Hindustan Motors
-
వచ్చేస్తోంది..ఇండియన్ రోడ్ల రారాజు..అంబాసీడర్ ఎలక్ట్రిక్ కార్
కోల్‌కత: సి.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి హిందుస్తాన్ మోటార్స్
సి.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది. చదవండి: బంగారమా? ఇల్లా? పెట్టుబడికి ఏది బెటర్? ఈ విషయాలు తెలుసుకోండి! -
హిందుస్తాన్ మోటర్స్.. ఎలక్ట్రిక్ టూవీలర్స్
కోల్‌కతా: ఒకప్పటి అంబాసిడర్ కార్ల తయారీ సంస్థ హిందుస్తాన్ మోటర్స్ (హెచ్ఎం) తాజాగా ఎలక్ట్రిక్ టూవీలర్ల ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం యూరప్‌కి చెందిన సంస్థతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాదిలో వాహనాల తయారీని ప్రారంభించే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ వెల్లడించారు. తర్వాత దశలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు సంస్థలకు సంబంధించిన ఆర్థిక అంశాల మదింపు జూలైలోనే ప్రారంభం అవుతుందని, ఇందుకోసం రెండు నెలల సమయం పట్టొచ్చని బోస్ చెప్పారు. అటు పైన జాయింట్ వెంచర్ సాంకేతిక అంశాల మదింపు ప్రారంభం అవుతుందని, దీనికి మరో నెల రోజులు పట్టొచ్చని పేర్కొన్నారు. ఆ తర్వాత పెట్టుబడుల స్వరూపం గురించి నిర్ణయం తీసుకోవడం, కొత్త సంస్థను ఏర్పాటు చేయడం మొదలైనవి ఉంటాయన్నారు. ఇదంతా ఫిబ్రవరి 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని బోస్ వివరించారు. ‘కొత్త సంస్థ ఏర్పాటు చేశాక, ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన మొదలెట్టడానికి మరో రెండు క్వార్టర్లు పడుతుంది. మొత్తం మీద వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తుది ఉత్పత్తిని ఆవిష్కరించవచ్చు‘ అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల ప్రాజెక్టు అమల్లోకి వచ్చిన రెండేళ్లకు కార్ల తయారీపై దృష్టి పెడతామని బోస్ చెప్పారు. -
టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు.. ఇప్పుడది దూసుకొస్తోంది
ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన అంబాసిడర్ కారు మార్కెట్లోకి వస్తోంది. అది కూడా కొత్త రూపులో కొత్త టెక్నాలజీతో అనే వార్తలు బయటకు రావడం ఆలస్యం అందరి దృష్టి అంబాసిడర్ మీదే పడింది. సామాన్యులు మొదలు ఇండస్ట్రియలిస్టుల వరకు అంబాసిడర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా ట్విటర్లో స్పందిస్తూ... మిలీనియం ముందు తరం వాళ్లకు అంబాసిడర్ గురించి బాగా తెలుసు. అదొక గొప్ప కారు మాత్రమే కాదు. కుటుంబంలో ఓ భాగం. అలాంటి కారు మళ్లీ తిరిగి రావడం సంతోషకరం అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరికొందరు నెటిజన్లు అంబాసిడర్ కారు పుట్టుపూర్వోత్తరాలను తవ్వి తీస్తున్నారు. చాలా మందికి తెలియని విషయాలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అంబాసిడర్ కారును తయారు చేసింది హిందూస్థాన్ మోటార్స్ అనే సంస్థ. పేరు వినగానే ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటాం. కానీ హిందూస్థాన్ మోటాన్స్ ప్రైవేటు సంస్థ. దాని వ్యవస్థాపకుడు సీకే బిర్లా. అంటూ అంబాసిడర్ కారు గురించి ఇప్పటి తరానికి తెలియని విషయాలు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే టాటాలకే కాదు బిర్లాలకు కూడా కార్ల కంపెనీ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. Little known fact is that this was a Birla car… HM belonged to my uncle Mr. CK #Birla!@hvgoenka 🙏 https://t.co/KhlnuxSg9l — Vedant Birla (@birla_vedant) May 30, 2022 హిందూస్థాన్ మోటార్ సంస్థ ఫ్రెంచ్‌కి చెందిన ప్యూగట్ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం త్వరలో సరికొత్త హంగులతో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా అంబాసిడర్‌ను ఇండియాలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఒకప్పటి ఐకానిక్ కారు మళ్లీ మార్కెట్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు చాలా మంది. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
హిందుస్తాన్ మోటార్స్.. కొత్త అవతార్!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ మోటార్స్.. దేశీయంగా తొలి కార్ల తయారీ సంస్థ. హుందాతనం ఉట్టిపడే అంబాసిడర్ కార్ల తయారీతో ఓ వెలుగు వెలిగింది. అయితే, కాలక్రమంలో వచ్చిన కొత్త మార్పులు, కస్టమర్ల అభిరుచులను అందిపుచ్చుకోలేక రేసులో వెనుకబడిపోయింది. చివరికి కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. అయితే, ఇప్పుడు మరోసారి ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈసారి సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)తో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం యూరోపియన్ ఆటోమొబైల్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అవగాహనా ఒప్పందం కుదుర్చుకోగా .. వచ్చే 2–3 నెలల్లో ఇవి ఒక కొలిక్కి రానున్నట్లు సంస్థ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ వెల్లడించారు. ముందుగా ద్విచక్ర వాహనాలు, ఆ తర్వాత కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ వెంచర్ ఏర్పాటు పైనే చర్చలు జరుగుతున్నప్పటికీ హిందుస్తాన్ మోటార్స్‌లో సదరు యూరోపియన్ కంపెనీ వాటాలు కొనుగోలు చేసే అవకాశాలూ ఉండొచ్చని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పారాలో .. 295 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంటును జేవీ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. గతం ఘనం..: హిందుస్తాన్ మోటార్స్‌ను (హెచ్ఎం) 1942లో బీఎం బిర్లా ప్రారంభించారు. 1970ల నాటికి హెచ్ఎంకు దేశీయంగా 75 శాతం పైగా మార్కెట్ వాటా ఉండేది. అయితే, 1983లో మారుతీ సుజుకీ కొత్తగా మారుతీ 800 కార్లను ప్రవేశపెట్టిన తర్వాత నుంచి కంపెనీ ప్రాభవం తగ్గడం మొదలైంది. 1984–1991 మధ్య కాలంలో అంబాసిడర్ మార్కెట్ వాటా దాదాపు 20 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత కాలంలో విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు కూడా భారత్‌లో భారీగా విస్తరించడం మొదలుపెట్టడంతో కంపెనీ పతనం మరింత వేగవంతమయ్యింది. హెచ్ఎంకు ఉత్తర్‌పారాలో దాదాపు 700 ఎకరాల స్థలం ఉండేది. కార్యకలాపాలు కుదేలు కావడంతో 2007లో 314 ఎకరాల మిగులు స్థలాన్ని శ్రీరామ్ ప్రాపర్టీస్‌కు విక్రయించేందుకు డీల్ కుదుర్చుకుంది. గతేడాది లాజిస్టిక్స్, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు కోసం మరో 100 ఎకరాలను కొనుగోలు చేసేందుకు హెచ్ఎంతో హీరానందానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. 2014 మేలో నిధుల కొరత, ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడం, ఉత్పాదకత పడిపోవడంతో ఉత్తర్‌పారా ప్లాంటులో ఉత్పత్తిని హెచ్ఎం నిలిపివేసింది. అదే ఏడాది డిసెంబర్లో పిఠమ్పూర్ ప్లాంటులో లేఆఫ్ ప్రకటించింది. ఆ తర్వాత 2017లో తమకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన అంబాసిడర్ బ్రాండును కూడా రూ. 80 కోట్లకు ప్యూజో ఎస్ఏకి అమ్మేసింది. ఇటీవలి హెచ్ఎం ఆర్థిక ఫలితాల ప్రకారం మార్చి 2022 ఆఖరు నాటికి కంపెనీకి రూ. 149 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. ప్రస్తుతం సుమారు 300 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. తాజాగా హీరానందానీతో డీల్ ద్వారా వచ్చే నిధులు.. రుణభారాన్ని తీర్చేసేందుకు ఉపయోగపడతాయని బోస్ పేర్కొన్నారు. మిగులు నిధులను కొత్తగా చేపడుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాల ప్రాజెక్టుపై వెచ్చించనున్నట్లు వివరించారు. చదవండి: భవీష్ అగర్వాల్.. మా ప్రాణాల్ని కాపాడండి! -
అంబాసిడర్ బ్రాండ్ అమ్మేశారు..
కోలకత్తా: అంబాసిడర్..ఒకపుడు ఈ పేరు వింటేనే.. అదో రాజసం..దర్పం...దశాబ్దం క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన ఈ ఐకానిక్ కారు బ్రాండ్‌ను ఓ విదేశీ కార్ల సంస్థసొంతం చేసుకుంది. దేశీయ కార్ మేకర్ హిందుస్తాన మోటార్స్ అంబాసిడర్ కారు బ్రాండ్ ను ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ప్యుగోట్‌కు విక్రయించింది. ఈ మేరకు సి కె బిర్లా గ్రూప్ యాజమాన్యంలోని హిందూస్థాన్ మోటార్స్ శుక్రవారం రూ .80 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ ట్రేడ్ మార్క్ అమ్మకం ద్వారా వచ్చి న ఆదాయాన్ని ఉద్యోగులు , రుణదాతల బకాయిలను క్లియర్ చేయడానికి ఉపయోగించనున్నట్టు సికె బిర్లా గ్రూప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ప్యుగోట్ ఈ బ్రాండ్ ను ఇండియాలో పునరద్ధరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఏడు దశాబ్దాల క్రితం అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని హిందుస్తాన్ మోటార్స్ లాంచ్ చేసింది. మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ కి కొద్ది మార్పులు చేసిదీన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. 1960 -70 దశకాల్లో ఒక వెలుగు వెలిగింది. భారత రోడ్లపై అంబాసిడర్ వాహనాల ఆధిపత్యం కొనసాగింది. దాదాపు 1980లో మారుతి 800 రాక అంబాసిడర్‌కు భారీ దెబ్బ తగిలింది. ఎంతగా అంటే...1980 మధ్యకాలంలో 24వేల అంబాసిడర్ వాహన విక్రయాలు నమోదు కాగా, 2013-14 నాటికి విక్రయాలు 2,500 స్థాయికి పడిపోయాయి. కాగా ఈ కార్ల ఉత్పత్తి మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయింది. -
చిన్న వాహనాలకు పెద్ద కష్టాలు..
♦ రుణమిచ్చేందుకు బ్యాంకులు ససేమిరా ♦ తగ్గిన చిన్న వాణిజ్య వాహన అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చిన్న వాణిజ్య వాహన (ఎస్సీవీ) రంగానికి పెద్ద కష్టాలే వచ్చిపడ్డాయి. మందగమనం ప్రభావం ఇంకా భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా వీడకపోవటంతో ఈ పరిశ్రమ అంతగా పురోగమించలేదు. మరోవంక సరుకు రవాణా రంగంలో అవసరానికి మించి వాహనాలున్నాయి. వాహన యజమానుల నుంచి నెలవారీ చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో బ్యాంకుల వద్ద బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త వాహనాలకు ఆర్థిక సహాయం చేసేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఈ అంశాలే ఎస్సీవీ విభాగ పురోగతిని అడ్డుకుంటున్నాయని టాటా మోటార్స్ చెబుతోంది. ఈ విభాగంలో అగ్రశ్రేణి సంస్థగా నిలిచిన తమపై కూడా ఈ ప్రభావం ఎక్కువేనంటోంది. చిన్న వాణిజ్య వాహన విభాగంలో టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్ లేలాండ్, ఫోర్స్, పియాజియో, హిందుస్తాన్ మోటార్స్ పోటీపడుతున్నాయి. 30 శాతం దరఖాస్తులే.. కొన్నేళ్ల కిందటిదాకా వాహన ఫైనాన్స్ కోసం 100 దరఖాస్తులు వస్తే.. 70 వరకు దరఖాస్తులను బ్యాంకులు ఓకే చేసేవి. కానీ ఇప్పుడు స్టోరీ మారింది. 30 దరఖాస్తులకు కూడా రుణం లభించడం లేదు. ఒకానొక దశలో 100 శాతం ఫైనాన్స్ సమకూర్చిన బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఇప్పుడు 50 శాతం ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాయి. దీనంతటికీ కారణం బ్యాంకుల వద్ద బకాయిలు ఇబ్బడి ముబ్బడిగా ఉండడమే. రవాణా వ్యాపారం అంతగా సాగకపోవడంతో వాహన యజమానులు నెలవారీ వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. ఫైనాన్స్ కంపెనీలు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. 2014-15లో చిన్న వాణిజ్య వాహన పరిశ్రమలో 30 శాతం నెగటివ్ వృద్ధి నమోదయినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ఎస్సీవీ విభాగంలో భారత్‌లో నెలకు సుమారు 12,000 వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇందులో టాటా మోటార్స్‌కు 85 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇంకా అట్టిపెట్టుకుంటున్నారు.. సరుకు రవాణా కోసం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక భారీ ట్రక్కుకు నాలుగు చిన్న వాహనాలు చొప్పున ఉన్నాయి. భారత్‌లో ఇది 2.5 మాత్రమే. ఇక గతంలో నాలుగైదేళ్లు కాగానే వాహనాన్ని మార్చి కొత్తది కొనేవారు. ఇప్పుడు రీప్లేసింగ్ కాలం 7-8 ఏళ్లకు వచ్చిందని టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.రామకృష్ణన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వ్యాపారాలు సరిగా లేక యజమానులు పాత వాహనాలనే కొనసాగిస్తున్నారని చెప్పారు. పోనీ వాహనం అమ్ముదామన్నా మంచి ధర వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే రోడ్డు మీద ఇబ్బడిముబ్బడిగా వాహనాలు ఖాళీగా తిరుగుతున్నాయి. వాహనం కొని కొన్ని నెలలైనా విక్రయిస్తే వచ్చే మొత్తం 50-60% మించడం లేదు. -
ఇసుజు నుంచి ఎంయు-7 ఆటోమేటిక్ వేరియంట్
ధర రూ.23.9 లక్షలు న్యూఢిల్లీ : ఇసుజు మోటార్స్ ఇండియా కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఎంయు-7 మోడల్లో ఆటోమేటిక్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.23.9 లక్షలని(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ఎండీ నవోహిరో యమగుచి చెప్పారు. ఎంయు-7 మోడల్‌ను 2013 డిసెంబర్లో మార్కెట్లోకి తెచ్చామని వివరించారు. మార్కెట్ అవసరాలకనుగుణంగా ఈ ఆటోమేటిక్ వేరియంట్‌ను అందించామని, ఈ వేరియంట్‌కు మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ ఎంయు-7 ఎస్‌యూవీని కంప్లీట్లీ నాక్డ్ డౌన్(సీకేడీ) కిట్ల రూపంలో దిగుమతి చేసుకొని హిందుస్తాన్ మోటార్స్‌కు చెందిన చెన్నై సమీపంలోని తిరువల్లూర్ ప్లాంట్‌లో కంపెనీ అసెంబుల్ చేస్తోంది. -
ఈ ఏడాదే భారత్‌కు మాంటెరో
వచ్చే ఏడాది ఔట్‌ల్యాండర్ హిందుస్తాన్ మోటార్స్ సీఈవో విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌కు చిన్న కార్లను తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని హిందుస్తాన్ మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఈవో పి.విజయన్ తెలిపారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపైనే (ఎస్యూవీ) ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామని పేర్కొ న్నారు. ఇక్కడి బంజారాహిల్స్‌లో మిత్సుబిషి షోరూంను ప్రారంభించిన సందర్భంగా ప్రైడ్ మిత్సుబిషి ఎండీ ఎం.సురేష్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా 28-30 వేల వాహనాలు అమ్ముడవుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ-4 విభాగంలో మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుందని, ఏటా దేశీయంగా 3 వేల యూనిట్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. హిందుస్తాన్ మోటార్స్, మిత్సుబిషి మధ్య సాంకేతిక, మార్కెటింగ్ ఒప్పందం ఉంది. మరో రెండు మోడళ్లు..: హిందుస్తాన్ మోటార్స్ మిత్సుబిషికి చెందిన మాంటెరో, ఔట్‌ల్యాండర్ మోడళ్లను భారత్‌లో తిరిగి ప్రవేశపెడుతోంది. మాంటెరో ఈ ఏడాదే మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.60 లక్షల వరకు ఉండొచ్చని విజయన్ తెలిపారు. ఇక వచ్చే ఏడాది జూన్‌కల్లా ఔట్‌ల్యాండర్‌ను డీజిల్, పెట్రోల్ వర్షన్లలో ప్రవేశపెడతాం. దీని ధర రూ.25 లక్షలుండొచ్చని పేర్కొన్నారు. -
కార్ల కంపెనీలపై కొరడా..
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగానికి తొలిసారి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) షాకిచ్చింది. దేశీయంగా కార్లను తయారు చేసే 14 కంపెనీలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించింది. వీటిలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉండటం గమనార్హం. విడిభాగాలు, విక్రయానంతర సేవలకు సంబంధించి వ్యాపార నిబంధనలను ఉల్లంఘించినందున జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ పేర్కొంది. ఇదీ జాబితా... జరిమానాకు గురైన జాబితాలో దేశ, విదేశీ కార్ల కంపెనీలు చోటుచేసుకున్నాయి. అత్యధికంగా టాటా మోటార్స్‌పై రూ. 1,346.46 కోట్ల జరిమానా విధించగా, మారుతీపై రూ. 471.14 కోట్ల భారం పడనుంది. ఈ జాబితాలో ఎంఅండ్ఎం(రూ.292.25 కోట్లు), టయోటా కిర్లోస్కర్(రూ.93.38 కోట్లు), జనరల్ మోటార్స్(రూ. 84.58 కోట్లు), హోండా సియల్(రూ. 78.47 కోట్లు), స్కోడా ఆటో(రూ.46.39 కోట్లు), ఫోర్డ్ ఇండియా (రూ.39.78 కోట్లు), ఫియట్ ఇండియా(రూ. 29.98 కోట్లు), బీఎండబ్ల్యూ(రూ.20.41 కోట్లు), మెర్సిడెస్ బెంజ్(రూ. 23.08 కోట్లు), హిందుస్తాన్ మోటార్స్(రూ. 13.85 కోట్లు), ఫోక్స్‌వ్యాగన్(రూ. 3.25 కోట్లు), నిస్సాన్ మోటార్స్(రూ. 1.63 కోట్లు) ఉన్నాయి. దేశీయంగా కార్లు తయారు చేసే 14 కంపెనీలపై మొత్తం రూ. 2,544.64 కోట్ల జరిమానా విధిస్తూ 215 పేజీలతో కూడిన ఆదేశాలను సీసీఐ జారీ చేసింది. రెండు నెలల్లోగా డిపాజిట్ చేయాలి: విడిగా ఒక్కో సంస్థపైనా విధించిన జరిమానాకు సంబంధించి సీసీఐ వివరణ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీల సగటు టర్నోవర్‌పై 2% మొత్తాన్ని జరిమానాగా ప్రకటించింది. ఈ మొత్తాలను 60 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కాగా, ఈ ఆదేశాలపై వ్యాఖ్యానించేందుకు నిస్సాన్ మోటార్ ఇండియా ప్రతినిధి నిరాకరించగా, మిగిలిన 13 కంపెనీల ప్రతినిధులు సైతం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. సీసీఐ ఏం చెప్పిందంటే... పూర్తిస్థాయిలో చేపట్టిన దర్యాప్తులో భాగంగా పోటీతత్వ నిబంధనలను ఈ 14 కంపెనీలు ఉల్లంఘించాయని సీసీఐ తేల్చిచెప్పింది. ప్రాంతీయ ఒరిజినల్ విడిభాగాల సరఫరాదారుల(ఓఈఎస్‌ఎస్)తోపాటు, అధీకృత డీలర్లుతో ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపింది. ఈ ఒప్పందాల ద్వారా విడిభాగాల సరఫరాదారులను పూర్తిగా నియంత్రించడం, విక్రయానంతరం విడిభాగాలు సరఫరా చేసే అవకాశాలను మూసివేయడం వంటివి చేసినట్లు సీసీఐ వివరించింది. పలు కార్ల కంపెనీలు బహిరంగ మార్కెట్లోకి (నాన్-ఆథరైజ్డ్ అవుట్‌లెట్స్) విడిభాగాలు సరఫరా చేయకపోవడంతో వాహన యజమానులు సంబంధిత కార్ల కంపెనీ వర్క్‌షాప్ లేదా షోరూమ్‌కు వెళ్లి కొనాల్సివస్తోంది. సహజంగానే అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా సులభంగా దొరకవు కూడా. నాన్ ఆథరైజ్డ్ అవుట్‌లెట్స్‌లో విడిభాగాలను విక్రయిస్తే తమ ఆదాయం దెబ్బతింటుందంటూ కార్ల కంపెనీల డీలర్లు వ్యక్తంచేసే ఆందోళన కారణంగా కూడా ఇవి బహిరంగ మార్కెట్లోకి సరఫరా కావడం లేదు. సీసీఐ కార్ల కంపెనీలపై కొరడా ఝుళిపించవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇటీవలే ఫోర్డ్ ఇండియా తన కార్ల విడిభాగాలను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించింది. పైగా ఇందువల్ల తమ కస్టమర్లకు కారు నిర్వహణా వ్యయం తగ్గుతుందని ఆ కంపెనీ ఇంతక్రితం ప్రకటించింది. -
జ్ఞాపకం: భారతీయుల కారు... విశేషాలు బోలెడు!
మీకు ఆంబీ తెలుసా... అదేంటని అడక్కండి. ఆంబీ అంటే అంబాసిడర్ కారు. ఇది దాని ముద్దుపేరు. ఇటీవలే ఈ కారు ఉత్పత్తి బంద్ చేస్తూ... ఆ కారు ఉత్పత్తి దారు హిందూస్తాన్ మోటార్స్ నిర్ణయం తీసుకుంది. ఆ వార్తను ప్రజలు ఒక మనిషి మరణంలా, ఎమోషనల్‌గా చూడటమే ఆ కారు గొప్పతనం. ఈ సందర్భంగా దాని విశేషాలు... చిన్నప్పుడు ఎవరైనా పిల్లలను కారు బొమ్మ గీయమని అడిగితే వారు గీసే బొమ్మ కారు ఏంటో తెలుసా? అంబాసిడర్‌దే. ముందు ఇంజిను, వెనుక డిక్కీ, మధ్యలో బాడీ. పిల్లలు చాలా సులువుగా నేర్చుకునే మొదటి బొమ్మ... బహుశా ఇదే కావచ్చు. మీ ఇంట్లో శాంత్రో, స్విప్టు వంటి హ్యాచ్ బ్యాక్ కార్లున్నా, వాటిలో మీ పిల్లలు తిరుగుతున్నా వారు గీసే కారు బొమ్మ మాత్రం అంబాసిడర్‌దే. అంతగా భారతీయులతో ఆ కారు పెనవేసుకుపోయింది. అంతెందుకు ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు ఎన్నో కార్ల ఉత్పత్తిని ఆపేశాయి. కానీ అవేవీ బిజినెస్ పేజీని దాటి రాలేదు. అవేవీ ఫీచర్ స్టోరీ కాలేదు. ఎందుకంటే అవన్నీ కేవలం కార్లు అంతే. కానీ ‘ఆంబీ’ కేవలం కారు కాదు, ఓ ఫీలింగ్, ఓ చిహ్నం. అంబాసిడర్ చివరి కారును కోల్‌కతా శివారులోని ఉత్తర్పుర ప్లాంటులో తయారుచేశారు. ఈ కారు మోడల్‌ను 1956లో బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ నగరంలో ఉన్న మోరీస్ మోటార్ రూపకల్పన చేసింది. ఈ కారుకు బ్రిటన్‌లో కొన్ని మూలాలున్నా ఇది ఇండియా కారు. ఇండియన్ కంపెనీ తయారుచేసిన కారు. 1958 నుంచి సీకె బిర్లా గ్రూపునకు చెందిన హిందూస్తాన్ మోటార్స్ ఇండియాలో అధికారికంగా అమ్మకాలు మొదలుపెట్టింది. ఈ కారు ప్రపంచంలోనే అత్యధిక కాలం వినియోగంలో ఉన్నవాటిలో ఒకటి. అంతకుముందున్న హిందూస్తాన్ ల్యాండ్ మాస్టర్ స్థానాన్ని ఈ కారు ఆక్రమించింది. అనంతరం అనూహ్యంగా ప్రజాభిమానం చూరగొని పెద్ద సంఖ్యలో అమ్ముడుపోయింది. అప్పటి కార్లలో ఎక్కువ లెగ్‌రూమ్, సీటింగ్ స్పేస్, డిక్కీ ఉండి ఇండియా రోడ్లకు అనుగుణంగా ఉన్న మరో కారు లేదు. దీంతో విదేశీ కార్లున్నా గ్రామాలకు కూడా ప్రయాణించగలిగిన ఆంబీలను నేతలు ఎన్నుకునేవారు. పైగా సదుపాయాలున్న ఇండియన్ కారు కావడంతో దానివైపే మొగ్గుచూపేవారు. కారు మంచి బందోబస్తుగా ఉండేది. దీంతో ఎలాంటి ఇండియన్ రోడ్లయినా ఇది తట్టుకునేది. 2011లో కాలుష్య ప్రమాణాల ప్రకారం లేనందున 2011లో దీనిని 11 భారతీయ నగరాలు నిషేధించాయి. దీంతో కొత్త ప్రమాణాలతో కొత్త మోడల్స్ కొన్ని విడుదలయ్యాయి. అలా అంబాసిడర్ చివరి మోడల్ ‘అంబాసిడర్ ఎన్కోర్’ 2013లో విడులైంది. మూడు నాలుగేళ్ల నుంచి భారీ నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 2014 మే 25న ఈ కారు బంద్ అయ్యింది. కొన్ని విశేషాలు: 2003 వరకు భారత ప్రధాన మంత్రి కాన్వాయ్ కార్లు ఇవే. ఆ ఏడాది తర్వాత జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ పీఎం కాన్వాయ్ అయ్యింది. మారుతి 800 అతి తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో ఆంబీ ఆర్థిక పతనం మొదలైంది. ఇది బీబీసీ టాప్ గేర్ షోలో ‘వరల్డ్ బెస్ట్ ట్యాక్సీ’గా కూడా అభినందనలు అందుకుంది. నటుడు శరత్‌కుమార్‌కు ఈ కారంటే మహా ఇష్టమట. ఆ కారు కనిపిస్తే ఒకసారి నడపాలనుకుంటారట. ఇది అతిఎక్కువ కాలం ‘ఫ్యామిలీ కార్’గా మన్ననలు పొందింది. పెద్ద బంగళా ఉందంటే... అంబాసిడర్ ఉండాల్సిందే. {పతి భారతీయుడికి తెలిసిన కారు ఇదొక్కటే. విడుదలైన ప్రతి రంగులోనూ బాగా కనిపించిన ఏకైక కారు ఇదేనట. అంబాసిడర్ కారు తోలడం అంటే ప్రపంచంలో ఇక ఏ కారైనా సులువుగా హ్యాండిల్ చేయొచ్చు. ఆంబీ, వీఐపీ కార్, ఫ్యామిలీ కార్, ట్యాక్సీ కార్... ఇవన్నీ దాని ముద్దు పేర్లు. ‘ఎర్ర బుగ్గ’ ఈ కారుకు సెట్ అయినట్టు మరే కారుకు సెట్ కాదట! -
చరిత్రలో కలసిపోనున్న అంబాసిడర్
-
ముగిసిన ‘అంబాసిడర్’ శకం!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ రంగంలో ఒక వెలుగువెలిగి... రాజకీయ నాయకులకు అధికారిక వాహనంగా పేరొందిన అంబాసిడర్ కారు ఇక గత జ్ఞాపకంగా మిగిలిపోనుందా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ‘భారతీయ రోడ్లపై రారాజు’గా విఖ్యాతి చెందిన ఈ కార్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు వీటిని తయారు చేస్తున్న హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా అమ్మకాలు ఘోరంగా పడిపోవడం, డిమాండ్ లేకపోవడం, రుణభారం తీవ్రతరం కావడం వంటి కారణాలవల్లే తయారీని ఆపేస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన మోరిస్ ఆక్స్ఫర్డ్ కారు డిజైన్ ఆధారంగా 1957 నుంచి దేశంలో అంబాసిడర్ కార్లను హిందుస్థాన్ మోటార్స్ తయారుచేస్తూవస్తోంది. గత 60 ఏళ్లలో కారు డిజైన్‌లో పెద్దగా మార్పులేవీ చేయకపోవడం, విదేశీ కార్ల దిగ్గజాలతో పోటీలో చాలా వెనుకబడటం కూడా కంపెనీకి ప్రతికూలంగా మారాయి. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్‌ను మూసేశాం. నిరవధికంగా తయారీని నిలిపివేస్తున్నాం. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో అనవసరంగా ఈ కార్ల తయారీకి మరింత సొమ్మును వెచ్చించలేం. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ పునరుద్ధరణ ప్రణాళికలు రూపొందించుకోవడానికి మాకు వీలవుతుంది’ అని కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, బీఎస్ఈకి కూడా శనివారమే కంపెనీ తాజా పరిణామాలను తెలియజేసింది. నిధుల లేమి, డిమాండ్ అట్టడుగుకు పడిపోవడం, అప్పులు పేరుకుపోవడం వల్లే ప్లాంట్‌ను మూసేసినట్లు వెల్లడించింది. అనేక కొత్త మోడళ్ల కార్లు భారత్‌లో కస్టమర్ల మనసు దోచుకున్నప్పటికీ.. అంబాసిడర్ మాత్రం చాన్నాళ్లు రాజకీయ నాయకులు, అధికారులకు అత్యంత ప్రీతిపాత్రమైన వాహనంగా నిలిచింది. అయితే, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల(ఎస్యూవీ) హవాతో సీనియర్ బ్రూరోక్రాట్లు, రాజకీయ నాయకులు సైతం అంబాసిడర్‌ను వదలేసి.. వాటివైపు మొగ్గుచూపారు. అయితే, ట్యాక్సీ డ్రైవర్లు, కొందరు రాజకీయవేత్తలతోపాటు భారత్‌కు వచ్చే విదేశీ టూరిస్టుల నుంచి అంబాసిడర్ కార్లకు ఇంకా ఆదరణ లభిస్తోంది. 1980లలో ఏటా 24,000 వరకూ అంబాసిడర్ కార్లు అమ్ముడుకాగా... 2000 సంవత్సరం తర్వాత ఈ సంఖ్య 6,000 లోపునకు పడిపోయింది. ప్లాంట్ నుంచి తాజాగా రోజుకు ఐదుకార్లు మాత్రమే బయటికి విడుదలయ్యాంటే వీటికి డిమాండ్ ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో చేసేదేమీలేక కంపెనీ వీటి తయారీకి ఫుల్స్టాప్ పెట్టేసింది. ‘ఆంబి’ అని ముద్దుపేరుతో ప్రాచుర్యం పొందిన అంబాసిడర్ కార్ హుందాకు ప్రతిరూపంగా నిలిచింది. ఆకట్టుకునే రూపం, శక్తివంతమైన ఇంజిన్, భద్రతపై భరోసా... ఇవన్నీ అంబాసిడర్‌ను చూస్తే గుర్తుకొచ్చేవి. ఇలాంటి అంబాసిడర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు. హిందూస్తాన్ 10 పేరుతో హిందుస్తాన్ మోటార్స్ తొలి అంబాసిడర్‌ను ఉత్పత్తి చేసింది. ఈ కారుతో కంపెనీకి ఇబ్బడిముబ్బడిగా లాభాలొచ్చాయి. భారత రోడ్లకు రారాజుగా అంబాసిడర్‌ను అభివర్ణిస్తారు. ముందువైపు డిస్క్ బ్రేక్‌లు, వెనక వైపు డ్రమ్ బ్రేక్‌లు కారణంగా ఈ కారు ప్రయాణం అత్యంత భద్రమైనది. సౌకర్యంగా కూర్చునేలా విశాలమైన సీట్లు ఈ కారు ప్రత్యేకత. సంవత్సరాల తరబడి డిజైన్ అలాగే ఉన్నా.. ఇంటీరియర్ ఇతరత్రా పలు మార్పులను అంబాసిడర్ చూసింది. డాష్‌బోర్డ్‌లు, టెయిల్ లైట్లు, పార్కింగ్ లైట్లు ఇందులో కొన్ని. 1957 నుంచి రోడ్లపై ప్రయాణం ప్రారంభించిన అంబాసిడర్ కారులో... మోరిస్ ఆక్స్ఫర్డ్ నుంచి అంబాసిడర్ ఎన్కోర్వరకూ ఎన్నో మోడళ్లు వచ్చాయి. ట్యాక్సీగా అంబాసిడర్ కారు చాలా ప్రాచుర్యం పొందింది. ఒక్క ముంబైలోనే 75 వేల అంబాసిడర్ ట్యాక్సీలు ఉండేవి. 1980 వరకూ భారత్‌లో అమ్ముడయ్యే ప్రతీ కారు అంబాసిడర్ కారే కావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. 2004లో 90 వేలకు పైగా అంబాసిడర్ కార్లు ఉత్పత్తయ్యాయి. ఇదొక రికార్డ్. అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో అంబాసిడర్ ప్రాభవం మసకబారడం మొదలైంది. కొద్ది నెలల క్రితమే టాప్‌గేర్ ప్రోగ్రామ్‌లో అన్ని ప్రఖ్యాతిగాంచిన కార్లన్నింటినీ తోసిరాజని అంబాసిడర్... టాప్ ట్యాక్సీ కార్గా నిలిచింది. -
అంబాసిడర్ చిన్న కారు వచ్చేస్తోంది..
కోల్‌కత: అంబాసిడర్ కార్లు తయారు చేసే హిందూస్తాన్ మోటార్స్ కంపెనీ త్వరలో చిన్న కారును మార్కెట్లోకి తేనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ చిన్న కారును అందిస్తామని కంపెనీ ఎండీ, సీఈవో ఉత్తమ్ బోస్ మంగళవారం చెప్పారు. ఈ చిన్న కారును అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తామని, సెడాన్ వేరియంట్లోనే దీనిని అందిస్తామని వివరించారు. అంబాసిడర్ కారు కంటే పొడవులో తక్కువగా ఉన్నందున ఎక్సైజ్ సుంకం కూడా తక్కువగా ఉంటుందని, ఫలితంగా అంబాసిడర్ ధర కంటే ఈ కొత్త కారు ధర తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిన్న కారు పేరును ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. బీఎస్-ఫోర్, అంబాసిడర్ ఎన్కోర్ మోడల్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రూ.4.98 లక్షల ధర ఉన్న ఈ అంబాసిడర్ ఎన్కోర్కు ట్యాక్సీ సెగ్మెంట్ నుంచి ఆర్డర్లు బాగా వస్తాయని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటికే ఈ కారుకు 450 బుకింగ్స్ వచ్చాయని, నెలకు 2,000 కార్లు విక్రయించడం లక్ష్యమని ఉత్తమ్ బోస్ చెప్పారు. ఈ కారులో బీఎస్-ఫోర్ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఏసీ, పవర్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్రోగ్రామ్, టాప్‌గేర్ అంబాసిడర్‌కు ప్రపంచంలోనే ఉత్తమమైన ట్యాక్సీగా అవార్డునిచ్చిన విషయం తెలిసిందే.