క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న పురుషుల వన్డే ప్రపంచకప్ 2023కు గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ కొద్దిసేపటి కిందట ప్రకటించింది.
గ్లోబల్ అంబాసిడర్‌గా హోదాలో సచిన్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వరల్డ్‌కప్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ప్రపంచ కప్ ట్రోఫీతో పాటు మైదానంలోకి వస్తాడు. ఈ సందర్భంగా సచిన్ వరల్డ్‌కప్ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటిస్తాడు.
ఐసీసీ ప్రకటించిన వరల్డ్‌కప్ ఐసీసీ అంబాసిడర్ల జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా మాజీ సారథి అరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీథరన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్, టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment