది. అదే ఏడాది డిసెంబర్లో పిఠమ్పూర్ ప్లాంటులో లేఆఫ్ ప్రకటించింది. ఆ తర్వాత 2017లో తమకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన అంబాసిడర్ బ్రాండును కూడా రూ. 80 కోట్లకు ప్యూజో ఎస్ఏకి అమ్మేసింది. ఇటీవలి హెచ్ఎం ఆర్థిక ఫలితాల ప్రకారం మార్చి 2022 ఆఖరు నాటికి కంపెనీకి రూ. 149 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. ప్రస్తుతం సుమారు 300 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. తాజాగా హీరానందానీతో డీల్ ద్వారా వచ్చే నిధులు.. రుణభారాన్ని తీర్చేసేందుకు ఉపయోగపడతాయని బోస్ పేర్కొన్నారు. మిగులు నిధులను కొత్తగా చేపడుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాల ప్రాజెక్టుపై వెచ్చించనున్నట్లు వివరించారు. చదవండి: భవీష్ అగర్వాల్.. మా ప్రాణాల్ని కాపాడండి! -
35 ఏళ్ల ప్రస్థానం.. కారు, డ్రైవర్‌కి ఒకేసారి వీడ్కోలు
ముంబై సెంట్రల్: ఒకప్పుడు ధనవంతుల వా హనంగా, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహ నంగా ప్రసిద్ధి పొందిన అంబాసిడర్ కారుకు మధ్య రైల్వేకు చెందిన ముంబై విభాగం తుది వీడ్కోలు పలికింది. కారుతోపాటు ఆ కారును 35 సంవత్సరాలుగా నడిపిస్తున్న డ్రైవర్ కూడా ఉద్యోగం నుండి రిటైర్మెంట్ పొందారు. 35 సంవత్సరాలుగా మధ్య రైల్వేలో సేవలందిస్తూ, ఇంతకాలం మిగిలి ఉన్న ఏకైక అంబాసిడర్ వాహనాన్ని స్క్రాప్ చేయాలని అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఆ కారును పూలదండలతో అలంకరించి, మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు. కరీరోడ్ డిపోలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. సెంట్రల్ రైల్వే సేవలలో మిగిలిఉన్న ఒకేఒక్క ఈ అంబాసిడర్ కారు 1985, జనవరి 22న రైల్వే సేవల్లోకి ప్రవేశించింది. అప్పట్నుంచి ఈ కారుకు డ్రైవర్‌గా ముత్తు పాండీ నాడార్ కొనసాగుతూ, కారుతో పాటే ఆయన కూడా మంగళవారం రిటైర్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్ ఉంటేనే ప్రవేశం -
వైరల్: 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం?
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో చాలామందికి మనుషులకు, సమాజానికి, టెక్నాలజీకి దూరంగా ఒంటరిగా బతకాలని అనిపిస్తుంది. కానీ అది ఆలోచన వరకే.. ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంగా చుట్టూ ఎవరూ లేకుంటే జీవించలేం, పిచ్చిలేస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 17 ఏళ్లుగా ఇంటికి దూరంగా అడవిలో జీవిస్తున్నారు. మరి ఇన్నేళ్లుగా జనజీవనానికి దూరంగా అడవిలో బతికేందుకు కారణం ఏమయ్యుంటుందో ఇప్పుడు చుద్దాం. కర్ణాటకలోని మంగళూరు అడవుల్లో 56 ఏళ్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి గత 17 ఏళ్లుగా ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అరంతోడ్ గ్రామం నుంచి అద్దేల్ నెక్కారే అడవుల్లో ప్రయాణం చేస్తుంటే అడవిలో చిన్న మార్గం పక్కన ప్లాస్టిక్ కవర్ కప్పిన గుడిసే కనిపిస్తుంది. అందులో ఒకప్పటి అంబాసిడర్ కారు ఉంటుంది. ఆ గుడిసెలోని కారులోనే చంద్రశేఖర్ నివసిస్తున్నాడు. తలపై భారీగా పెరిగిన జుట్టు, రెండు జతల బట్టలు, ఒక జత రబ్బరు చెప్పులతోనే, చంద్రశేఖర్ జీవిస్తున్నాడు. ఓ చిన్న గుడిసెలో ఉంటున్న ఇతని వద్ద ఓ రెడియో, పాత సైకిల్ మాత్రమే ఉన్నాయి. అయితే చంద్రశేఖర్ ఇంతకముందు ఇలా జీవించేవాడు కాదు. ఇతనికి 17 ఏళ్ల క్రితం ఆయనకు నెక్రల్ కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల భూమి ఉండేది. 2003లో సాగు నిమిత్తం ఆయన స్థానిక సహకార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. అయితే, కొన్ని కారణాల వలన ఆయన తన బాకీ తీర్చలేకపోయాడు. దీంతో అధికారులు ఆయన పొలాన్ని వేలం వేశారు. ఇది భరించలేని..చంద్రశేఖర్ తన కిష్టమైన కారు తీసుకుని సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత సోదరితో విబేధాలు వచ్చాయి. సొంత గ్రామానికి వెళ్లలే.. ఆత్మగౌరవం అడ్డొచ్చి, తీవ్ర అసంతృప్తితో సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో అద్దెల్ – నెక్కారే అడవిలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అడవిలో దొరికే కాయలు తింటూ, జలపాతాల వద్ధ స్నానం చేస్తూ జీవిస్తున్నాడు. ఆహారం కోసం బుట్టలు చేసి వాటిని సమీపంలోని గ్రామాల్లో అమ్మి వచ్చి డబ్బుతో కావాల్సిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆయన్ను కలిసి ఇల్లు కట్టిస్తానని చెప్పినా దానికి చంద్రశేఖర్ ఒప్పుకోలేదు. తనకు అడవి చాలని, అక్కడున్న జంతువులు తనను ఏమీ చేయవని అన్నారు. అటవీశాఖ అధికారులు కూడా చంద్రశేఖర్ కారణంగా అడవికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. -
అధి‘కార్’.. బేకార్
‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అన్నట్టు...ప్రభుత్వ వాహనాలు ‘తుప్పు’ పట్టిపోతున్నాయి. హోండా సిటీ.. కరోలా ఆల్టిస్.. మహీంద్రా స్కార్పియో..అలనాటి అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఇలా ఖరీదైన వాహనాలెన్నో సచివాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయాయి. ఈ వాహనాలు ఎందుకువినియోగించడం లేదో తెలియడం లేదు. హోండా సిటీ.. కరోలా ఆల్టిస్.. మహీంద్రా స్కార్పియో.. ఇంకా అలనాటిరాజ వాహనం అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఎన్నో అక్కడ పడివున్నాయి. ఎవరికీ పట్టనట్టున్నాయి. దుమ్ము కొట్టుకుపోయి.. శిథిలమైపోయి, పాక్షికంగా పాడైపోయి, పార్టులు పీకేసి.. చెట్ల కింద.. గోడ పక్కనా కార్లే. ఎటుచూసినా కార్లే. పదో, ఇరవయ్యో కాదు.. సుమారు 200 కార్లు. ఈఎంఐలు కట్టలేక దుబాయ్ ఎయిర్‌పోర్టులో కార్లు వదిలేసినవి కావు. నగరం నడిబొడ్డునున్న సెక్రటేరియట్లో కనిపించే పరిస్థితి ఇది. ప్రతి కారుకు ‘గవర్నమెంట్ వాహనం’ అన్న బోర్డులు సైతం ఉన్నాయి. ఎవరికోసం కొనుగోలు చేశారో.. ఎంతకాలం వాడారోగాని ఇప్పుడు ఎవరికీ కాకుండావదిలేయడంతో తుప్పు పట్టిపోతున్నాయి. వేలం వేసినా ప్రభుత్వానికి ఎంతోఆదాయం సమకూరేది. కానీ ఎవరికీ పట్టనట్టు వదిలేశారు. – ఫొటోలు: ఎం. అనిల్‌కుమార్ -
ఈ కారు ఎవరిది..?
మొయినాబాద్: పదిహేను రోజులుగా ఒకే చోట ఉన్న ఓ కారు స్థానికంగా కలకలం రేపుతోంది. కారు ఎవరిదో..?ఎవరు పార్కు చేశారో తెలియదు? కానీ పదిహేను రోజు లుగా మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల మహిళా సమాఖ్య భవనం ముందు నిలిపి ఉంది. ఏపీ 21 ఎం 2979 నెంబరుగల అంబాసిడర్ కారు పదిహేను రోజులుగా అక్కడే ఉండటంతో ఐకేపీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదిహేను రోజుల నుంచి కారు అక్కడే ఉందని, ఎవరూ తీసుకుపోవడం లేదని చెబుతున్నారు. కారు వెనక అద్దంపై ‘జై తెలంగాణ’ అని రాసి ఉంది. పోలీస్టేషన్‌కు పక్కనే ఉన్న ఈ కారు గురించి పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఓసారి ఐకేపీ సిబ్బంది విషయాన్ని పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు కారు గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. -
తారా కారు!
సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన కాలంలో తారలు వాడిన కార్లు ఇవి. ప్రస్తుతం గ్యారేజీలకు మాత్రమే పరిమితమైన ఈ వాహనాలు అలనాటి తారావైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. * ఈ షెవర్లే కారులోనే అలనాటి అందాల తార జమున అప్పట్లో షికారు చేసేవారు. ఇప్పుడిది వాడుకలో లేదు. అయినా ఈ వాహనంపై జమునకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే, ఇప్పటికీ దానిని అమూల్యంగా చూసుకుంటున్నారు. * ఇక ఈ అంబాసిడర్ కారు ‘అన్నగారు’ ఎన్టీఆర్ వాడినది. తాతగారి జ్ఞాపకంగా కళ్యాణ్‌రామ్ తన ఇంట్లో దీనిని అపురూపంగా భద్రపరచుకున్నారు. * టొయోటా కారేమో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ముచ్చటపడి కొనుక్కున్న వాహనం. దీనికి ఏరికోరి ఫ్యాన్సీ నంబర్ ‘1’ ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే చిరంజీవి కూడా అనతికాలంలోనే టాలీవుడ్లో నంబర్ 1 స్థానానికి ఎదిగారు.