
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్
బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి తేదీ అదీ.. ఇదీ అంటూ ప్రతిరోజూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇక వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే దీపికా, రణ్‌వీర్ ఒక్కటయ్యే తేదీని ప్రకటించారు. ‘‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో మేం (దీపికా, రణ్‌వీర్) నవంబర్ 14, 15 తేదీల్లో వివాహం చేసుకోబోతున్నాం. మా మీద ప్రేమ కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితంలో ప్రేమ, స్నేహం, విధేయత, కలిసి ఉండటం.. ఇవన్నీ కలగలిసిన సరికొత్త మజిలీ మొదలు పెడుతున్నాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. ప్రేమతో దీపిక, రణ్‌వీర్’’ అంటూ వివాహ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు. కాగా, వీరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment