'Parari' Movie Teaser and Poster Launch - Sakshi
Sakshi News home page

మంచి లక్ష్యంతో ‘పరారీ’ నిర్మించా : జీవీవీ గిరి

Published Tue, Mar 7 2023 10:22 AM | Last Updated on Tue, Mar 7 2023 10:52 AM

Parari Movie Poster And Second Teaser Out - Sakshi

యోగేశ్వర్‌, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పరారీ’. గాలి ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలకానుంది. ఈ మూవీ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి, టీజర్‌ను ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు దామోదర్‌ ప్రసాద్‌ విడుదల చేశారు. ‘మంచి సినిమా తీయాలనే లక్ష్యంతో ‘పరారీ’ నిర్మించాను. సుమన్‌గారి వందో సినిమా నేను నిర్మించాల్సి ఉన్నా కుదరలేదు. ఈ మూవీలో సుమన్‌ గారు మంచి పాత్ర చేశారు’ అన్నారు జీవీవీ గిరి.

‘పరారీ’లో అన్ని పాటలు బాగావచ్చాయి’అన్నారు సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్‌.  ‘ఈ సినిమాని నిర్మాత బాగా ఖర్చుపెట్టి తీశారు. అది విజువల్ గా కనపడుతుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి. శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహిత్ నారాయణ్ సంగీతం అందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement