చుక్కలు చూపించిన దీపిక! | Deepika Padukone charges Rs 8 cr for a four day shoot of an airlines | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపించిన దీపిక!

Published Sat, Jun 11 2016 11:36 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

చుక్కలు చూపించిన దీపిక! - Sakshi

చుక్కలు చూపించిన దీపిక!

అదో ప్రముఖ విమానయాన సంస్థ... తమకు ప్రచారకర్తగా ఓ స్టార్  హీరోయిన్ కావాలనుకున్నారు. దీపికా పదుకొనేని మించిన స్టార్ ఎవరుంటారు? అనుకున్నారు. పైగా నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో కూడా ఫేమస్ అయిపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్‌గా కూడా వర్కవుట్ అవుతుందని వాళ్ల ఆలోచన. దీపిక క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు.

అంతే.. తమ ఎయిర్‌లైన్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించాలని అడిగారు. యాడ్ చిత్రీకరణ కోసం నాలుగు రోజులు కాల్షీట్ అడిగారు. దీపిక సంతోషంగా ఓకే చెప్పేశారు. కానీ ఆమె అడిగిన పారితోషికం విని, ఆ కంపెనీ ప్రతినిధులు కళ్లు తేలేశారు. ఏదో రెండు.. మూడు కోట్లు అడుగుతుందని లెక్కలేసుకున్నారట. కానీ, దీపిక ఎనిమిది కోట్లు అడగడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని వేరే హీరోయిన్‌ని వెతికే పనిలో పడ్డారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement