యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. సాయి శివాజీ దర్శకత్వం వహించగా గాలి ప్రత్యూష సమర్పణలో, శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జివివి గిరి నిర్మించాడు. మార్చి 30న రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. 'ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. అలా ఈసారి పరారీ ద్వారా యోగేశ్వర్ హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌గా మంచి పాత్రలో నటించాను. నాతో పాటు చాలా మంది సీనియర్స్ నటించడం విశేషం' అన్నారు.
చిత్ర నిర్మాత గిరి మాట్లాడుతూ.. 'మా సినిమా చూసిన వారందరూ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. హీరో సాంగ్స్, యాక్షన్ ఫైట్స్ సీన్లలో బాగా చేశాడని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. సుమన్ గారు మాకు బ్యాక్ బోన్ గా ఉండి ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా మంది ఈ సినిమా నాని గారి "దసరా"కు మా సినిమా పోటీ అంటున్నారు. అలా ఏం కాదు. ఆ సినిమా స్టోరీ వేరు, మా సినిమా స్టోరీ వేరు. నాకు రాముడు భక్తి ఎక్కువ అందుకే శ్రీరామ నవమి రోజు రిలీజ్ చేయాలని చేశాము తప్ప పోటీగా విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. సోమవారం నుంచి థియేటర్స్ పెంచుతున్నాము' అన్నారు.
హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి చిత్రం. చాలా బాగా చేశానని ప్రశంసలు లభిస్తుంటే సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే మా గురువుగారు సుమన్, ఆలీ, జీవా, భూపాల్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించడం హ్యాపీగా ఉంది. వీరంతా నన్ను కొత్త వాడు అని చూడకుండా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే వారి నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా టెక్నీషియన్స్‌కు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెపుతున్నాను' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment