Wedding Date
-
వివాహం, గృహప్రవేశం.. ఇంకా ఈ ఏడాది ముహూర్తాలు ఇవే!
క్యాలెండర్- 2023: ముహూర్తాలు ఇవే మాఘమాసం 14.01.23 శనివారం.. సప్తమి, హస్త, మీనలగ్నం ఉ. 10.46 ని.లకు క్రయవిక్రయ, వ్యాపారాదుల, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, విద్యారంభం. 26.01.23 గురువారం.. పంచమి, ఉత్తరాభాద్ర, మీనలగ్నం ఉ. 9.32 ని.లకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వ్యాపారం, క్రయవిక్రయాలు, ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం. మిథునలగ్నం సా. 4.18 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు. 28.01.23 శనివారం.. సప్తమి, అశ్విని, మీనలగ్నం, ఉ. 5.16 ని.లకు ఉపనయనం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వివాహం, శంఖుస్థాపన. 05.02.23 ఆదివారం.. పౌర్ణమి, పుష్యమి, మీనలగ్నం ఉ. 9.26 ని.లకు వ్యాపారాదులు, క్రయవిక్రయాదులు, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, మంత్రోపదేశం. ఫాల్గుణ మాసం 24.02.23 శుక్రవారం.. పంచమి, అశ్విని, మీనలగ్నం ఉ. 7.26 ని.కు వ్యాపారాదులు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. కన్యాలగ్నం రా. 8.32 ని.లకు గృహప్రవేశం, వివాహం, గర్భాదానం. ధనుర్లగ్నం తె. 3.22 ని.లకు వివాహం, గృహప్రవేశం. 11.03.23 శనివారం.. బ. పంచమి, స్వాతి, ధనుర్లగ్నం రా. 2.25 ని.లకు వివాహం, గృహప్రవేశం. మకరలగ్నం తె.3.23 ని.లకు గృహప్రవేశం, గృహారంభం, వివాహం. 18.03.23 శనివారం.. ఏకాదశి, శ్రవణం, మకర లగ్నం, తె.3.22 వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్. చైత్ర మాసం 22.03.23 బుధవారం.. శు. పాడ్యమి, ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం 29.03.23 నుండి చైత్ర శుద్ధ అష్టమి నుండి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురుమౌఢ్యమి. 05.04.23 బుధవారం.. శు. చతుర్ధశి, ఉత్తరా, మేషలగ్నంష ఉ.7.39 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 07.04.23 శుక్రవారం.. బ. పాడ్యమి, చిత్తా, మేషలగ్నం, ఉ.7.31 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 08.04.23 శనివారం.. విదియ, స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 12.04.23 బుధవారం.. సప్తమి, మూలా, మేషలగ్నం ఉ.7.12 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 15.04.23 శనివారం.. దశమి, ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. వైశాఖ మాసం 23.04.23 ఆదివారం.. చవితి, రోహిణి, కర్కాటక లగ్నం, ఉ.11.45 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాసన, కేశఖండన, బారసాల. 25.04.23 గురుమోఢ్యమి త్యాగం 03.05.23 బుధవారం.. త్రయోదశి, హస్త, వృషభలగ్నం, ఉ.7.18 ని.లకు వివాహం, గృహారంభం, ఉపనయనం, శంఖుస్థాపన. 07.05.23 ఆదివారం.. బ. విదియ, అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు. 10.05.23 నుండి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంఖుస్థాపనలు, బోరింగ్లు ఉండవు. 11.05.23 గురువారం.. షష్ఠి, ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 ని.లకు అన్నప్రాసన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు. జ్యేష్ఠ మాసం 25.05.23 గురువారం.. షష్ఠి, పుష్యమి, మిథున లగ్నం, ఉ.8.40 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. 31.05.23 బుధవారం.. ఏకాదశి, చిత్తా, మిథున లగ్నం, ఉ.8.16 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం. 07.06.23 బుధవారం.. చవితి, ఉత్తరాషాఢ, మిథున లగ్నం ఉ.7.49 ని.లకు అన్నప్రాసన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 ని.లకు వివాహం, గర్భాదానం, ప్రయాణం. 09.06.23 శుక్రవారం.. సప్తమి, శతభిషం, మీనలగ్నం, రా.12.56 ని.లకు వివాహం, గృహప్రవేశం. అధిక శ్రావణ మాసం 23.07.23 ఆదివారం.. శు. షష్ఠి, ఉత్తరా, కన్యాలగ్నం ఉ.10.34 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 30.07.23 ఆదివారం.. శు. త్రయోదశి, మూలా, కన్యాలగ్నం ఉ.10.07 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు,బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 06.08.23 ఆదివారం.. బ. పంచమి, రేవతి, కన్యాలగ్నం, ఉ.9.35 ని.