yogeshwar
-
దసరాకు పోటీగా పరారీ? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. సాయి శివాజీ దర్శకత్వం వహించగా గాలి ప్రత్యూష సమర్పణలో, శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జివివి గిరి నిర్మించాడు. మార్చి 30న రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. 'ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. అలా ఈసారి పరారీ ద్వారా యోగేశ్వర్ హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌గా మంచి పాత్రలో నటించాను. నాతో పాటు చాలా మంది సీనియర్స్ నటించడం విశేషం' అన్నారు. చిత్ర నిర్మాత గిరి మాట్లాడుతూ.. 'మా సినిమా చూసిన వారందరూ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. హీరో సాంగ్స్, యాక్షన్ ఫైట్స్ సీన్లలో బాగా చేశాడని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. సుమన్ గారు మాకు బ్యాక్ బోన్ గా ఉండి ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా మంది ఈ సినిమా నాని గారి "దసరా"కు మా సినిమా పోటీ అంటున్నారు. అలా ఏం కాదు. ఆ సినిమా స్టోరీ వేరు, మా సినిమా స్టోరీ వేరు. నాకు రాముడు భక్తి ఎక్కువ అందుకే శ్రీరామ నవమి రోజు రిలీజ్ చేయాలని చేశాము తప్ప పోటీగా విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. సోమవారం నుంచి థియేటర్స్ పెంచుతున్నాము' అన్నారు. హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి చిత్రం. చాలా బాగా చేశానని ప్రశంసలు లభిస్తుంటే సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే మా గురువుగారు సుమన్, ఆలీ, జీవా, భూపాల్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించడం హ్యాపీగా ఉంది. వీరంతా నన్ను కొత్త వాడు అని చూడకుండా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే వారి నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా టెక్నీషియన్స్‌కు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెపుతున్నాను' అన్నారు. -
పరారీ మూవీ రివ్యూ
యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో జి.వి.వి.గిరి నిర్మించారు. సాయి శివాజీ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మాత్రం నవ్వించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ప్రేమించుకుంటారు. హీరో తండ్రి(షయాజి షిండే) బడా వ్యాపారవేత్త కావడంతో చాలా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ తన తోటి ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగి తండ్రి పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ అవుతాడు. మరి యోగి... మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్‌కు గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? అతిథితో ప్రేమాయణానికి శుభం కార్డు పడిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! కథ... కథనం విశ్లషణ లవ్ క్రైం కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దానికి కావాల్సిన స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకుంటే చాలు. ఆడియన్స్‌ను థియేటర్లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా కూర్చోబెట్టవచ్చు. దర్శకుడు సాయి శివాజీ ఈ చిత్రానికి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి... ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్‌ను ఇంటర్వల్ నుంచి పరుగులు పెట్టిస్తుంటాడు. దానిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్.. ఆ తరువాత అత్తాపురం ఎపిసోడ్‌తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించాడు. క్లైమాక్స్ సీన్ బాగుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి. హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడైనా... బాగా నటించాడు. హీరోయిన్ అతిథి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. హీరోతో పాటు చేసిన భూపాల్ పాత్ర కూడా ఒకే. అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ రఘు కారుమంచి... తన కామెడీ టైమింగ్‌తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆలీ ఇందులో ఉన్నా సైలెంట్‌గానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారి పాత్రలో సుమన్, హీరో తండ్రిగా షాయాజీ షిండే పర్ఫెక్ట్గా సూటయ్యారు. బాలీవుడ్ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే... అమ్మాయిలను కిడ్నాప్ చేసి... వ్యభిచారం రొంపిలోకి దింపే కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా... తన పాత్ర పరిధి మేరకు నటించాడు. దర్శకుడు సాయి శివాజీ సినిమా ఆద్యంతం నవ్వించారు, కానీ కొన్నిచోట్ల అనవసర సన్నివేశాలు బలవంతంగా జోడించినట్లు అనిపిస్తుంది. గరుడ వేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం పర్వాలేదు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. -
నన్ను హీరోగా సినిమా తీస్తానంటే వద్దని చెప్పా: సుమన్
యోగేశ్వర్, అతిథి జంటగా నటిస్తోన్న చిత్రం 'పరారి'. ఈ చిత్రానికి సాయి శివాజీ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై గాలి ప్రత్యూష సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్, కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సుమన్ మాట్లాడుతూ.. 'మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్. తెలుగు వారందరూ గర్వించే రోజు. ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్నీ ఆస్కార్ అవార్డులు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిర్మాత గిరి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే వద్దని తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడం జరిగింది. యోగేష్ చాలా బాగా నటించాడు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.' అని అన్నారు నటి కవిత మాట్లాడుతూ.. 'ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'యోగేష్ హీరోగా బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి
శివాజీనగర: పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్ సొంత ప్రభుత్వం మీదనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది శుద్ధమైన బీజేపీ ప్రభుత్వంగా లేదు, మూడు గ్రూపుల సర్కారు మాదిరి ఉంది. మా ప్రభుత్వం కాంగ్రెస్, జేడీఎస్‌లతో కుమ్మక్కయ్యింది అని విమర్శించారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీకి వెళుతుంటా, వస్తుంటా, అవన్నీ మీడియా ముందు చెప్పలేను. నా ఢిల్లీ పర్యటనపై ఈ ప్రచారం ఎందుకు జరిగిందనేది అర్థం కావటం లేదన్నారు. ముఖ్యమంత్రి మార్పు తన ఉద్దేశం కాదు, సొంత పనిమీదే వెళ్లాను అన్నారు. చదవండి: సీఎం మార్పు కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన చదవండి: చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు -
నవ్వు కోసం పరుగు
యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరారి’. ‘రన్ ఫర్ ఫన్ ’ అనేది ఉపశీర్షిక. గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి వి.వి.గిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత సి.కల్యాణ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘యోగేశ్వర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథని ఎంచుకున్నాడు. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్ లేకుండా చాలా ఈజ్‌తో నటించాడు. సాయి శివాజీ డ్యాన్స్ మాస్టర్‌గా నాకు పరిచయం. మంచికథను ఎంచుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు’’ అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ– ‘‘గిరి చాలా సంవత్సరాలుగా నా అభిమాని. వారి అబ్బాయితో ఓ సినిమా చేయాలని అంటుంటే నేనే వాయిదా వేస్తూ వచ్చాను. కానీ, ఆయనలో పట్టుదల చూసి మంచి కథను ఎన్నుకుని ఈ చిత్రం చేశాం. ఇందులో నేనూ ఒక ముఖ్య పాత్ర పోషించాను’’ అన్నారు. ‘‘పరారి’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో జరిగింది. ఒక పాట మినహా సినిమా పూర్తయింది’’ అన్నారు వి.వి. గిరి. ‘‘హీరోగా నాకు తొలి చిత్రమైనా సహ నటుల నుంచి ఎంతో నేర్చుకున్నా. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు యోగేశ్వర్. ‘‘వినోదానికి ప్రాధాన్యతనిస్తూ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిస్తోన్న చిత్రమిది’’ అన్నారు సాయి శివాజీ. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్, నటులు శ్రవణ్, గౌతమ్‌రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి. -
దేవాదుల కాల్వలో పడి బాలుడి మృతి
మడికొండ : దే వాదులకాల్వలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన వనమాల కనపర్తిలో శనివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకా రం.. హన్మకొండ మండలం వనమాల కనపర్తికి చెం దిన వేముల రవి, హరిత దంపతుల కుమారుడు యోగేశ్వర్(9) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్తున్నానని ఇంట్లో చె ప్పి తిరిగి రాలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో వెతికారు. పక్కన ఉన్న దే వాదుల కాల్వ వద్ద అతడి దుస్తులు కని పించడంతో కాల్వలో పడి ఉండొచ్చనే అనుమానంతో అధికారులకు సమాచారమిచ్చా రు. శుక్రవారం కుమ్మరిగూడెం శివారు మల్లక్‌పల్లి దగ్గరలోని గండిచెరువుకు గండి పడటంతో చెరువు నీళ్లు కాల్వలోకి రావడంతో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు కాల్వ గేట్లను మూసివేయడంతో శనివారం ఉదయం వెతకగా బాలుడి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. కళ్లెదుటే కుమారుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యా రు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అస్గరోవ్ డోపీ కాదు యోగేశ్వర్‌కు రజతమే
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ సాధించిన కాంస్య పతకం ఏకంగా స్వర్ణం కాబోతుందని ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్ 60కేజీ ఫ్రీస్టరుుల్ విభాగంలో విజేతగా నిలిచిన టొగ్రుల్ అస్గరోవ్ (అజెర్బైజాన్) డోపీగా తేలినందుకు యోగికి ఈ అదృష్టం దక్కుతుందనేది కొందరి వాదన. అరుుతే తాజాగా ఈ పుకార్లకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యుడబ్ల్యు) తెర దించింది. అసలు అస్గరోవ్ ఎప్పుడు కూడా డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలలేదని స్పష్టం చేసింది. ‘అస్గరోవ్ యూడబ్ల్యుడబ్ల్యు డోపింగ్ నిరోధక పాలసీని ఎప్పుడూ అతిక్రమించలేదు. అతడిపై కథనాల్లో నిజం లేదు’ అని ట్వీట్ చేసింది. మరోవైపు కుడుఖోవ్ డోపీగా తేలడంతో యోగేశ్వర్ కాంస్య పతకం రజతంగా మారే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. -
సల్మాన్‌పై యోగేశ్వర్ దత్ విసుర్లు
న్యూఢిల్లీ: 2016లో జరుగనున్న ఒలింపిక్స్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను నియమించడంపై ఇండియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ అసహనం వ్యక్తం చేశారు. అంబాసిడర్ గా నియమించడానికి సల్మాన్ కు ఉన్న అర్హత ఏమిటని, క్రీడలకు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. పీటీ ఉష, మిల్కా సింగ్ వంటివారు ఉండగా సల్మాన్ నియమించడమేమిటని అన్నారు. ఒలింపిక్ క్రీడలు సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వేదికలు కాదని ఘాటుగా విమర్శించారు. -
యోగేశ్వర్‌కు రూ. 39.7 లక్షలు
సుశీల్‌కు రూ.38.2 లక్షలు హెర్‌హెల్‌కు అత్యధిక మొత్తం ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి జరగనున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో భారత రెజ్లర్లలో యోగేశ్వర్ దత్‌కు అత్యధిక ధర పలికింది. మంగళవారం జరిగిన వేలంపాటలో హర్యానా ఫ్రాంచైజీ రూ. 39 లక్షల 70 వేలు వెచ్చించి యోగేశ్వర్ దత్ (65 కేజీలు)ను కొనుగోలు చేసింది. 33 ఏళ్ల యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతోపాటు గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (74 కేజీలు)ను ఉత్తరప్రదేశ్ ఫ్రాంచైజీ రూ. 38 లక్షల 20 వేలకు సొంతం చేసుకుంది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన నర్సింగ్ యాదవ్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 34 లక్షల 50 వేలకు కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన మహిళా రెజ్లర్ ఒక్సానా హెర్హెల్ (60 కేజీలు)కు అందరికంటే ఎక్కువ మొత్తం లభించింది. ఆమెను హర్యానా ఫ్రాంచైజీ రూ. 41 లక్షల 30 వేలకు కైవసం చేసుకుంది. బెలారస్‌కు చెందిన మరో మహిళా రెజ్లర్ వాసిలిసా (69 కేజీలు)ను పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 40 లక్షల 20 వేలకు కొనుగోలు చేసింది. గీతా ఫోగట్‌ను ఢిల్లీ జట్టు రూ. 33 లక్షలకు ... బబితాను ఉత్తరప్రదేశ్ రూ. 34 లక్షల 10 వేలకు కొనుగోలు చేశాయి. మొత్తం ఆరు ఫ్రాంచైజీల (ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ముంబై, బెంగళూరు) మధ్య డిసెంబరు 10 నుంచి 27 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ జరుగుతుంది. -
సుశీల్ 74 కేజీలకు... యోగేశ్వర్ 65 కేజీలకు
న్యూఢిల్లీ: ఊహించినట్టే భారత స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ కొత్త వెయిట్ కేటగిరీలకు మారారు. 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో సుశీల్ కుమార్ 74 కేజీల విభాగంలో... యోగేశ్వర్ దత్ 65 కేజీల విభాగంలో పోటీపడతారు. ఇప్పటిదాకా సుశీల్ 66 కేజీల్లో... యోగేశ్వర్ 60 కేజీల్లో పాల్గొనేవారు. అయితే అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (ఫిలా) ఇటీవల వెయిట్ కేటగిరీలలో మార్పులు చేసింది. ఆ జాబితాలో వీరిద్దరి కేటగిరీలు లేకపోవడంతో కొత్త విభాగాలకు మారడం అనివార్యమైంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ మినహా మిగతా అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం సుశీల్ 70 కేజీల విభాగంలో బరిలోకి దిగుతాడు. గత ఏడాది లండన్ ఒలింపిక్స్ తర్వాత ఏ టోర్నీలోనూ పాల్గొనని సుశీల్, యోగేశ్వర్ ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు అమెరికాలో జరిగే డేవ్ షుల్జ్ స్మారక అంతర్జాతీయ టోర్నీలకు తమ ఎంట్రీలను ఖరారు చేశారు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు నెగ్గిన అమిత్ కుమార్ దహియా 57 కేజీల్లో... బజరంగ్ 61 కేజీల్లో పాల్గొంటారు. ఇప్పటిదాకా 74 కేజీ విభాగంలో పోటీపడిన ఒలింపియన్ నర్సింగ్ యాదవ్ ఇక నుంచి 86 కేజీల విభాగానికి మారుతాడు. -
ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యమిస్తా
ముంబై: వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై కన్నేసిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌కే అమిత ప్రాధాన్యమిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో 2014లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో ఏదో ఒక టోర్నీలోనే పోటీ పడతానని చెప్పాడు. ఒక వేళ పూర్తి స్థాయి ఫిట్నెస్ ఉంటే ఈ మూడు ఈవెంట్లలోనూ పాల్గొంటానన్నాడు. ‘నాకు గాయాలే అతి పెద్ద సమస్యలు. చాలా సార్లు గాయాల బారిన పడ్డాను. కొన్నిసార్లు వెన్నునొప్పి... ఇంకొన్ని సార్లు మోకాలి గాయాలు. కానీ ఇప్పుడు మాత్రం ఫిట్‌గానే ఉన్నా. ఇకముందూ ఇలా ఉండటమే నా మొదటి లక్ష్యం’ అని 30 ఏళ్ల రెజ్లర్ అన్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన యోగేశ్వర్ దత్ గాయం వల్ల గత నెల హంగేరిలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయాడు. అయితే వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్లో దేశానికి పసిడి పతకం అందిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై తరచూ గాయాలపాలవకుండా కొన్ని ఎంచుకున్న టోర్నీల్లోనే పాల్గొంటానన్నాడు. తద్వారా రియో ఒలింపిక్స్ (2016)లో స్వర్ణం గెలవాలనే కలను నెరవేర్చుకుంటానని చెప్పాడు.