Parari Movie
-
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'పరారీ' మూవీ
దర్శకుడు రాజుమురుగన్ శిష్యుడు ఎళిల్ పెరియవెడి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'పరారీ'. ఎస్పీ సినిమాస్ సంస్థతో కలిసి దర్శకుడు రాజుమురుగన్ నిర్మిస్తున్నారు. 'తోళర్ వెంకటేశన్' ఫేమ్ హరిశంకర్ హీరోగా నటిస్తున్నారు. సంగీత కల్యాణ్ అనే అమ్మాయి హీరోయిన్గా పరిచయమవుతోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని దర్శకుడు లోకేష్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?) తిరువణ్ణామలై చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లి జీవించే ప్రజలు జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రం ఇది అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతలో ఉండే కుల, మత రాజకీయాల గురించి ఇందులో చూపించనున్నట్లు చెప్పాడు. చాలామంది కొత్త వాళ్లు ఇందులో నటించారని తెలిపాడు. ప్రస్తుతం నిర్మాణాంతరం కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీకి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: పాతాళానికి పడిపోయిన శివాజీ గ్రాఫ్! మాట కోసం చస్తావా? పెద్ద జోక్..) -
హీరో నానికి నేను పోటీ? సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఈ సినిమాలో హీరోగా చేశా..!
-
దసరాకు పోటీగా పరారీ? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. సాయి శివాజీ దర్శకత్వం వహించగా గాలి ప్రత్యూష సమర్పణలో, శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జివివి గిరి నిర్మించాడు. మార్చి 30న రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. 'ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. అలా ఈసారి పరారీ ద్వారా యోగేశ్వర్ హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌గా మంచి పాత్రలో నటించాను. నాతో పాటు చాలా మంది సీనియర్స్ నటించడం విశేషం' అన్నారు. చిత్ర నిర్మాత గిరి మాట్లాడుతూ.. 'మా సినిమా చూసిన వారందరూ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. హీరో సాంగ్స్, యాక్షన్ ఫైట్స్ సీన్లలో బాగా చేశాడని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. సుమన్ గారు మాకు బ్యాక్ బోన్ గా ఉండి ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా మంది ఈ సినిమా నాని గారి "దసరా"కు మా సినిమా పోటీ అంటున్నారు. అలా ఏం కాదు. ఆ సినిమా స్టోరీ వేరు, మా సినిమా స్టోరీ వేరు. నాకు రాముడు భక్తి ఎక్కువ అందుకే శ్రీరామ నవమి రోజు రిలీజ్ చేయాలని చేశాము తప్ప పోటీగా విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. సోమవారం నుంచి థియేటర్స్ పెంచుతున్నాము' అన్నారు. హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి చిత్రం. చాలా బాగా చేశానని ప్రశంసలు లభిస్తుంటే సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే మా గురువుగారు సుమన్, ఆలీ, జీవా, భూపాల్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించడం హ్యాపీగా ఉంది. వీరంతా నన్ను కొత్త వాడు అని చూడకుండా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే వారి నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా టెక్నీషియన్స్‌కు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెపుతున్నాను' అన్నారు. -
అన్నయ్య భార్య ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయింది: చక్రి సోదరుడు
దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు సహా పలు సినిమాలకు సంగీతం అందించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే 2014లో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక చక్రి మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులో తలెత్తి అది మీడియా వరకు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ''చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు వచ్చాయి. ఓవైపు అన్నయ్య లేడనే బాధకి తోడు ఈ గొడవలతో ప్రతిరోజు నరకం అనుభవించాము. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆమె భార్య అమ్మేసుకొని అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యింది. ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఉన్నాయి'' అంటూ మహిత్ పేర్కొన్నాడు. తాజాగా ఆయన ‘పరారీ’ అనే సినిమాకు సంగీతం అందించారు. -
పరారీ మూవీ రివ్యూ
యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో జి.వి.వి.గిరి నిర్మించారు. సాయి శివాజీ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మాత్రం నవ్వించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ప్రేమించుకుంటారు. హీరో తండ్రి(షయాజి షిండే) బడా వ్యాపారవేత్త కావడంతో చాలా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ తన తోటి ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగి తండ్రి పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ అవుతాడు. మరి యోగి... మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్‌కు గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? అతిథితో ప్రేమాయణానికి శుభం కార్డు పడిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! కథ... కథనం విశ్లషణ లవ్ క్రైం కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దానికి కావాల్సిన స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకుంటే చాలు. ఆడియన్స్‌ను థియేటర్లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా కూర్చోబెట్టవచ్చు. దర్శకుడు సాయి శివాజీ ఈ చిత్రానికి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి... ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్‌ను ఇంటర్వల్ నుంచి పరుగులు పెట్టిస్తుంటాడు. దానిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్.. ఆ తరువాత అత్తాపురం ఎపిసోడ్‌తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించాడు. క్లైమాక్స్ సీన్ బాగుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి. హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడైనా... బాగా నటించాడు. హీరోయిన్ అతిథి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. హీరోతో పాటు చేసిన భూపాల్ పాత్ర కూడా ఒకే. అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ రఘు కారుమంచి... తన కామెడీ టైమింగ్‌తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆలీ ఇందులో ఉన్నా సైలెంట్‌గానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారి పాత్రలో సుమన్, హీరో తండ్రిగా షాయాజీ షిండే పర్ఫెక్ట్గా సూటయ్యారు. బాలీవుడ్ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే... అమ్మాయిలను కిడ్నాప్ చేసి... వ్యభిచారం రొంపిలోకి దింపే కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా... తన పాత్ర పరిధి మేరకు నటించాడు. దర్శకుడు సాయి శివాజీ సినిమా ఆద్యంతం నవ్వించారు, కానీ కొన్నిచోట్ల అనవసర సన్నివేశాలు బలవంతంగా జోడించినట్లు అనిపిస్తుంది. గరుడ వేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం పర్వాలేదు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. -
నన్ను హీరోగా సినిమా తీస్తానంటే వద్దని చెప్పా: సుమన్
యోగేశ్వర్, అతిథి జంటగా నటిస్తోన్న చిత్రం 'పరారి'. ఈ చిత్రానికి సాయి శివాజీ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై గాలి ప్రత్యూష సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్, కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సుమన్ మాట్లాడుతూ.. 'మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్. తెలుగు వారందరూ గర్వించే రోజు. ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్నీ ఆస్కార్ అవార్డులు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిర్మాత గిరి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే వద్దని తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడం జరిగింది. యోగేష్ చాలా బాగా నటించాడు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.' అని అన్నారు నటి కవిత మాట్లాడుతూ.. 'ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'యోగేష్ హీరోగా బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
మంచి లక్ష్యంతో ‘పరారీ’ నిర్మించా : జీవీవీ గిరి
యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పరారీ’. గాలి ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకానుంది. ఈ మూవీ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, టీజర్‌ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. ‘మంచి సినిమా తీయాలనే లక్ష్యంతో ‘పరారీ’ నిర్మించాను. సుమన్‌గారి వందో సినిమా నేను నిర్మించాల్సి ఉన్నా కుదరలేదు. ఈ మూవీలో సుమన్ గారు మంచి పాత్ర చేశారు’ అన్నారు జీవీవీ గిరి. ‘పరారీ’లో అన్ని పాటలు బాగావచ్చాయి’అన్నారు సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్. ‘ఈ సినిమాని నిర్మాత బాగా ఖర్చుపెట్టి తీశారు. అది విజువల్ గా కనపడుతుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి. శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహిత్ నారాయణ్ సంగీతం అందించారు.