
కోల్‌కత: సి.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి.
జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది.
అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment