Wildlife conservation
-
వన్య ప్రాణులకు జీవధార
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందేవి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో సుమారు 60 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా 25 చెక్ డ్యామ్‌ల ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటి తొట్టెల్లో వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తెచ్చి నింపుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. నీటి తొట్టెల పక్కన ఉప్పు ముద్దలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు ఆ నీరు తాగి.. ఉప్పు ముద్దను నాకుతాయని.. దీనివల్ల వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలుంటాయని అటవీశాఖ అధికారులంటున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. పాపికొండల అభయారణ్యంలో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, చిరుతలు, ముళ్ల పందులు, జాకర్స్, దున్నలు వంటి అనేక జంతువులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి సమస్య తలెత్తకుండా చర్యలు పాపికొండల అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీరు పోసి నింపుతున్నాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – దావీదు రాజునాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
కొండముచ్చు అంటే హీరో లెక్క.. కానీ, వాటికి ఎంత కష్టమొచ్చింది!
కొండముచ్చు అంటే హీరో లెక్క.. ఇంతోటి మనం కూడా ఏమీ చేయలేని కోతుల సమస్యకు అది చిటికెలో పరిష్కారం చూపేది.. రంగంలోకి దిగిందంటే.. ఎలాంటి అల్లరి కోతులైనా తోకలు ముడిచి, పారిపోవాల్సి వచ్చేది.. ఇదంతా నిన్నమొన్నటి సంగతి.. మరి ఇప్పుడు.. సీను రివర్సైంది.. కొండముచ్చులకే కష్టమొచ్చింది.. వీటిని చూస్తే భయపడే కోతులే.. వీటిని భయపెట్టడం మొదలుపెట్టాయి.. సాక్షి, హైదరాబాద్: కొండెంగలు, కోతులు ఒకే రకం జాతికి చెందినవైనా... కొండమచ్చులు అడవుల్లోపలే ఉంటే.. కోతులు మాత్రం రహదారులకు దగ్గరగా ఉండడంతో పాటు ఊర్లు, పట్ట ణాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. ఈ రెండింటి మధ్య జాతివైర మనేది ఏదీ లేకపోయినా కోతుల కంటే ఎక్కువ బరువు, సైజులో రెండు, మూడింతలు పెద్దగా ఉండే.. కొండముచ్చులు నల్లటి ముఖాలు, పొడవాటి తోకలతో ఒకింత భయం గొలి పేలా ఉంటాయి. దీంతో వీటికి కోతులు భయపడతాయనే అభి ప్రాయం ఎప్పటి నుంచో స్థిరపడింది. దీనికి తగ్గట్టుగానే గతంలో చాలా సందర్భాల్లో ఊళ్లలో కోతులను భయపెట్టి తరిమేసేందుకు కొండముచ్చులను ఉపయోగించారు. ఇప్పుడూ రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువున్న గ్రామాల్లో అదే పద్ధతిని ఉపయోగి స్తున్నారు. అయితే, మొదట్లో కొండముచ్చులను చూసి కొన్ని చోట్ల కోతులు వెనక్కు తగ్గినా.. మారిన కాలమాన పరిస్థితులు, మారిన కోతుల ఆహార అలవాట్లు, సొంతంగా కష్టపడకుండానే ఆహారం సంపాదించే మార్గాల కోసం జనావాసాలపై పడడం వంటి పరిణామాలతో వాటి స్వభావా ల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కోతులు వాటికి భయపడడం మానే శాయి. ఇంతటితో ఆగకుండా కొండ ముచ్చులనే భయపెట్టే పరిస్థితులు ఏర్పడడంతో గ్రామ స్తులు తలలు పట్టుకుంటు న్నారు. పైగా.. కొన్ని చోట్ల రెండింటి మధ్య ‘ఫ్రెండ్షిప్’ మొద లవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. కోతులకు తోడు కొత్తగా కొండెంగలు కూడా తిష్ట వేయడంతో ఈ రెండింటి బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక గ్రామప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. కోతులను భయ పెట్టేందుకు కొండెంగలను తీసుకురావడాన్ని వన్యప్రాణి హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణి చట్టాలను ఉల్లంఘించి వాటిని తీసుకురావడానికి బదులు కోతుల బెడద నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. ఈ జిల్లాల్లో సమస్య ఎక్కువ.. కోతులతో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇళ్లపైకి గుంపులుగా దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ప్రధానంగా...ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ఉంది. వివిధ గ్రామపంచాయతీల పరిధిలో కోతుల నియంత్రణకు కొండెంగలను ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొండముచ్చులను పెంచారు. కోతుల సమస్య కొంత నియంత్రణలోకి రావడంతో చుట్టుపక్కల ఊళ్ల వారు కూడా వాటిని తీసుకెళ్లి కొంతకాలం ఆయా ఊళ్లలో తిప్పుకున్న సందర్భాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణగా కొండముచ్చులను పెంచారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభా గురుకుల కేంద్రం కాలేజీలో వీటి సేవలను వినియోగించారు. వాటిని తేవడం చట్టవిరుద్ధం... ‘‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా షెడ్యూల్–1 జాతికి చెందిన కొండముచ్చులను (లంగూరు) తీసుకురావడం చట్టవ్యతిరేకం. అడవుల్లోని కొండెంగలను పట్టి జనావాసాల్లోకి తీసుకురావడాన్ని చట్టం అనుమతించదు. వాటిని తీసుకొస్తే కోతుల సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు భావించడం హేతుబద్ధం కాదు. బలవంతంగా తీసుకొచ్చి బంధించి పెడితే తప్ప. మనుషులున్న చోట అవి ఎక్కువగా ఉండవు’’ – అటవీశాఖ వైల్డ్ లైఫ్ విభాగం ఓఎస్డీ ఎ.శంకరన్ -
పులుల ప్రోగ్రెస్ రిపోర్ట్!
జీవవైవిధ్యాన్ని పరిరక్షించటంలో, పర్యావరణాన్ని కాపాడటంలో, ప్రకృతి సమతుల్యత కొనసాగటంలో పులుల ప్రాధాన్యం తెలిసినవారికి దేశంలో పులుల సంఖ్య పెరిగిందన్న వార్త ఉపశమనం ఇస్తుంది. ప్రధాని ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,167 పులులున్నాయి. అయిదేళ్లక్రితం 2,226గా ఉన్న సంఖ్య ఇంతగా పెరిగిందంటే పులుల సంరక్షణకు తీసుకుంటున్న పటిష్ఠ చర్యలే కారణమనడంలో సందేహం లేదు. ఒక్క పులులన్న మాటేమిటి... వన్యమృగాల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల వల్ల సింహాలు, చిరుతపులుల సంఖ్య కూడా గణనీయంగా హెచ్చింది. ఆసియా జాతి సింహాల సంఖ్య 523 నుంచి 674కు, చిరుతల పులుల సంఖ్య దాదాపు 8,000 నుంచి 12,852కు పెరిగాయి. పులుల సంఖ్య పెంచటంతోపాటు దేశంలో కనుమరుగైన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తెప్పించి ఇక్కడి అడవుల్లో వదిలిపెట్టారు. ప్రపంచంలో ఉన్న పులుల్లో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయంటే అది ప్రాజెక్టు టైగర్ పథకం చలవే. సరిగ్గా యాభైయ్యేళ్ల క్రితం భారత్‌లో పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సంకల్పంతో డాక్టర్ కరణ్‌సింగ్ నేతృత్వంలో పద్మజానాయుడు, కైలాస్ సంకాల వంటివారితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. తర్వాతే ప్రాజెక్ట్ టైగర్ కింద పులుల తొలి సంరక్షణ కేంద్రం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మొదలైంది. పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 55కు చేరుకుంది. ప్రాజెక్టు టైగర్ ప్రారంభించేనాటికి పులులు, సింహాల వేట సంపన్నవర్గాలకు వినోదంగా ఉండేది. వారిని అడవుల జోలికి రాకుండా చేయటానికి కఠిన చర్యలు తీసుకోవటం ప్రారంభించాక క్రమేపీ ఆ ధోరణి తగ్గింది. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అతిగా వినియోగించుకోవటం వల్ల వన్యప్రాణుల్లోని ఎన్నో జాతులకు ప్రాణం మీదికొస్తోంది. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకు 27 రకాల జాతులు అంతరిస్తున్నాయి. పులుల సంఖ్య పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నా దేశంలో ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే జీవ వైవిధ్యతకు పెట్టింది పేరైన పడమటి కనుమల ప్రాంతంలో పులుల సంఖ్య తగ్గిందని గణాంకాలు సూచిస్తున్నాయి. 1,600 కిలోమీటర్ల పొడవునా 1,40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో పడమటి కనుమలు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పులుల సంరక్షణ కేంద్రాలు 12 ఉండగా, ఇతరేతర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 68 వరకూ ఉన్నాయి. అయితే అయిదేళ్లక్రితం ఈ ప్రాంతంలో 981గా ఉన్న పులుల సంఖ్య ఇప్పుడు 824 మాత్రమే. పడమటి కనుమలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి చాన్నాళ్లయింది. అక్కడి మూడోవంతు ప్రాంతం జీవావరణపరంగా సున్నితమైనదని 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది కూడా. కానీ తదుపరి చర్యలు అందుకు తగ్గట్టుగా లేవు. ఇలా ప్రకటించటాన్ని కర్ణాటక, కేరళ, గోవా తప్పుబట్టాయి. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత తీరిందన్నట్టు చేతులు దులుపుకొంది. ఫలితంగా అడవులు తరిగి, పర్యావరణం దెబ్బతిని, వన్య ప్రాణులకు ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పర్యవసానంగానే దేశమంతా పులుల సంఖ్య పెరిగితే అక్కడ తగ్గింది. దీన్ని తగ్గటంగా పరిగణించనవసరం లేదు...పులుల సంఖ్య స్థిరంగా ఉండిపోయినట్టు భావించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నవారు లేకపోలేదు. కానీ అడవులు అంతరిస్తూ వాటి స్థానంలో రోడ్లు విస్తరిస్తుంటే...పర్యాటకం పేరిట మనుషుల తాకిడి పెరుగుతుంటే, ఖనిజాల కోసం అడవులు నరకడానికి పూనుకుంటే వన్యప్రాణులు ప్రశాంతంగా మనుగడ సాగించలేవు. పులులు, అవి వేటాడే జంతువులు సంచరించే ప్రాంతాలు కుంచించుకుపోతే పులులపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. వేట కోసం వెదుక్కుంటూ జనావాసాలపై కూడా పడతాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అడవుల వినాశనానికి కారణమవుతున్న ప్రభు త్వాలు ఆ తర్వాత జరిగే పర్యవసానాలు ఎదుర్కొనటానికి మరిన్ని అవకతవకలకు పాల్పడుతున్నాయి. ఏనుగులు, పులులు, చిరుతల బారినపడి గత పదినెలల్లో 41మంది పౌరులు మరణించారని మొన్న ఫిబ్రవరిలో కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది. స్వేచ్ఛగా సంచరించటానికి, ఆహారం వెదుక్కొనటానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు పులుల్లో ఒకరకమైన అభద్రతాభావం ఏర్పడి వాటి పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుందని నాలుగేళ్లక్రితం సీసీఎంబీ నివేదిక హెచ్చరించింది. వన్యమృగాల సంరక్షణ పేరుతో ఆదివాసీలను అడవులకు దూరం చేద్దామని ప్రయత్నించే ప్రభు త్వాలు తీరా ఆ అడవులను ఖనిజాల వెలికితీత కోసం బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి, విశాల మైన రోడ్లు నిర్మించటానికి వెనకాడటం లేదు. దాంతో భారీ యంత్రాలు అక్కడికి తరలివస్తున్నాయి. వన్యప్రాణులను హడలెత్తిస్తున్నాయి. నిజానికి శతాబ్దాలుగా ఆదివాసీలు వన్యప్రాణులతో సురక్షితంగా సహజీవనం సాగిస్తున్నారు. వాటి కదలికలకు అనువుగా జీవనం సాగించటం, వాటికి హాని కలగనిరీతిలో అవసరమైన ఆత్మరక్షణ చర్యలు తీసుకోవటం పరంపరాగతంగా వారికి అలవడిన విద్య. ఏదేమైనా అడవుల సంరక్షణకూ, వన్యమృగాలను కాపాడటానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోనట్టయితే జీవవైవిధ్యం నాశనమవుతుంది. మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు వెలువడిన నివేదికలోని గణాంకాలు ఆశావహంగానే ఉన్నా చేయాల్సింది ఇంకెంతో ఉన్నదని నివేదిక తెలియజేస్తోంది. ఆ దిశగా అడుగులేయటమే ప్రభుత్వాల కర్తవ్యం. -
Nallamala Forest: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
నల్లమల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఆటకట్టించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రిస్తున్నారు. అభయారణ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు గూడేలలో గార్డుల నిఘాతోపాటు కొరియర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 15 కేసులు నమోదు చేసి 35 మంది వేటగాళ్లను జైలుకు పంపారు. మార్కాపురం: ప్రకాశం జిల్లాలో 3568 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించింది. మార్కాపురం, పెద్దదోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, కంభం, గిద్దలూరు, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు పరిధిలో ఉన్న అటవీ సమీప గ్రామాల్లో వన్యప్రాణులను వేటాడడం, అటవీ సంపదను వేటగాళ్లు దోచుకుంటున్నారు. మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, దోర్నాల, కొర్రపోలు, నెక్కంటి, గంజీవారిపల్లి, యర్రగొండపాలెం, విజయపురి సౌత్‌లో అటవీ శాఖ అధికార కార్యాలయాలు ఉన్నాయి. వీరి పరిధిలో ఏడుగురు రేంజ్ ఆఫీసర్లు, పది మంది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు, 60 మంది బీట్ అధికారులు ఉన్నారు. వేటగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు అభయారణ్యంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఏమాత్రం కదలికలు కనిపించినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వేటగాళ్లు గిరిజన గూడేలు, సమీప గ్రామాలను ఎంపిక చేసుకుని నిరంతరం వన్యప్రాణులను సంహరిస్తున్నారు. జింకలు, దుప్పులు, కణుతులు, కుందేళ్లను రాత్రిపూట వేటకు వెళ్లి ఉచ్చులేసి చంపి విక్రయిస్తున్నారు. దీంతో రేంజ్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు గార్డులు, నిఘా పెట్టారు. కొరియర్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఐదు నెలల కాలంలో 35 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులకు సంబంధించి మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో 35 మంది వేటగాళ్లను అరెస్టు చేశారు. దాదాపు 2.25 లక్షల అపరాధ రుసుము విధించారు. మార్కాపురం పరిధిలో 9 కేసుల్లో 19 మందిని, పెద్దదోర్నాల పరిధిలో 3 కేసుల్లో 10, యర్రగొండపాలెం పరిధిలో 1 కేసులో 3, విజయపురి సౌత్ పరిధిలో 2 కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. రాత్రిపూట అటవీశాఖ సిబ్బంది గస్తీని పెంచారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వేటాడితే కఠిన చర్యలు వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అటవీ జంతువులు కనిపిస్తే ఎవరూ చంపవద్దు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం శిక్షలు అమలవుతాయి. – విఘ్నేష్ అప్పావ్, డీడీ, మార్కాపురం ముఖ్య సంఘటనలు ► సెప్టెంబర్ 24న కలుజువ్వలపాడు దగ్గర కుందేళ్లను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. ► సెప్టెంబర్ 1న కొనకనమిట్ల మండలం మునగపాడు వద్ద ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ► నవంబర్ 7న పట్టణంలోని బాపూజీ కాలనీకి చెందిన ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేశారు. వీరితో పాటు దోర్నాల మండలం కొత్తూరు వద్ద అడవిపందిని పట్టుకుని చంపి మాంసం విక్రయిస్తున్న వేటగాళ్లను అరెస్టు చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల పరిధిలో ఇద్దరు వేటగాళ్లను, బోడపాడు వద్ద అక్టోబర్‌లో ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. గత నెలలో గిద్దలూరులో కూడా పలువురు వేటగాళ్లను అరెస్టు చేశారు. -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఈ జంట మరీ వైల్డ్! స్టంట్ కాదు...పాములతో నిజమైన పెళ్లి!
అబ్బాయి మెడలో చిన్న పాము, అమ్మాయి మెడలో పైథాన్... పై ఫొటో సాహస స్టంట్‌ను తలపిస్తోంది కదా! కానీ అక్కడ పెళ్లి జరుగుతోంది. పెళ్లికి ఎవరైనా పూల దండలు వేసుకుంటారు. మరీ పైసలెక్కువైతే నోట్ల దండలేసుకుంటా రు. కానీ వీళ్లేంటి మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నారనుకుంటున్నారా? వాళ్లిద్దరూ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన వైల్డ్ లైఫ్ ఆఫీసర్స్ సిద్ధార్థ్ సోనావానే, సృష్టి ఔసర్మాల్. 2010 నవంబర్ 12న వాళ్ల పెళ్లి జరిగింది. అసలే వన్యప్రాణి సంరక్షణ అధికారులు. పూలదండలు మార్చుకుంటే ఏం బాగుంటుంది? అనుకున్నారేమో. పాములనే దండలుగా మార్చుకున్నారు. వధువు సృష్టి ఔసర్మాల్ వరుడికి ఓ చిన్నపామును మెడలో వేస్తే... ‘నేనేం తక్కువ’ అంటూ వరుడు ఏకంగా పైథాన్నే వధువు మెడలో వేశాడు. ఆ తరువాత వాటిని అడవిలో వదిలేశారనుకోండి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది... కానీ ఆ పాములు కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయి ఉంటే? ఏమయ్యేది అని నెటిజన్స్ వాపోతున్నారు. (చదవండి: నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్!.. అడ్డుకుని తీరతామంటూ..) -
నల్లమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్
సాక్షి, నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ విశిష్టతను కాపాడుతూనే వన్యప్రాణుల పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ చంద్రప్రకాశ్ గోయల్ తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద నల్లమల ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు 70 కి.మీ. రహదారిని ప్లాస్టిక్ రహితంగా మార్చడంతో పాటు ఆ ప్లాస్టిక్‌ను మన్ననూర్‌లో రీసైక్లింగ్ చేయిస్తామన్నారు. ఇందుకోసం 15 మంది స్థానిక చెంచులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. టైగర్ రిజర్వులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం దేశంలోనే తొలిసారన్నారు. అనంతరం మన్ననూర్లోని వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రం, బయోల్యాబ్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. అమ్రాబాద్ జంగిల్ సఫారీలో ప్రయాణించిన అధికారులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. నల్లమలలో చెంచు మహిళలకు ఉపాధి కల్పించేందుకు అపోలో ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ప్యాకేజింగ్ వర్క్‌షాపు, అచ్చంపేట అటవీశాఖ కార్యాలయంలో చౌసింగా మీటింగ్ హాల్, ఔషధ మొక్కలతో ఏర్పాటుచేసిన మెడిసినల్ గార్డెన్‌ను ప్రారంభించారు. అలాగే అచ్చంపేటలో నిర్మించనున్న అటవీ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. -
చనాకా–కొరటకు వన్యప్రాణి సంరక్షణ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ నదిపై మహారాష్ట్ర, తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా చేపట్టిన చనాకా–కొరట బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని వన్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో భాగంగా గతనెల 24న ప్రాజెక్టుపై పర్యావరణ శాఖమంత్రి ఆధ్వర్యంలోని స్టాండింగ్ కమిటీ ఈ ప్రాజెక్టు అనుమతులపై చర్చించింది. 0.80 టీఎంసీ సామర్థ్యంతో రూ.368 కోట్లతో బ్యారేజీ చేపట్టారు. 13,500 ఎకరాల ఆయకట్టు తెలంగాణలో, మరో 3 వేల ఎకరాల ఆయకట్టు మహారాష్ట్రలో దీనిద్వారా సాగు జరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మహారాష్ట్రలోని తాపేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉంది. దీనికి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో 213.48 హెక్టార్ల అటవేతర (నాన్ ఫారెస్ట్) భూమి అవసరం కానుండగా, మరో 5 వేల హెక్టార్ల అటవేతర భూమి రెండు రాష్ట్రాల్లోని బ్యారేజీ నిర్మాణం, ముంపు ప్రాంతంలోకి వస్తుంది. దీని పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం కమిటీకి పంపగా, అటవీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు జర గడం లేదని, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అనుమతులు జారీచేసింది. అయితే సంరక్షణ కేంద్రానికి చుట్టు పక్కల పెద్ద శబ్దాలొచ్చే యంత్రాలను వాడరాదని, కెనాల్ పనుల నిమిత్తం ఉండే కార్మికుల క్యాంపులు సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉండాలని, అటవీ శాఖకు కెనాల్ నీటిని పూర్తి ఉచితంగా అందించాలని షరతులు విధించింది. చదవండి: Sitarama project: ముంపు సంగతేంటి...? -
భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ
ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ... హెచ్‌సిఎల్ కంపెనీ సిఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. విద్యాజ్ఞాన్ చైర్పర్సన్... ఆమె రోష్నీ నాడార్ మల్హోత్రా... శివ్ నాడార్ ఏకైక కుమార్తె. భారతదేశంలో విజయాలు సాధించిన మహిళల గురించి మాట్లాడుకునేటప్పుడు రోష్నీ నాడార్ మల్హోత్రా గురించి తప్పక చెప్పాలి. కోవిడ్ – 19 మహమ్మారి సమయంలో సమర్థమైన నాయకత్వ లక్షణాలు చూపించిన 25 మంది పారిశ్రామిక వేత్తలలో రోష్నీ పేరు కూడా ఉంది. 38 సంవత్సరాల రోష్నీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ అయ్యారు. అంతకు ముందు భారతీయ ఐటీ కంపెనీని నడిపించిన మొట్టమొదటి మహిళగా మరో విజయం సాధించిన గుర్తింపు పొందారు. చిన్నతనంలోనే... సాంకేతిక దిగ్గజం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అయిన శివ్ నాడార్కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్నీ వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సిఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సిఈవో బాధ్యతలు కూడా చేపట్టారు. విచిత్రమేమిటంటే, ఆమెకు సాంకేతిక రంగం మీద అస్సలు ఆసక్తి లేదు. వార్తా మాధ్యమం నుంచి ఆమె ప్రయాణం సాంకేతిక రంగం వైపుకి మళ్లింది. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలంటే, పని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని అర్థం చేసుకుని, తన రంగాన్ని అలా మార్చుకున్నారు. తక్షణం భారతదేశానికి తిరిగివచ్చి తన ఫ్యామిలీ బిజినెస్ మీద పనిచేయటం ప్రారంభించారు. సాంకేతిక రంగం మీద అవగాహన లేకపోయినప్పటికీ, రోష్నీ చూపిన శ్రద్ధ, అంకితభావం కారణంగా ఆ కంపెనీ ఆర్థికంగా, పరిపాలనా పరంగా బాగా ఎదిగింది. తండ్రి శివ్ నాడార్‌తో రోష్నీ నాడార్ మల్హోత్రా సంగీత సేవా కార్యక్రమాలలో.. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, యోగా మీద ఆసక్తి ఎక్కువ. హెచ్‌సిఎల్‌లో చేరటానికి ముందు రోష్నీ ‘శివ నాడార్ ఫౌండేషన్’లో ట్రస్టీగా సేవలు అందించారు. ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా ‘శ్రీశివసుబ్రమణ్య నాడార్ ఇంజినీరింగ్ కాలేజీ’ ని చెన్నైలో నడుపుతోంది. విద్యాజ్ఞాన్ సంస్థకు అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు రోష్నీ. ఈ సంస్థలో.. ఆర్థికంగా వెనుకబడినవారికి, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రజలకు మాత్రమే ప్రవేశం. గ్రామీణ భారతం నుంచి నాయకులను తయారు చేయాలనేదే ఆమె కోరిక. వన్యప్రాణి పరిరక్షణ రోష్నీ నాడార్కు వన్యప్రాణి సంరక్షణ అంటే చాలా ఇష్టం. వాటిని సంరక్షించటంతోపాటు పరిరక్షించటమంటే మరీ ఇష్టం. 2018లో హ్యాబిటేట్స్ ట్రస్ట్‌ను స్థాపించి, ఈ సంస్థ ద్వారా భారతదేశానికి చెందిన ప్రాణులను పరిరక్షిస్తుంటారు. వివిధ వన్యప్రాణి సంస్థలతో కలిసి వన్యప్రాణి సమతుల్యతకు కృషి చేస్తున్నారు. హోండా కంపెనీలో పనిచేస్తున్న శిఖర్ మల్హోత్రాను 2009లో వివాహమాడారు. వివాహానంతరం హెచ్‌సిఎల్‌లో చేరి, ప్రస్తుతం ‘హెచ్‌సిఎల్ హెల్త్‌కేర్’లో వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం అర్మాన్, జహాన్. ఆమె సాధించిన విజయాలకు అనేక అవార్డులు అందుకున్నారు. -
ఎస్సారెస్పీకి అరుదైన గుర్తింపు
సాక్షి,నిజామాబాద్: కనువిందు చేసే కృష్ణజింకలు, ఫ్లెమింగో, ఫెలికాన్ వంటి విదేశీ పక్షుల కిలకిలలతో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతం ఇకపై వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారనుంది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని ‘కమ్యూనిటీ రిజర్వు’గా ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదిత ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ శోభ శుక్రవారం పరిశీలించారు. కృష్ణజింకల గంతులు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో శ్రీరాంసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్ ప్రాంతం సుమారు నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గినప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చిక బయళ్లుగా మారుతుంది. కనుచూపు మేర పచ్చదనం పరుచుకుంటోంది. ఆహారం కోసం గుంపులు గుంపులుగా సంచరించే కృష్ణజింకలు కనువిందు చేస్తుంటాయి. ప్రతిరోజు సూర్యోదయం అవుతుంటే చాలు సమీపంలోని గుట్టల చాటు నుంచి బయటకు వస్తున్నాయి. రాజస్తాన్, కర్నూల్ జిల్లాలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో మాత్రమే కనిపించే ఈ జింకలు ఇక్కడ సుమారు 30 వేల వరకు ఉంటాయని అటవీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రజల భాగస్వామ్యంతో.. నూతనంగా ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ రిజర్వును ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. నందిపేట్ మండలం జీజీ నడుకుడ గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తారు. సంరక్షణ కేంద్రం నిర్వహణ బాధ్యతలను కమిటీకి అప్పగిస్తారు. అలాగే.. పర్యాటకుల సౌకర్యం కోసం వ్యూ పాయింట్ వంటివి ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ రిజర్వు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి సునీల్ హీరేమత్ ‘సాక్షి’కి తెలిపారు. -
వన్యప్రాణులు గజ గజ!
తెలివికి, దృఢత్వానికి, శక్తికి ఏనుగు ప్రతీక. హిందూ, బౌద్ధ సంస్కృతుల్లో దానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అది ‘పరిరక్షించి తీరాల్సిన విలువైన జాతీయ సంపద’ని పదేళ్లకిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మెదడు పెద్దగా వుండి, తెలివున్న జంతువుల్లో ఏనుగు మూడోది. అది ఎన్నో అనుభ వాలను నిక్షిప్తం చేసుకోగలదంటారు. ఎంతదూరం వెళ్లినా తాను సంచరించే దారుల్ని పక్కాగా గుర్తుంచుకుని మళ్లీ అదే దారిలో వెనక్కివెళ్లగలగడం దాని ప్రత్యేకత. అంతటి ప్రాముఖ్యత వున్న ఏనుగుల్ని ‘దేవుడి స్వస్థలం’గా పిలుచుకునే కేరళలో దుండగులు వెంటాడి హతమారుస్తున్నారని వస్తున్న వార్తలు దేశం మొత్తాన్ని కదిలించాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాలో తటస్థ ప్రాంతంగా ప్రకటించినచోట ఒక ఆడ ఏనుగును పైనాపిల్ ఫలంలో బాంబు పెట్టి ప్రాణం తీసిన తీరు అందరినీ కలచివేసింది. ఈ ఏనుగు గర్భిణి కూడా కావడంతో వన్యప్రాణి సంరక్షణ రంగంలో పనిచేసేవారితోపాటు ఇతరులు కూడా స్పందించారు. ఇది ఈమధ్యకాలంలో జరిగిన మొదటి ఘటన కూడా కాదు. మొన్న ఏప్రిల్ నెలలో కొల్లాం జిల్లాలో మరో ఆడ ఏనుగును గుర్తుతెలియని వ్యక్తులు ఇలాగే మట్టుబెట్టారు. వన్యప్రాణులకు అక్కడ రక్షణ లేకుండా పోతున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో అనేకులు విరుచుకుపడ్డారు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటనా లేక ఉద్దేశపూర్వకంగా చేసిందా అనేది ఇంకా తేలాల్సివుంది. కేరళకు అనేకవిధాల ప్రాముఖ్యత వున్నది. అక్కడున్న దట్టమైన అడవులు, కొండలు, నదులు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. అది ఎప్పుడో అర్ధ శతాబ్దంకిందటే వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. అలాంటిచోట వన్య ప్రాణుల సంరక్షణ ఆందోళనకరంగా మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పార్కులు, అడవులు వున్నచోటకు సమీపంగా జనావాసా లున్నప్పుడు సహజంగానే మనిషికి, మృగానికీ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంటుంది. ఏనుగులు గుంపులుగా వచ్చి తమ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని, తమ ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని జనం ఆరోపిస్తుంటారు. అలాగే వేసవికాలం వచ్చేసరికి పులులు వేట కోసం, నీటి కోసం జనావాసాలవైపు వస్తుంటాయి. కేరళలో వన్యప్రాణులపై దాడి ఘటనలు బాగా పెరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016 ఆగస్టు మొదలుకొని ఇంతవరకూ 23,182 ఉదంతాలు జరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పంటలు ధ్వంసం చేయడం, మనుషులను, పశువులను చంపడం వంటి కారణాలతో ఈ దాడులు జరిగాయి. ఇందులో 2015–2019 మధ్య 543మంది పౌరులు మరణించారు. 23 వన్యమృగాలు చనిపోయాయి. జనావాసాల్లోకొచ్చే వన్యప్రాణుల్ని గుర్తించి వాటిని మళ్లీ లోపలికి పంపడం కోసం అనేకచోట్ల జనజాగ్రత సమితులు ఏర్పాటు చేయడం, కొన్ని బృందాలను ఏర్పాటు చేయడంలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే ఇవి సరిపోవడం లేదని, వన్యప్రాణులపై దాడులు ఆగడం లేదని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. కేరళలో వన్యప్రాణులపై దాడులు జరగడానికి సంబంధించి భిన్న రకాల వాదనలున్నాయి. పంటపొలాలను నాశనం చేసే అడవి పందుల్ని నిలువరించడానికి రైతులు బాంబులు అమర్చిన పైనాపిల్ ఫలాలను పొలాల్లో అక్కడక్కడ వుంచుతారు. అడవి పందుల్ని చంపడానికి వాటిని వాడొచ్చని ప్రభుత్వం కూడా చెప్పింది. 1972నాటి వన్యప్రాణి పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 62 ప్రకారం ఉపద్రవంగా మారిన జంతువుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, వాటి జాబితాను పంపితే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతించొచ్చు. ఇప్పుడు ఏనుగు మరణానికి దారితీసిన పైనాపిల్ బాంబు కూడా అడవిపందుల్ని చంపడానికి ఉద్దేశించిందేనని కొందరు చెబుతున్న మాట. అనుకోకుండా దానివల్ల ఏనుగు బలైపోయివుండొచ్చని వారు వాదిస్తున్నారు. దీనికి భిన్నమైన వాదన మరొకటుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చుట్టూ కొంత ప్రాంతాన్ని తటస్థ ప్రాంతంగా గుర్తించి, అక్కడికి సాధారణ పౌరులెవరూ వెళ్లకూడదని ప్రభుత్వాలు ఆంక్షలు పెడతాయి. కొందరు దళారులు తయారై ఈ తటస్థ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా భూముల్ని చవగ్గా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని, ఎవరూ సంచరించని ప్రాంతం గనుక అధికార యంత్రాంగం పర్యవేక్షణ కూడా తక్కువగా ఉండటంతో అక్కడ భూమి కొన్నవారు పంటలు పండించుకోవడం వంటివి చేస్తున్నారన్నది మరికొందరి ఆరోపణ. ఏనుగులు విస్తారమైన ప్రాంతంలో సంచరించడానికి చూస్తాయి గనుక, సహజంగానే అవి వన్యప్రాణి కేంద్రాన్ని దాటి అప్పుడప్పుడు తటస్థ ప్రాంతానికొస్తాయని, వాటినుంచి పంటను కాపాడుకోవడానికి ఇలా మారణకాండకు పాల్ప డుతున్నారని అంటున్నారు. లోతుగా విచారిస్తే ఇప్పుడు జరుగుతున్న ఉదంతాల వెనకున్న కారణాలు వెల్లడవుతాయి. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటానికి వృక్ష, జంతుజాలాలను పరిరక్షించడం చాలా అవసరం. లేకుంటే అవి క్రమేపీ అంతరించిపోతాయి. ఒకప్పుడు లక్ష దాటివున్న పులుల సంఖ్య ఒక దశలో 1,500కు పడిపోయింది. ప్రభుత్వాలు తీసుకున్న అనేక చర్యల ఫలితంగా వాటి సంతతి క్రమేపీ పెరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ లెక్క ప్రకారం దేశంలో ప్రస్తుతం 20,000 ఏనుగులు మాత్రమే మిగిలాయి. కారణం ఏదైనా వాటిని చంపుకుంటూ పోతే అవి కనుమరుగు కావడానికి ఎన్నో రోజులు పట్టదు. మగ ఏనుగుల్ని దంతాల కోసం, వాటి చర్మాల కోసం చంపడం రివాజుగా మారింది. ఇలా పంటల్ని రక్షించుకునే పేరిట ఉద్దేశపూర్వకంగా కానీ, అనుకోకుండా కానీ గజ సంహారం కొనసాగడం సరేసరి. కొన్నేళ్లక్రితంక్రితం ఏనుగుల పరిరక్షణకోసం నియమించిన టాస్క్‌ఫోర్స్ విలువైన సూచనలు చేసింది. వాటి అమలు ఎలావుందో మరోసారి పరిశీలించి, మరింత మెరుగైన కార్యాచరణకు ఉపక్ర మించడం తక్షణావసరం. -
సూపర్ ఎగ్జయిటెడ్
బాధ్యతలు పెరిగే కొద్దీ ‘ఉపాసన’ శక్తి పెరుగుతుందేమో! పెరిగే కొద్దీ కాకపోవచ్చు. ఇష్టపడే కొద్దీ అనాలి. పవర్ ఉమన్ ఉపాసన కామినేని కొణిదెల ఇప్పుడు ‘సూపర్ ఎగ్జయిటెడ్’గా ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధ వన్యప్రాణి సంరక్షణ సంస్థ డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. (వరల్డ్ వైడ్ ఫండ్) తనను రెండు తెలుగు రాష్ట్రాలకు ఫిలాంథ్రోఫీ అంబాసిడర్‌గా ఎంపిక చేసిందన్న వార్తను వినగానే ఆ పచ్చని కబురును వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. దాతృత్వ రాయబారి (ఫిలాంథ్రోఫీ అంబాసిడర్) గా ఉపాసన అటవీశాఖకు చెందిన 20 వేల మంది కార్మికుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని స్వీకరిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆపోలో ఆసుపత్రులు ఆ కార్మికులకు వైద్య చికిత్సలను అందజేస్తాయి. భారత్‌లో డబ్లు్య.డబ్లు్య.ఎఫ్. కార్యక్రమాలు మొదలై ఈ ఏడాదికి యాభై ఏళ్లు. ఇదే ఏడాది ఉపాసన రాయబారి అవడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఉపసాన ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ సి.ఎస్.ఆర్. వైస్–ఛైర్మన్‌గా, అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ‘బి–పాజిటివ్’ మ్యాగజీన్ ముఖ్య సంపాదకురాలిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ‘అమితమైన ఉద్వేగానికి లోనయ్యాను. నిబద్దతతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన పెట్టిన పోస్ట్‌ని బట్టి ఇప్పుడీ కొత్త బాధ్యత ఆమెకు మరింత పవర్ ఇవ్వబోతున్నట్లే ఉంది. -
అటు పర్యావరణ పరిరక్షణ.. ఇటు జంతు సంరక్షణ
సాక్షి, మార్కాపురం: ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సుమారు 2.5లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దుగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల 1నుంచి 7వ తేదీ వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపురం డీఎఫ్ఓ ఖాదర్‌బాష ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో 48 పెద్ద పులులు, 60కి పైగా చిరుతలు, వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, అరుదైన పంగోలిన్, రాబంధువులు నివసిస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతాన్ని రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించారు. మొత్తం 24 బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి 120 మంది టైగర్ ట్రాకర్లను నియమించారు. వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా విజయపురిసౌత్, కర్నూలు జిల్లా రోళ్లపెంట, శ్రీశైలం, గిద్దలూరు సరిహద్దులుగా నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దేశంలో పెద్ద పులులు ఎక్కువగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వాటి రక్షణ కోసం రివాల్వర్లను కూడ సిబ్బందికి అందిస్తున్నారు. 1 నుంచి ప్లాస్టిక్ నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా నల్లమలలో ఈ నెల 1 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎఫ్ఓ ఖాదర్‌బాష తెలిపారు. ఇందు కోసం దోర్నాల –శ్రీశైలం, దోర్నాల– ఆత్మకూరు మధ్య ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయటంతో పాటు దోర్నాల, కొర్రపోలు, శ్రీశైలం గణపతి ఆలయం వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను వాహనాలను తనిఖీ చేసి ఉన్నట్లయితే తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడ సహకరించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, గంధం, ఇనుమద్ది, టేకు లాంటి వక్షాలతో పాటు అరుదైన ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. వాటి సంరక్షణకు కూడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవగాహన కార్యక్రమాలు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా మార్కాపురం అటవీశాఖ పరిధిలో అక్టోబర్ 1నుంచి7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఎఫ్ఓ ఖాదర్‌బాష తెలిపారు. తుమ్మలబయలు ఏకో టూరిజం పార్కుకు విద్యార్థులను తీసుకెళ్లి అవగాహన కల్పించామన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలను ఈ నెల 3న మార్కాపురం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించామన్నారు. 4న యర్రగొండపాలెంలోని కొమరోలుకు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతాన్ని బీఈడీ, డీఈడీ విద్యార్థులతో కలిసి సందర్శిస్తామని తెలిపారు. - ఖాదర్‌బాష, డీఎఫ్ఓ -
నీటి పిల్లులు, మరో ఐదు క్షీరదాలు గుర్తింపు
కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం, ఇతర గోదావరి డెల్టా ప్రాంతంలోని మడ అడవుల్లో 115 నీటి పిల్లులను మరో ఐదు రకాల క్షీరదాలను గుర్తించారని కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో సోమవారం రాష్ట్ర అటవీశాఖ వన్యమృగ సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోదావరి డెల్టా మడ అడవుల్లో నీటి పిల్లులు, ఇతర క్షీరదాలపై చేపట్టిన పరిశోధన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. కార్తికేయమిశ్రా మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా గోదావరి డెల్టాలోని మడ అడవుల్లో క్షీరదాలపై పరిశోధన జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న మడ అడవులు దేశంలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని, ఈ పరిశోధన ద్వారా అంతరించిపోతున్న వన్యమృగ సంరక్షణకు వీలవుతుందని తెలిపారు. ఈ పరిశోధనను 2018 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కోరింగ వన్య మృగ సంరక్షణ ప్రాంతం, ఇతర మడ అడవుల్లో చేపట్టారన్నారు. ఈ పరిశోధన కోసం 94 కెమెరా పాయింట్లలో అధిక నాణ్యత ఉన్న కెమెరాలను వినియోగించారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరించారు. 115 నీటి పిల్లులతోపాటు ఇండియన్ గోల్డెన్ జాకాల్, ర్విసెస్, మాకాక్యూ, స్మూత్ కోటెడ్ ఓటర్, జంగిల్ క్యాట్, మంగూస్ వంటి క్షీరదాలను గుర్తించారన్నారు. వీటిలో గుర్తించిన జాకల్ (నక్క) సంతతి సాధారణంగా మెట్ట ప్రాంతంలో ఉంటుందని, ఇవి తీర ప్రాంతంలోనూ సంచరిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా పరిశోధనకు శ్రీకారం చుట్టిన వన్యమృగ విభాగం, డీఎఫ్‌వో అనంతశంకర్ను కలెక్టర్ కార్తికేయ మిశ్రా అభినందించారు. జేసీ–2 సీహెచ్ సత్తిబాబు, డీఆర్వో ఎంవీ గోవిందరాజులు పాల్గొన్నారు. -
రెండు తలల పాములకు అతీంద్రియ శక్తులుండవు
సాక్షి, హైదరాబాద్: రెండు తలల పాములకు అతీంద్రియ శక్తులు ఉండవని, అన్ని పాముల్లానే అవి కూడా సాధారణ విష రహిత సర్పాలని వణ్యప్రాణి నిపుణుడు, అటవీ శాఖ ప్రత్యేకాధికారి ఎ.శంకరన్ స్పష్టం చేశారు. రెండు తలల పాములతో గుప్త నిధులు సాధించవచ్చంటూ జరుగుతున్న ప్రచారం మోసమని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ పాముకు ఒకే తల ఉంటుందని, అయితే దాని తోక కూడా తలను పోలి ఉండటంతో రెండు తలల పాముగా వాడుకలోకి వచ్చిందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో మల్కాపూర్, హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్, ఎయిర్ ఫోర్స్ కాలనీ, మేడ్చల్‌లలో ఈ పాములను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకొని గురువారం రక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా శంకరన్ మాట్లాడుతూ.. గుప్త నిధుల బలహీనత ఆసరాగా పాముల వేట కొనసాగుతోందని, ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు తలల పాముల అమ్మకం, అతీంద్రియ శక్తులుంటాయని ఎవరైనా ప్రచారం చేస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 4255 364కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. అలాంటి నేరాలకు వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. -
పులులు ఎప్పుడూ ఒంటరిగానే జీవిస్తాయి
సాక్షి, హైదరాబాద్: పులి ఒంటరిగా జీవించడానికే ఇష్టపడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా వలస వెళ్లవని వన్యప్రాణి సంరక్షణ విభాగం ప్రత్యేక అధికారి శంకరన్ తెలిపారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి బల్హర్షా జాతీయ రహదారి మీదుగా రాష్ట్రంలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టుకు 19 పులులు వలస వచ్చినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోకి పులులు వలస వస్తున్న మాట నిజమేనన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తాడోబా అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, కొత్త పులులు అక్కడ మనుగడ సాగించలేక కవ్వాల్ రిజర్వ్ ప్రాజెక్టులోకి ప్రవేశిస్తున్నాయని, ఆ దృశ్యాలు అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు చిక్కాయని శంకరన్ తెలిపారు. వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో తరహాలో గుంపులుగా రావని, పులి ఎప్పుడైనా ఒంటరిగానే ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందని చెప్పారు. తాడోబా నుంచి నిల్వాయి ఫారెస్టు ఏరియాకు రెండు, ఆదిలాబాద్ రేంజ్‌లోకి ఒకటి, జన్నారం ఫారెస్టులోకి ఒకటి, కాగజ్‌నగర్ రేంజ్ ఫారెస్టులోకి నాలుగు పులుల చొప్పున కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోకి వలస వచ్చినట్లు తెలిపారు. -
కాళ్లున్న పాము!
రుద్రంపూర్ (భద్రాద్రి కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో ఆదివారం అరుదైన పాము కనిపించింది. ఆరు ఫీట్ల పొడవున్న ఈ తాచు పాముకు శరీరం మధ్యలో కింది భాగాన రెండు కాళ్లు, వాటికి 8 గోర్లు ఉన్నాయి. ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు సంతోష్, ఇతర సిబ్బంది పామును పట్టుకుని డీఎఫ్‌వో రాంబాబుకు అప్పగించారు. అయితే దీనిపై ఆరా తీయగా ఇలాంటి పాములు ఏళ్ల క్రితం ఉండేవని గుర్తించారు. ఈ పాము వివరాలను వన్యప్రాణి సంరక్షణ అధికారు లకు చూపించి, పరిశీలించిన తర్వాత ఏం చేయాలో చెబుతామని డీఎఫ్‌వో తెలిపారు.