లకు నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. 08.08.23 మంగళవారం.. శోభకృత్ నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుండి శోభకృత్ నామ సం.ర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు 19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి. నిజ శ్రావణ మాసం 20.08.23 శుక్లపక్షము ఆదివారం.. చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 ని.లకు గృహారంభం, గృహప్రవేశం, వివాహం. 24.08.23 గురువారం.. నవమి, అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. మిథునలగ్నం, రా.12.40 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 30.08.23 బుధవారం.. పూర్ణిమ, శతభిషం, వృషభలగ్నం, రా.11.30 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 01.09.23 శుక్రవారం.. బ. విదియ, ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 ని.లకు వివాహం, గర్భాదానం, గృహప్రవేశం, ప్రయాణాలు. 06.09.23 బుధవారం.. బ. అష్టమి, రోహిణి, వృషభలగ్నం, రా.11.02 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాదానం, 10.09.23 ఆదివారం.. బ. ఏకాదశి, పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 ని.లకు శంఖుస్థాపన, క్రయవిక్రయాలు, భాద్రపద మాసం 17.09.23 ఆదివారం.. శు. తదియ, చిత్త, ధనుర్లగ్నం మ.1.53 ని.లకు డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. 24.09.23 ఆదివారం.. శు. దశమి పూర్వాషాఢ వృశ్చికలగ్నం, ఉ.10.30 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 25.09.23 సోమవారం.. శు. ఏకాదశి, శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 30.09.23 నుండి 14.10.23 వరకు మహాలయ పక్షములు పితృపక్షాలు ముహూర్తాలు ఉండవు. (14.10.23 మహాలయ అమావాస్య) ఆశ్వయుజ మాసం 15.10.23 ఆదివారం.. శు. పాడ్యమి, చిత్త, వృశ్చిక లగ్నం, ఉ.8.50 ని.లకు శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవి పూజలు. 19.10.23 గురువారం.. శు. పంచమి, జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 ని.లకు సరస్వతీ పూజ. 21.10.23 శనివారం.. శు. అష్టమి, ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 ని.లకు వివాహం, గృహప్రవేశం 24.10.23 మంగళవారం.. విజయదశమి, ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుండి 11.45 ని.ల లోపు విజయ ముహూర్త కాలము. 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 ని.లకు సమస్త శుభాలు 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, 01.11.23 బుధవారం.. బ. చవితి, మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. 09.11.23 గురువారం.. బ. ఏకాదశి, ఉత్తరా, వృశ్చికలగ్నం, ఉ.07.18 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం, గర్భాదానం. కార్తీక మాసం 18.11.23 శనివారం.. శు. పంచమి, ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 ని.లకు వాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన 19.11.23 ఆదివారం.. శు. సప్తమి, శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 23.11.23 గురువారం.. శు. ఏకాదశి, ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, గర్భాదానం. 24.11.23 శుక్రవారం.. శు. త్రయోదశి, అశ్విని, మిథునలగ్నం, రా.8.41 ని.లకు వివాహం, గృహప్రవేశం. 29.11.23 బుధవారం.. బ. విదియ,మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 ని.లకు వివాహం, శంఖుస్థాపన. 01.12.23 శుక్రవారం.. బ. చవితి, పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 ని.లకు గృహారంభం. 02.12.23 శనివారం.. బ. పంచమి, పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు 03.12.23 ఆదివారం.. బ. సప్తమి, మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 ని.లకు గర్భాదానం, ప్రయాణం. 06.12.23 బుధవారం.. బ. నవమి, ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 ని.లకు వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. 07.12.23 గురువారం.. బ. దశమి, హస్త, మిథునలగ్నం, రా.7.45 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు 08.12.23 శుక్రవారం.. బ. ఏకాదశి, చిత్త, మిథునలగ్నం, రా.7.41 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. -సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023 -
