
సల్మాన్‌పై యోగేశ్వర్ దత్ విసుర్లు
2016లో జరుగనున్న ఒలంపిక్స్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను నియమించడంపై ఇండియన్ రెజ్లర్ యేగేశ్వర్ దత్ అసహనం వ్యక్తం చేశారు.
అంబాసిడర్ గా నియమించడానికి సల్మాన్ కు ఉన్న అర్హత ఏమిటని, క్రీడలకు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. పీటీ ఉష, మిల్కా సింగ్ వంటివారు ఉండగా సల్మాన్ నియమించడమేమిటని అన్నారు. ఒలింపిక్ క్రీడలు సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వేదికలు కాదని ఘాటుగా విమర్శించారు.