కాళ్లున్న పాము!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో ఆదివారం అరుదైన పాము కనిపించింది.
రుద్రంపూర్ (భద్రాద్రి కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో ఆదివారం అరుదైన పాము కనిపించింది. ఆరు ఫీట్ల పొడవున్న ఈ తాచు పాముకు శరీరం మధ్యలో కింది భాగాన రెండు కాళ్లు, వాటికి 8 గోర్లు ఉన్నాయి. ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు సంతోష్, ఇతర సిబ్బంది పామును పట్టుకుని డీఎఫ్‌వో రాంబాబుకు అప్పగించారు.
అయితే దీనిపై ఆరా తీయగా ఇలాంటి పాములు ఏళ్ల క్రితం ఉండేవని గుర్తించారు. ఈ పాము వివరాలను వన్యప్రాణి సంరక్షణ అధికారు లకు చూపించి, పరిశీలించిన తర్వాత ఏం చేయాలో చెబుతామని డీఎఫ్‌వో తెలిపారు.