కొత్త ఏడాది.. రెండో రోజు నుంచే శుభకార్యాలకు సెలవు.. ఎందుకంటే
సాక్షి, నిజామాబాద్: మరో రెండు రోజుల్లో శుభకార్యాలకు సెలవులు రానున్నాయి. వివాహ, గృహప్రవేశ తదితర శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు శుక్రవారంతో ముగియనున్నాయి. శని, ఆదివారాలు మార్గ బహుళ చతుర్దశి, అమావాస్యలు ఆ తర్వాత జనవరి 2 నుంచి శూన్యమాసం (పుష్యమాసం)ప్రారంభమవుతుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 3నుంచి ఆరంభమవుతాయి. జనవరి నెలలో వివాహాది శుభముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు తిరిగి మార్చి 19 నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 18 వరకు గురుమౌడ్యమి ఉంటుందని పంచాంగ కర్త కిషన్‌రావు జోషి తెలిపారు. అలాగే పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరం. దీంతో ఈ మాసంలో నవగ్రహ ఆరాధనలు, పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి.. చదువులతల్లి సరస్వతీమాత జన్మతిథి వసంతపంచమి పర్వదినాన్ని ఫిబ్రవరి 5న జరుపుకోనున్నారు. నాటి నుంచి వివాహ గృహప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభముహూర్తాలు ఆరంభమవుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చదవండి: Nizamabad: ఒక్కరాత్రే పదకొండు ఇళ్లలో చోరీ -
హర్ దిన్ శుభ్హై.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్
పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు.. పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులు ఏకమవుతున్నారు. ఇదేంటి మూఢాల్లో పెళ్లిళ్లు ఏంటి అనుకుంటున్నారా..? అదంతా గతం ఇప్పుడు హర్ దిన్ శుభ్ హై ట్రెండ్ కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మూఢాల్లోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తన చిన్న నాటి ఫ్రెండ్ నటాషా దలాల్‌ను ముంబైలోని అలీబాగ్‌లో పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వైవా హర్ష, అక్షరల ఎంగేజ్మెంట్ కూడా ఈ నెల 11న జరిగింది. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ముహూర్తాలు లేకున్నా మూఢాల్లోనూ లగ్గాలు పెట్టుకుంటున్నారు. తమకు అనుకూలమైన రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ప్రతిరోజూ మంచి రోజే.. ముహూర్తంతో పనేముందని చెబుతున్నారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించడం, ఆ తర్వాత లగ్గాలకు పర్మిషన్ ఇచ్చినా కొన్నే మంచి రోజులు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 8 నుంచి మూఢాలు ప్రారంభం కావడం, మే 13 వరకు ముహుర్తాలు లేవని పూజారులు చెబుతుండడంతో అప్పటి వరకు ఆలస్యమవుతుందని చాలామంది మూఢాల్లోనూ పెండ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. హర్‌దిన్‌శుభ్‌హై అంటే ప్రతిరోజూ మంచిరోజే..! ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో బాగా ట్రెండ్ అవుతున్న స్లోగన్ ఇది. దీని పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. ఈ క్యాంపెయిన్ చేస్తోంది వెడ్డింగ్ ప్లానర్లు. మన దేశంలో మ్యారేజీల సీజన్లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగలు, బట్టలు, ఫర్నీచర్ మొదలుకొని ఎన్నో కొనుగోళ్లు జరుగుతాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్ల వాళ్లు ఉపాధి పొందుతుంటారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫంక్షన్ హాళ్ల ఓనర్లు, క్యాటరింగ్, డీజే, బ్యాండ్, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రిషియన్లు.. ఇళా ఎన్నో రకాల వృత్తుల వాళ్లు పెళ్లిళ్ల సీజన్ పై ఆధారపడి బతుకుతారు. అయితే కరోనా కారణంగా గతేడాది లగ్గాల్లేక వీళ్లందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్‌లాక్‌లో వివాహాలకు పర్మిషన్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే మూఢాలు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్లు కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. హర్‌దిన్‌శుభ్‌హై కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. వివాహం చేసుకునేవాళ్లు, వాళ్ల తల్లిదండ్రులూ దీనికి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో మూఢాల్లోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ముహూర్తాలు ఉండే రోజులతో పోలిస్తే మూఢాల టైమ్‌లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య చాలా తక్కువే. అయితే ముహూర్తం కన్నా తమకు అనుకూలమైన సమయం ముఖ్యమని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మూఢాల్లో శుభకార్యాలు వద్దని చెబుతున్నా జనం వినడం లేదని కొందరు పూజారులూ చెబుతున్నారు. జనం ఆలోచనల్లో వచ్చిన మార్పే ఇందుకు కారణమంటున్నారు. -
శుభ గడియలు షురూ
సాక్షి, కర్నూలు: అధిక ఆశ్వయుజ మాసం శుక్రవారం ముగిసింది. నేటి (శనివారం) నుంచి నిజ ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతోంది. దసరా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్–19తో ఇన్నాళ్లూ కళ తప్పిన కల్యాణ వేదికల్లో మళ్లీ సందడి కన్పించనుంది. ఈ నెల 18వ తేదీ, 21 నుంచి 31వ తేదీ వరకు, నవంబర్ 4, 6, 7, 11వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇవి వివాహాలు చేసుకోవడానికి అనుకూలం. నవంబర్ 16న కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం వివాహాలకు తప్పా మిగతా శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల సమయాన జిల్లాలో శుభకార్యాలు చేయరు. కాగా..ఈసారి కోవిడ్–19 నిబంధనలు అనుసరించి శుభకార్యాలు, వేడుకలు చేసుకోవాల్సి ఉంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు, గృహాలు నిర్మించుకున్న వారు ఈ శుభ ముహూర్తాలను వినియోగించుకోవాలని పండితుడు పి.చంద్రశేఖర్ శర్మ సూచించారు. ఇవి తప్పితే వచ్చే ఏడాది మార్చి వరకు మంచి రోజుల కోసం ఎదురు చూడాల్సిందేనని అన్నారు. -
నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: హీరో
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన పెళ్లిపై వస్తున్న వదంతులపై స్పందించారు. కరోనా కారణంగా అతని పెళ్లి వాయిదా పడిందనే వార్తలను ఖండించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. నా పెళ్లిపై ఆందోళన అవసరం లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటాం అంటూ స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: రానా ‘అరణ్య’ విడుదల వాయిదా గత కొద్దికాలం ప్రేమలో ఉన్న డాక్టర్ పల్లవితో సినీ హీరో నిఖిల్ వివాహం గత నెల నిశ్చమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా భయాలు చోటుచేసుకోవడంపై నిఖిల్ స్పందిస్తూ.. 'ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్న నేపథ్యంలో ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే వచ్చేవారానికల్లా పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం' అని నిఖిల్ అన్నారు. చదవండి: ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్: నటుడు -
మీ ఆశీర్వాదం కావాలి
బాలీవుడ్ ప్రేమ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి తేదీ అదీ.. ఇదీ అంటూ ప్రతిరోజూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇక వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే దీపికా, రణ్వీర్ ఒక్కటయ్యే తేదీని ప్రకటించారు. ‘‘మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో మేం (దీపికా, రణ్వీర్) నవంబర్ 14, 15 తేదీల్లో వివాహం చేసుకోబోతున్నాం. మా మీద ప్రేమ కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితంలో ప్రేమ, స్నేహం, విధేయత, కలిసి ఉండటం.. ఇవన్నీ కలగలిసిన సరికొత్త మజిలీ మొదలు పెడుతున్నాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. ప్రేమతో దీపిక, రణ్వీర్’’ అంటూ వివాహ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు. కాగా, వీరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. -
శీతాకాలానా... సాగర తీరాన...
సముద్ర తీరం.. చుట్టూ విశాలమైన ప్రదేశంలో విల్లాలు. ఏంటి? రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరిపే ప్లేస్ గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? కాదు. కానే కాదు. ఇది దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ పెళ్లి చేసుకోబోయే ప్లేస్ గురించి. దీపికా పదుకోన్ మెడలో రణ్వీర్ మూడు ముళ్ళు ఎప్పుడు వేస్తారా? అని ఎదురు చూస్తున్న తేదీ నవంబర్ 10 అని ఆల్రెడీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి ఫారిన్లో జరుగుతుందనే వార్త వచ్చింది కానీ ప్లేస్ ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ పెళ్లి మండపం కూడా ఫిక్స్ అయిందట. ఇటలీలోని లేక్ కోమో దగ్గర ఈ జంట ఒక్కటి కాబోతున్నారట. ఆ మధ్య అనుష్కా శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇటలీలోనే వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. దీపికా, రణ్వీర్ వివాహానికి కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ మాత్రమే హాజరు కానున్నారట. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇరువురి కుటుంబ సభ్యులు. పెళ్లి తర్వాత ముంబైలో ఇండస్ట్రీ మిత్రులందరికీ పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న కరిష్మా?!
అలనాటి అందాల తార కరిష్మా కపూర్ (43) రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ కుమార్‌తో విడాకుల తరువాత కొంతకాంలగా అన్నింటికి దూరంగా ఉంటున్న కరిష్మా ఈ మధ్య ప్రముఖ వ్యాపారవేత్త సంతీప్ తోష్నివాల్‌తో సన్నిహితంగా ఉన్నట్లు బీ టౌన్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా.. కరిష్మాచ సందీప్‌లు బాంద్రాలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. అందులో ఎగేజ్మెంట్ రింగ్కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరిష్మా ప్రేమ, రెండో పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి రణధీర్ కపూర్ స్పందించారు. కరిష్మ రెండో పెళ్లి చేసుకుంటే.. తన ఆశీస్సులు ఉంటాయని రణధీర్ స్పష్టం చేశారు. కరిష్మా ఇంకా చిన్నపిల్లే.. పెళ్లి చేసుకుని ఆనందంగా గడిపే సమయం ఉంది.. గతాన్ని మర్చిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని ఆమె మొదలు పెట్టాలనుకుంటే.. నా కన్నా ఆనందించేవారు ఎవరుంటారు? అని రణధీర్ కపూర్ అన్నారు. -
పెళ్లిపీటలెక్కుతున్న హీరోయిన్ నమిత
సాక్షి, చెన్నై: మరో సినీజంట పెళ్లిపీటలెక్కబోతున్నారు. తాజాగా ప్రముఖ నటి నమిత పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరేంద్ర చౌదరి అలియాస్ వీరును ఈ నెల 24న వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ పెళ్లిపై వీరిద్దరూ స్పష్టతను ఇస్తూ అభిమానుల ఆశీర్వాదాలను కోరుతూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్లు సమాచారం. తిరుమలలో వీరిద్దరి వివాహం జరగనుంది. నమిత 2002లో ఆర్యన్ రాజేశ్ హీరోగా తెరకెక్కిన ‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో నటించింది. తెలుగులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో నమిత ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి సారించి, అక్కడ టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కాగా కొద్ది రోజుల క్రితం సీనియర్ నటుడు శరత్ బాబును నమిత వివాహమాడనుందనే వార్త కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. -
సల్మాన్ పెళ్లి డేట్ ఇదేనా?!
ఔను! బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్ పెళ్లికి ఒప్పేసుకున్నాడు. ఎంతోకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న రొమేనియన్ ప్రియురాలు లులియా వంటూర్ను ఆయన పెళ్లాడబోతున్నాడు. తన తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ఈ ఏడాది చివరినాటికి తన బ్రహ్మచర్యానికి నీళ్లు వదులబోతున్నాడు. ఇలా వస్తున్న కథనాల పరంపరలో తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లి తేదీ కూడా ఫిక్సయినట్టు వినిపిస్తోంది. డిసెంబర్ 27, 2016న ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడని తాజాగా ఓ బాలీవుడ్ వెబ్సైట్ వెల్లడించింది. డిసెంబర్ 27న సల్మాన్ 51వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అదే సందర్భంలోనే ఆయన పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించినట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సల్మాన్ పెళ్లి తేదీ వార్తలపై ఆయన గానీ, ఆయన కుటుంబంగానీ ఏమీ స్పందించలేదు. ఈ వార్తలను ధ్రువీకరించలేదు. మరోవైపు సల్మాన్-లులియా జంటగా కనిపిస్తున్న ఫొటోలు ఈ మధ్య దినపత్రికల్లో, వెబ్సైట్లలో బాగా హల్చల్ చేస్తున్నాయి. ప్రీతి జింటా వెడ్డింగ్ రిసెప్షన్‌కి ఈ ప్రేమజంట కలిసి వెళ్లి తొలిసారి పబ్లిక్కు కనిపించిన సంగతి తెలిసిందే. -
ఖతీజా-ముహమ్మద్ల పరిణయం
ఖతీజా కేవలం అందం, సిరిసంపదలు కలిగిన స్త్రీ మాత్రమే కాదు. ఎంతో వివేకం, విజ్ఞత, తెలివితేటలు, దూరదృష్టి గల మహిళామణి కూడా! అందుకే ఆమె సచ్ఛీలత, సత్యసంధత, నీతి, నిజాయితీల ప్రతిరూపమైన ముహమ్మద్ (స) గారిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. నఫీసా వెళ్లి అబూతాలిబ్తో మాట్లాడింది. ముహమ్మద్ (స) ఆ విషయాన్ని ధృవీకరించారు. అబూతాలిబ్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయారు. ‘అవును, నా ముహమ్మద్‌కు ఏం తక్కువ? ఇంతటి సత్యసంధుడు, సచ్ఛీలుడు, నిజాయితీపరుడు అరేబియా అంతా కాగడా పట్టి వెతికినా కనపడడు’ అనుకున్నారు అబూతాలిబ్. వెంటనే సోదరులను వెంటబెట్టుకుని ఖతీజా బాబాయి అమ్రూబిన్ అసద్, సోదరుడు అమ్రూబిన్ ఖువైలిద్లను కలుసుకుని, సంబంధం గురించి మాట్లాడారు. అసద్, ఖువైలిద్లిద్దరూ పరమ సంతోషంగా వెంటనే ఒప్పేసుకున్నారు. ఖతీజాతో చర్చించి వివాహ తేదీని నిశ్చయించుకున్నారు. చూస్తూ చూస్తూనే ఆ రోజు కూడా రానే వచ్చింది. ఇరుకుటుంబాల పెద్దలు, పిన్నలంతా ఖతీజా ఇంట సమావేశమయ్యారు. ముహమ్మద్ బాబాయి అబూతాలిబ్ నికాహ్ ప్రసంగం చేశారు. దైవాన్ని ప్రస్తుతించిన అనంతరం, అబూతాలిబ్ మాట్లాడుతూ, ‘ఇతను నా సోదరుడు అబ్దుల్లాహ్ కుమారుడు. పేరు ముహమ్మద్. ఖురైష్ వంశం మొత్తంలో ఇంతటి