Japan ambassador enjoys Indian street food in Pune with wife, PM responds - Sakshi
Sakshi News home page

భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచికి జపాన్ జంట ఫిదా..  

Published Sun, Jun 11 2023 12:43 PM | Last Updated on Sun, Jun 11 2023 12:58 PM

Japan Ambassador Enjoys Street Food PM Tweets - Sakshi

పూణే: భారతదేశంలోని జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి తన భార్యతో కలిసి పూణే వీధుల్లో విహరించి అక్కడి వీధుల్లో వడాపావ్, మిసాల్ పావ్ తిన్నారు. ఆ రుచికి ఫిదా అయిపోయిన సుజుకి ట్విట్టర్లో నాకు భారతీయ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. కానీ పోటీలో నా భార్య నన్ను ఓడించింది. చాలామంది మిసాల్ పావ్  తినమని నన్ను రికమెండ్ చేశారు. చాలా రుచిగా ఉంది కానీ కొద్దిగా ఘాటు తగ్గించాలని రాసి వీడియోని కూడా జతపరిచారు. 

దీనికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ తనదైన శైలిలో చమత్కరించారు. జపాన్ రాయబారి చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ ప్రధాని.. ఓడిపోయినా పర్వాలేదనిపించే పోటీ ఏదైనా ఉందంటే, అది ఇదొక్కటే.. అంబాసిడర్ గారు. భారతదేశ పాక వైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నందుకు సంతోషం. మరిన్ని వీడియోలు చెయ్యండి. అని రాశారు.   

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలోనే అభిమానులున్నారు. అందులోనూ వడాపావ్ అంటే ఇష్టపడే వాళ్ళు  చాలామందే ఉన్నారు. వారిలో ఇప్పుడు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి జంట కూడా చేరిపోయారు.   

ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement