ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యమిస్తా | my first preference is to fitness only, says yogeshwar dutt | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యమిస్తా

Published Mon, Oct 28 2013 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యమిస్తా

ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యమిస్తా

ముంబై: వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై కన్నేసిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌కే అమిత ప్రాధాన్యమిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో 2014లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో ఏదో ఒక టోర్నీలోనే పోటీ పడతానని చెప్పాడు. ఒక వేళ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ ఉంటే ఈ మూడు ఈవెంట్లలోనూ పాల్గొంటానన్నాడు. ‘నాకు గాయాలే అతి పెద్ద సమస్యలు. చాలా సార్లు గాయాల బారిన పడ్డాను. కొన్నిసార్లు వెన్నునొప్పి... ఇంకొన్ని సార్లు మోకాలి గాయాలు.
 
 కానీ ఇప్పుడు మాత్రం ఫిట్‌గానే ఉన్నా. ఇకముందూ ఇలా ఉండటమే నా మొదటి లక్ష్యం’ అని 30 ఏళ్ల రెజ్లర్ అన్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన యోగేశ్వర్ దత్ గాయం వల్ల గత నెల హంగేరిలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయాడు. అయితే వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌లో దేశానికి పసిడి పతకం అందిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై తరచూ గాయాలపాలవకుండా కొన్ని ఎంచుకున్న టోర్నీల్లోనే పాల్గొంటానన్నాడు. తద్వారా రియో ఒలింపిక్స్ (2016)లో స్వర్ణం గెలవాలనే కలను నెరవేర్చుకుంటానని చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement