ఈ కారు ఎవరిది..?
మొయినాబాద్: పదిహేను రోజులుగా ఒకే చోట ఉన్న ఓ కారు స్థానికంగా కలకలం రేపుతోంది. కారు ఎవరిదో..?ఎవరు పార్కు చేశారో తెలియదు? కానీ పదిహేను రోజు లుగా మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల మహిళా సమాఖ్య భవనం ముందు నిలిపి ఉంది.
ఏపీ 21 ఎం 2979 నెంబరుగల అంబాసిడర్ కారు పదిహేను రోజులుగా అక్కడే ఉండటంతో ఐకేపీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదిహేను రోజుల నుంచి కారు అక్కడే ఉందని, ఎవరూ తీసుకుపోవడం లేదని చెబుతున్నారు. కారు వెనక అద్దంపై ‘జై తెలంగాణ’ అని రాసి ఉంది. పోలీస్టేషన్‌కు పక్కనే ఉన్న ఈ కారు గురించి పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఓసారి ఐకేపీ సిబ్బంది విషయాన్ని పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు కారు గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.