ఇసుజు నుంచి ఎంయు-7 ఆటోమేటిక్ వేరియంట్ | Isuzu mu-7 AUTOMATIC VARIANT | Sakshi
Sakshi News home page

ఇసుజు నుంచి ఎంయు-7 ఆటోమేటిక్ వేరియంట్

Published Thu, Jul 23 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

ఇసుజు నుంచి ఎంయు-7 ఆటోమేటిక్ వేరియంట్

ఇసుజు నుంచి ఎంయు-7 ఆటోమేటిక్ వేరియంట్

ధర రూ.23.9 లక్షలు

 న్యూఢిల్లీ : ఇసుజు మోటార్స్ ఇండియా కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఎంయు-7 మోడల్‌లో ఆటోమేటిక్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.  ధర రూ.23.9 లక్షలని(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ఎండీ నవోహిరో యమగుచి చెప్పారు. ఎంయు-7 మోడల్‌ను 2013 డిసెంబర్‌లో మార్కెట్లోకి తెచ్చామని వివరించారు. మార్కెట్ అవసరాలకనుగుణంగా ఈ ఆటోమేటిక్ వేరియంట్‌ను అందించామని, ఈ వేరియంట్‌కు మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని  తెలిపారు. ఈ ఎంయు-7 ఎస్‌యూవీని కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్(సీకేడీ) కిట్‌ల రూపంలో దిగుమతి చేసుకొని హిందుస్తాన్ మోటార్స్‌కు చెందిన చెన్నై సమీపంలోని తిరువల్లూర్ ప్లాంట్‌లో కంపెనీ అసెంబుల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement