ఇసుజు నుంచి కొత్త ఎంయూ–ఎక్స్‌ | Isuzu MU-X facelift launched at Rs 26.27 lakh | Sakshi
Sakshi News home page

ఇసుజు నుంచి కొత్త ఎంయూ–ఎక్స్‌

Published Wed, Oct 17 2018 12:13 AM | Last Updated on Wed, Oct 17 2018 12:13 AM

Isuzu MU-X facelift launched at Rs 26.27 lakh - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఇసుజు కొత్త ఎంయూ–ఎక్స్‌ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ కుటుంబం చేతుల మీదుగా తాజ్‌ ఫలక్‌నుమాలో మంగళవారమిక్కడ ఈ కార్యక్రమం జరిగింది. పాత మోడల్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా, ప్రీమియం ఇంటీరియర్స్‌తో కొత్త ఎంయూ–ఎక్స్‌ను తీర్చిదిద్దారు.

18 అంగుళాల మల్టీ స్పోక్‌ ట్విస్ట్‌ డిజైన్‌ డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ జోడించడంతో స్పోర్టీగా దర్శనమిస్తోంది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఆరు ఎయిర్‌ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను పొందుపరిచారు. 3.0 లీటర్‌ ఇసుజు 4జేజే1 డీజిల్‌ ఇంజిన్, 230 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్, 7 సీట్లు వంటివి ఇతర హంగులు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్లాంటులో ఈ వాహనం తయారైంది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో ధర 4్ఠ2 వేరియంట్‌ రూ.26.26 లక్షలు, 4్ఠ4 వేరియంట్‌ రూ.28.22 లక్షలు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement