సాధారణంగా అంబాసిడర్‌గా సిని సెలబ్రెటీలు లేదా స్పోర్ట్స్ స్టార్‌లు, ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్లనే పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ సాధారణ యువతి వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ అంబాసిడర్ అయ్యింది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఆమెనే అంబాసిడర్‌గా నియమించింది? ఆమె ప్రత్యేకత ఏంటీ అంటే..
అమ్మమ్మ స్పూర్తితోనే..
ఆ యువతి పేరు లహరీబాయి మధ్యప్రదేశ్‌లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవవైవిధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వారు తమకుండే మౌఖిక సంప్రదాయాల ద్వారా తమ నైపుణ్యాలను ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగేలా ప్రొత్సహిస్తారు.
ఇక లహరీ మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందింది. ఆమె తన బామ్మ మాటలతో స్ఫూర్తిపొందింది. కనుమరుగవుతున్న మిల్లెట్ ధాన్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. లమరీ 18 ఏళ్ల వయస్సు నుంచే విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉండటం విశేషం.
స్కూల్ ముఖమే చూడకపోయినా..
ఇక లహరీబాయి ఇల్లు మిల్లెట్స్‌తో అలంకరించినట్లుగా ఇంటిపైకప్పుడు వేలాడుతుంటాయి. అస్సలు పాఠశాల ముఖమే చూడని గిరిజన మహిళ ఈ విత్తనాల గొప్పతనం గురిచి తెలసుకుని వాటిని సంరక్షించాలని భావించడం నిజంగా స్ఫూర్తి దాయకం. ఇక ఈ మిల్లెట్‌ల్లో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంలో తోడ్పడుతుంది.
ఏకంగా 150 రకాలకు పైనే..
ఇక లహరీబాయి ప్రస్తుత వయసు 27 ఏళ్లు. ఆమె 1ఆ ఏళ్ల నుంచి ఈ మిల్లెట్స్ సేకరణ ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు దాదాపు 150 రకాలకుపైనే మిల్లెట్స్ సేకరించింది. కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా మరియు చేనాతో సహా 150కిపైగా ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్ లహరీబాయి వద్ద ఉండటం విశేషం. ఐతే చాలా రకాల మిల్లెట్స్ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెబుతుంది లహరీబాయి.
విత్తనాల సేకరణ కోసం..
ఇక ఎవరైనా మిల్లెట్స్ సాగు చేస్తే.. లహరీ బాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుందట. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి కిలోన్నర తీసుకుంటుంది. మరి కొందరు మాత్రం ఆమెకు కొంతభాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని చెబుతున్న లహరీబాయిని చూస్తే నిజంగా వాటి ప్రాముఖ్యతను అందురు గుర్తించేలా, బావితరాలకు అందిచాలనే లక్ష్యం కనిపిస్తుంది
ఆ ఆసక్తి ఆమెను అంబాసిడర్‌గా..
లహరీబాయి మిల్లెట్స్ సేకరణ, సంరక్షణ పట్ల ఆమె కనబరుస్తున్న ఆసక్తిన, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను మిల్లెట్స్ అంబాసిడర్ గా నియమించింది. భారత ప్రభుత్వం దేశాన్నిమిల్లెట్‌సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్‌గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది . ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్న ఈ మిల్లెట్స్ అంతరించిపోకుండా సంరక్షింపబడతాయన్న ఉద్దేశ్యంతో సెలబ్రెటీలను కూడా కాదని, ఆ గిరిజ యువతిని అంబాసిడర్‌గా నియమించింది. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, చేస్తున్న పట్ల సరైన అవగాహన నిబద్ధతతో కృషి చేస్తే దేశమే గుర్తించి మెచ్చుకునే మనిషిగా పేరుతెచ్చుకోవచ్చని ఈ గిరిజన యువతి ప్రూవ్ చేసింది కదూ..!
(చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!)
Comments
Please login to add a commentAdd a comment