ప్రపంచ కప్ 2015 అంబాసిడర్గా సచిన్ | sachin Tendulkar named ambassador for 2015 ICC World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచ కప్ 2015 అంబాసిడర్గా సచిన్

Published Mon, Dec 22 2014 12:22 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

ప్రపంచ కప్ 2015 అంబాసిడర్గా సచిన్

ప్రపంచ కప్ 2015 అంబాసిడర్గా సచిన్

దుబాయ్: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్నకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంబాసిడర్గా నియమితులయ్యాడు. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ మేరకు ప్రకటించింది.

వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచ కప్ అంబాసిడర్గా సచిన్ను వరుసగా రెండోసారి నియమించడం విశేషం. స్వదేశంలో జరిగిన గత ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి భారత్ జట్టులో సచిన్ ఉన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్దే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement