ISUZU
-
ఇసుజు డీ-మ్యాక్స్ ఆంబులెన్స్: ధర ఎంతంటే..
ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 'డీ-మ్యాక్స్ అంబులెన్స్' లాంచ్ చేసింది. ఈ అంబులెన్స్ రోగులను తరలించే సమయంలో భద్రతను అందించేలా తయారైంది. దీని ప్రారంభ ధర రూ. 25.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో RZ4E 1.9-లీటర్, 4-సిలిండర్ వీజీఎస్ టర్బో ఇంటర్‌కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 కేడబ్ల్యు పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ అంబులెన్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన విధంగా ఉండేలా దృఢంగా నిర్మితమై ఉంది.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఇంటలిజెంట్ బ్రేక్ ఓవర్-రైడ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ వార్ణింగ్ సిస్టమ్, డ్రైవర్ & కో-డ్రైవర్ కొరకు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ క్యాబిన్ కొరకు కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, సైడ్ ఇంట్రూషన్ ప్రొటక్షన్ బీమ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌ను కంపెనీ రోగుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇందులో వార్నింగ్ లైట్లు, ఫ్లాషర్లు, సైరన్లు, సైడ్ లైట్లు, సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండేలా హై-విజిబిలిటీ స్టిక్కర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుడీ-మ్యాక్స్ అంబులెన్స్ లాంచ్ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ 'టోరు కిషిమోటో' మాట్లాడుతూ.. అత్యాధునిక ఫీచర్లతో దీనిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇసుజు ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఈ లాంచ్‌తో, ఇసుజు మోటార్స్ ఇండియా ఆటోమోటివ్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంతుందని అన్నారు. -
ఇసుజు వాహన ధరలు పెరుగుతాయ్
ముంబై: జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్ కంపెనీ భారత్‌లో విక్రయించే తన వాహనాల ధరలను రూ.లక్ష వరకూ పెంచుతోంది. పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇసుజు మోటార్స్ తెలియజేసింది. ఉత్పత్తి, పంపిణి వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాణిజ్య వాహనాల ధరలను 1–2 శాతం రేంజ్లో, లైఫ్‌స్టైల్, అడ్వైంచర్ పిక్–అప్ వాహనాల ధరలను 3–4 శాతం రేంజ్లో పెంచనున్నామని వెల్లడించింది. ధరల పెరుగుదల రూ.15,000 నుంచి రూ.1,00,000 వరకూ (ఎక్స్ షోరూమ్) ఉంటుందని పేర్కొంది. ఇసుజు మోటార్స్ కంపెనీ భారత్‌లో అడ్వెంచర్ యుటిలిటీ వెహికల్ డీ–మ్యాక్స్ వీ–క్రాస్‌ను, ఏడు సీట్ల ప్రీమియమ్ ఎస్యూవీ మ్యు–ఎక్స్‌ను, డీ–మ్యాక్స్ పికప్స్ వాహన వేరియంట్లను విక్రయిస్తోంది. -
ఇసుజు నుంచి కొత్త ఎంయూ–ఎక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఇసుజు కొత్త ఎంయూ–ఎక్స్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కుటుంబం చేతుల మీదుగా తాజ్ ఫలక్‌నుమాలో మంగళవారమిక్కడ ఈ కార్యక్రమం జరిగింది. పాత మోడల్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా, ప్రీమియం ఇంటీరియర్స్‌తో కొత్త ఎంయూ–ఎక్స్‌ను తీర్చిదిద్దారు. 18 అంగుళాల మల్టీ స్పోక్ ట్విస్ట్ డిజైన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ జోడించడంతో స్పోర్టీగా దర్శనమిస్తోంది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 3.0 లీటర్ ఇసుజు 4జేజే1 డీజిల్ ఇంజిన్, 230 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 7 సీట్లు వంటివి ఇతర హంగులు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్లాంటులో ఈ వాహనం తయారైంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర 4్ఠ2 వేరియంట్ రూ.26.26 లక్షలు, 4్ఠ4 వేరియంట్ రూ.28.22 లక్షలు ఉంది. -
‘ఇసుజు’కు రాయితీల పంట!
* పెట్టుబడికి మించి వ్యాట్ రాయితీ * కోతలు లేకుండా విద్యుత్ సరఫరా * ఎస్‌ఐపీసీతో సంబంధం లేకుండానే ఉత్తర్వులు * వెల్లువెత్తుతున్న విమర్శలు సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘ఇసుజు’కి ప్రభుత్వం రాయితీల పంట పండించింది. రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా భారీ ఎత్తున రాయితీలు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఇసుజు కంపెనీ ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి రాయితీలు కల్పించే విషయంలో ప్రభుత్వం నిబంధనలకు నీళ్లొదిలందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం సాధారణంగా కంపెనీ పెట్టుబడిలో 50 శాతం మాత్రమే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రాయితీగా ఇస్తారు. అయితే, ఇసుజుకు ఏకంగా పెట్టుబడి కన్నా 135 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతోపాటు 30 ఏళ్ల పాటు 100 శాతం నికర వ్యాట్ రాయితీ ఇవ్వాలని, అంతేకాకుండా 5 శాతం ఇన్పుట్ వ్యాట్ రాయితీని కూడా 30 ఏళ్లపాటు కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ)తో సంబంధం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. అయితే, కంపెనీ ఉద్యోగాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి కల్పిస్తేనే రాయితీలకు అర్హత ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇసుజుకు ప్రభుత్వం ఇచ్చిన మరికొన్ని వరాలు కంపెనీ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన తరువాత అంటే 31 డిసెంబర్ 2014 నుంచి ఏడాదిలో 365 రోజులూ నిరాటంకంగా విద్యుత్ సరఫరా ప్రతి 3 నెలలకోసారి పారిశ్రామిక విధానం ప్రకారం ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, సేల్స్ డ్యూటీ తదితర రాయితీల చెల్లింపు మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు అనుమతి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, మార్ట్గేజ్ డ్యూటీలకు 100 శాతం మినహాయింపు ఐదేళ్ల పాటు 2 వేల మందికి ఒక్కోక్కరికి 10 వేల చొప్పున శిక్షణ ఖర్చు కింద కంపెనీకి చెల్లింపు శ్రీసిటీకి వెలుపల కూడా కేవలం రోడ్లు, నీటి సరఫరానే కాకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పన పన్ను విధానంలో భవిష్యత్తులో మార్పులు వచ్చినప్పటికీ ఈ రాయితీలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొనడం గమనార్హం. నేరుగా పని కానిచ్చారు! ఏదైనా పరిశ్రమలకు ఏ మేర రాయితీ ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించేందుకు రాష్ట్రంలో ఒక విధానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్న వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో కలిపి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ఉంటుంది. సీఎం నేతృత్వం లోని వివిధ శాఖల మంత్రులు, అధికారులతో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) ఉంటుంది. పరిశ్రమలు కోరుతున్న రాయితీ లేమిటి? రాష్ట్ర పారిశ్రామిక విధానం ఏం చెబుతోంది? కంపెనీ కోరిన రాయితీలివ్వవచ్చా? అనే అంశాల్ని ఎస్ఐపీసీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎస్ఐపీసీ నిర్ణయాలపై ఎస్ఐపీబీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఏ పరిశ్రమకు రాయితీలు ఇవ్వాలన్నా తొలుత ఎస్ఐపీసీలో చర్చించాల్సి ఉంటుంది. అనంతరమే ఎస్ఐపీబీ పరిశీలనకు వస్తుంది. అయితే, ఇసుజు విషయంలో ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎస్ఐపీసీలో చర్చించకుండానే... నేరుగా ఎస్ఐపీబీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీచేశారు. అనేక ఇతర పరిశ్రమల అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండగా, పారిశ్రామిక విధాన నిబంధనలను పట్టించుకోకుండా ఇసుజుకు భారీగా రాయితీలు కల్పించడాన్ని పారిశ్రామిక వర్గాలు విమర్శిస్తున్నాయి.