
రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా మన దేశంలో ఉన్న జపాన్ అంబాసిడర్ రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘బెస్ట్ విషెస్’ చెప్పాడు. ఇక ‘ముత్తు’ నాటి నుంచి రజనీకి ఫ్యాన్స్‌గా ఉన్న ఒక జంట ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి వచ్చింది సినిమా చూడటానికి!రజనీ హవా అలా ఉంది.
‘హుకుమ్... టైగర్ కా హుకుమ్’ అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సినిమా హాల్లో విజిల్స్‌ను మోతెక్కిస్తోంది. ప్రపంచాన్ని ఇప్పుడు రజనీ చుట్టుముట్టి ఉన్నాడు– జైలర్ సినిమాతో. అసలే రజనీ అనుకుంటే అతనికి తోడు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివ రాజ్‌కుమార్ కూడా సినిమాలో ఉండేసరికి మాస్ ఆడియెన్స్ పోటెత్తుతున్నారు. అయితే ఈ సంబరంలో ఇండియన్స్ మాత్రమే లేరు... జపనీయులు కూడా ఉన్నారు.
‘ముత్తు’ కాలం నుంచి ఇండియాలో రజనీ ఎంతో జపాన్‌లో కూడా అంతే. అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ. అందుకే ఇండియాలో ఉన్న జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకీ ఒక వీడియో రిలీజ్ చేసి అందులో రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘రజనీ యూ ఆర్ జస్ట్ సూపర్.. విష్ యూ గ్రేట్ సక్సెస్’ అని చెప్పాడు. ఇలాంటి మర్యాద ఏ స్టార్‌కూ దక్కలేదు. ఇక జపాన్‌లోని ఒకాసా నుంచి యసుదా హిదెతోషి అనే ఆసామి తన భార్యతో ఏకంగా చెన్నైలో ల్యాండ్ అయ్యాడు ‘జైలర్’ చూసేందుకు. అతను జపాన్‌లో ఆల్ జపాన్ రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అట. నెల్సన్ డైరెక్ట్ చేసిన ‘జైలర్’ ప్రస్తుతం కలెక్షన్ల హవా సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment