
ముంబై: జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్ కంపెనీ భారత్‌లో విక్రయించే తన వాహనాల ధరలను రూ.లక్ష వరకూ పెంచుతోంది. పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇసుజు మోటార్స్ తెలియజేసింది. ఉత్పత్తి, పంపిణి వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాణిజ్య వాహనాల ధరలను 1–2 శాతం రేంజ్‌లో, లైఫ్‌స్టైల్, అడ్వైంచర్ పిక్–అప్ వాహనాల ధరలను 3–4 శాతం రేంజ్‌లో పెంచనున్నామని వెల్లడించింది. ధరల పెరుగుదల రూ.15,000 నుంచి రూ.1,00,000 వరకూ (ఎక్స్ షోరూమ్) ఉంటుందని పేర్కొంది. ఇసుజు మోటార్స్ కంపెనీ భారత్‌లో అడ్వెంచర్ యుటిలిటీ వెహికల్ డీ–మ్యాక్స్ వీ–క్రాస్‌ను, ఏడు సీట్ల ప్రీమియమ్ ఎస్‌యూవీ మ్యు–ఎక్స్‌ను, డీ–మ్యాక్స్ పికప్స్ వాహన వేరియంట్లను విక్రయిస్తోంది.