ఇసుజు డీ-మ్యాక్స్ ఆంబులెన్స్: ధర ఎంతంటే.. | Isuzu D MAX Ambulance Launched in India At Rs 25 99 Lakh | Sakshi
Sakshi News home page

ఇసుజు డీ-మ్యాక్స్ ఆంబులెన్స్: ధర ఎంతంటే..

Published Tue, Oct 15 2024 6:18 PM | Last Updated on Tue, Oct 15 2024 7:18 PM

Isuzu D MAX Ambulance Launched in India At Rs 25 99 Lakh

ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా 'డీ-మ్యాక్స్ అంబులెన్స్‌' లాంచ్ చేసింది. ఈ అంబులెన్స్ రోగులను తరలించే సమయంలో భద్రతను అందించేలా తయారైంది. దీని ప్రారంభ ధర రూ. 25.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో RZ4E 1.9-లీటర్, 4-సిలిండర్ వీజీఎస్ టర్బో ఇంటర్‌కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 120 కేడబ్ల్యు పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ అంబులెన్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన విధంగా ఉండేలా దృఢంగా నిర్మితమై ఉంది.

ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఇంటలిజెంట్ బ్రేక్ ఓవర్-రైడ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ వార్ణింగ్ సిస్టమ్, డ్రైవర్ & కో-డ్రైవర్ కొరకు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ క్యాబిన్ కొరకు కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, సైడ్ ఇంట్రూషన్ ప్రొటక్షన్ బీమ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌ను కంపెనీ రోగుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇందులో వార్నింగ్ లైట్లు, ఫ్లాషర్లు, సైరన్‌లు, సైడ్ లైట్లు, సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండేలా హై-విజిబిలిటీ స్టిక్కర్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలు

డీ-మ్యాక్స్ అంబులెన్స్‌ లాంచ్ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ 'టోరు కిషిమోటో' మాట్లాడుతూ.. అత్యాధునిక ఫీచర్లతో దీనిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇసుజు ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఈ లాంచ్‌తో, ఇసుజు మోటార్స్ ఇండియా ఆటోమోటివ్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంతుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement