బాధ్యతలు పెరిగే కొద్దీ ‘ఉపాసన’ శక్తి పెరుగుతుందేమో! పెరిగే కొద్దీ కాకపోవచ్చు. ఇష్టపడే కొద్దీ అనాలి. పవర్ ఉమన్ ఉపాసన కామినేని కొణిదెల ఇప్పుడు ‘సూపర్ ఎగ్జయిటెడ్’గా ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధ వన్యప్రాణి సంరక్షణ సంస్థ డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. (వరల్డ్ వైడ్ ఫండ్) తనను రెండు తెలుగు రాష్ట్రాలకు ఫిలాంథ్రోఫీ అంబాసిడర్‌గా ఎంపిక చేసిందన్న వార్తను వినగానే ఆ పచ్చని కబురును వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. దాతృత్వ రాయబారి (ఫిలాంథ్రోఫీ అంబాసిడర్) గా ఉపాసన అటవీశాఖకు చెందిన 20 వేల మంది కార్మికుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని స్వీకరిస్తారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఆపోలో ఆసుపత్రులు ఆ కార్మికులకు వైద్య చికిత్సలను అందజేస్తాయి. భారత్‌లో డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. కార్యక్రమాలు మొదలై ఈ ఏడాదికి యాభై ఏళ్లు. ఇదే ఏడాది ఉపాసన రాయబారి అవడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఉపసాన ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ సి.ఎస్.ఆర్. వైస్–ఛైర్మన్‌గా, అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ‘బి–పాజిటివ్’ మ్యాగజీన్ ముఖ్య సంపాదకురాలిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ‘అమితమైన ఉద్వేగానికి లోనయ్యాను. నిబద్దతతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన పెట్టిన పోస్ట్‌ని బట్టి ఇప్పుడీ కొత్త బాధ్యత ఆమెకు మరింత పవర్ ఇవ్వబోతున్నట్లే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment