కొలతలు ఇస్తున్న దీపికా పదుకోన్
కళ్లు తిప్పుకోలేని అందం దీపికా పదుకోన్‌ది. ఇక నుంచి ఈ అందాల ముద్దు గుమ్మ లండన్‌లో మైనపు బొమ్మలా కనిపించనున్నారు. ఎందుకంటే.. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా పదుకోన్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట. సోమవారం ఈ మైనపు విగ్రహానికి కావాల్సిన నమూనాలను తుస్సాడ్స్ టీమ్‌కు ఇచ్చారు దీపికా పదుకోన్. ఈ ఏడాది దీపికా పదుకోన్‌కు బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు.
ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ‘పద్మావత్’ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్’ లిస్ట్‌లో ఆమె చోటు దక్కించునున్నారు. అలాగే ఈ ఏడాది చివర్లో ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌తో వివాహం కూడా ఖరారు అయింది. ఇన్ని గుడ్ న్యూస్‌లన్నింటికీ తోడు ప్రతిష్టాత్మక మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహానికి చోటు దక్కడం మరో గుడ్ న్యూస్.
ఈ విషయాన్ని దీపికా ట్వీటర్‌లో ‘ఇట్స్ ఆల్ ఎబౌట్ ది డీటైల్స్’ అంటూ తుస్సాడ్స్ మ్యూజియంకి కావాల్సిన కొలతలను ఇస్తున్న ఫొటోను పోస్ట్ చేసి కన్‌ఫర్మ్ చేశారు. విశేషం ఏంటంటే.. ఈ కుందనపు బొమ్మ మైనపు విగ్రహాన్ని బాలీవుడ్ సెలబ్రిటీస్ విగ్రహాలతో పాటుగా కాకుండా ఎ– లిస్ట్ సెక్షన్ పర్సనాలటీలు హాలీవుడ్ తారలు హెలెన్ మిర్రెన్, ఏంజెలీనా జోలీ మధ్య ఏర్పాటు చేయనున్నారు. హాలీవుడ్ స్టార్స్‌ని ‘ఎ’ లిస్ట్ సెక్షన్ అని తుస్సాడ్స్ వారు అంటారు. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ సంవత్సరం దీపిక కెరీర్‌లో బెస్ట్ ఇయర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment