
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో కొత్తగా నియమితులైన తమ రాయబారికి మరింత భద్రతను కల్పించాలని పాక్‌ను చైనా కోరింది. ఉగ్రవాదుల నుంచి తమ రాయబారి ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో చైనా ఈ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చైనా ఎంబసీ అక్టోబర్ 19వ తేదీన పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
తమ రాయబారిని హతమార్చేందుకు నిషేధిత తూర్పు టర్కీస్థాన్ ఇస్లామిక్ మూమెంట్‌కు చెందిన ఉగ్రవాది పాక్‌లోకి ప్రవేశించాడని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో పనిచేస్తున్న తమ దేశస్తులకూ భద్రతను కల్పించాలని చైనా– పాక్ ఎకనామిక్ కారిడార్( సీపీఈసీ) ప్రాజెక్టులో కీలక భూమిక పోషిస్తున్న పింగ్ ఫి లేఖలో కోరారు.