‘గ్యాటోరెడ్’ అంబాసిడర్‌గా సింధు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్పోర్ట్స్ డ్రింక్ ‘గ్యాటోరెడ్’కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయనున్న తొలి భారత క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. పెప్సికో సంస్థ ఈ పానీయాన్ని ఉత్పత్తి చేస్తుంది. గతంలో స్టార్ ప్లేయర్స్ ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్), సెరెనా విలియమ్స్ (టెన్నిస్), మెస్సీ (ఫుట్‌బాల్) తదితరులు గ్యాటోరెడ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించారు.