
బిగ్‌బీకే మళ్లీ ఛాన్స్..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు గౌరవ బాధ్యతలు మరింత రెట్టింపయ్యాయి. యూనిసెఫ్(అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి)కి రాయబారిగా అమితాబ్ మరో రెండేళ్లు కొనసాగనున్నారు.
పోలియో మహమ్మారిపై చేస్తున్న యుద్దంలో విజయం సాధించినందుకు, పసిపిల్లలకు ఎంఆర్ వ్యాక్సినేషన్ వేయించేందుకు కృషి చేస్తున్నందుకు తనను యూనిసెఫ్ అంబాసిడర్‌గా మరో రెండేళ్లు పొడిగించినట్లు అమితాబ్ స్వయంగా ఆదివారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అలాగే, తన సంతోషాన్ని అభిమానులతో తన బ్లాగులో అమితాబ్ పంచుకున్నారు.