సుగుణ సంపన్నుడు మరొకరు లేరు. అతనివద్ద ధన సంపదలు లేకపోవచ్చు కానీ సుగుణ సంపదకు కొదవ లేదు. అయినా ధనసంపదలు శాశ్వతం కావు. సంపద తరిగే, పెరిగే నీడలాంటిది. ఈ రోజు ఉండవచ్చు. రేపు లేకపోవచ్చు. ఈ రోజు ఒకరి దగ్గరుంటే, రేపు మరొకరి దగ్గర ఉండవచ్చు. ముహమ్మద్ నాకు ప్రాణసమానం. ఈ విషయం మీకందరికీ తెలుసు. ముహమ్మద్, ఖువైలిద్ కూతురు ఖతీజాను వివాహమాడుతున్నాడు. ఈ శుభసందర్భంగా నేను నా ఆస్తిలో నుండి 20 ఒంటెల్ని మహర్‌గా నిర్ణయిస్తున్నాను. దైవసాక్షి! ఇతని భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోంది. దైవకృప, ఆయన కారుణ్యం తనవెంట ఉన్నాయి’ అంటూ వివాహ ప్రసంగం ముగించారు అబూతాలిబ్. ఈ విధంగా ఈ వివాహ శుభకార్యం ఆనందోత్సాహాలతో ముగిసింది. తాహిరా ఆమిన్ ఇంట కాలుమోపింది. అప్పుడు ముహమ్మద్ వయసు ఇరవై ఐదు సంవత్సరాల రెండునెలల పదిరోజులు. బీబీ ఖతీజా వయసు నలభై సంవత్సరాలు. ఖతీజా, ముహమ్మద్ గార్ల దాంపత్యజీవితం హాయిగా, ఆనందంగా గడిచిపోతోంది. ఒకరి సహచర్యం మరొకరికి శాంతిని, ప్రశాంతతను పంచిపెడుతోంది. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఖతీజా కేవలం అందం, సిరిసంపదలు కలిగిన స్త్రీ మాత్రమే కాదు. ఎంతో వివేకం, విజ్ఞత, తెలివితేటలు, దూరదృష్టి గల మహిళామణి కూడా! అందుకే ఆమె సచ్ఛీలత, సత్యసంధత, నీతి, నిజాయితీల ప్రతిరూపమైన ముహమ్మద్ (స) గారిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. ఒక ఆదర్శ ఇల్లాలుగా, ఉత్తమ భర్తగా వారిద్దరూ కూడా తమను తాము నిరూపించుకున్నారు. మూఢాచారాలు, మార్గభ్రష్టత్వంలో మునిగి ఉన్న సమాజాన్ని ఎలాగైనా సంస్కరించి, మంచి సమాజంగా, సౌశీల్యం ఉన్నత మానవీయ విలువలు ఉట్టిపడే సమాజంగా తీర్చిదిద్దాలన్నది ముహమ్మద్ (స) ఆలోచన. దీనికోసం ఆయన ఎంతగానో పరితపించేవారు. ఏకాంతంలో కూర్చొని ఆలోచించేవారు. దైవధ్యానంలో లీనమైపోయేవారు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
గెటింగ్ మ్యారీడ్!
‘రంగ్ దే బసంతి, మీనాక్షి’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటుడు కునాల్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. అమితాబ్‌బచ్చన్ మేనకోడలు నైనా బచ్చన్‌తో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ఫార్ములా 3 రేసర్, ట్రైన్డ్ పైలట్ కునాల్.. త్వరలోనే వెడ్డింగ్ డేట్ ప్రకటిస్తామన్నాడు. ‘ప్రస్తుతం షూటింగ్‌లు, రేస్‌లు, స్క్రిప్ట్ రైటింగ్ల వంటి పనులతో తీరిక లేకుండా ఉన్నా. నైనా పరిస్థితీ అదే. మా ఫ్యామిలీస్ చర్చించి పెళ్లి రోజుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాయి’ అంటూ చెప్పాడు ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు.