సల్మాన్ పెళ్లి డేట్‌ ఇదేనా?! | Salman Khan and Iulia Vantur Wedding Date | Sakshi
Sakshi News home page

సల్మాన్ పెళ్లి డేట్‌ ఇదేనా?!

Published Wed, May 18 2016 2:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

సల్మాన్ పెళ్లి డేట్‌ ఇదేనా?!

సల్మాన్ పెళ్లి డేట్‌ ఇదేనా?!

ఔను! బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్‌ పెళ్లికి ఒప్పేసుకున్నాడు. ఎంతోకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న రొమేనియన్‌ ప్రియురాలు లులియా వంటూర్‌ను ఆయన పెళ్లాడబోతున్నాడు. తన తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ఈ ఏడాది చివరినాటికి తన బ్రహ్మచర్యానికి  నీళ్లు వదులబోతున్నాడు. ఇలా వస్తున్న కథనాల పరంపరలో తాజాగా సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి తేదీ కూడా ఫిక్సయినట్టు వినిపిస్తోంది. డిసెంబర్ 27, 2016న ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడని తాజాగా ఓ బాలీవుడ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. డిసెంబర్‌ 27న సల్మాన్‌ 51వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అదే సందర్భంలోనే ఆయన పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించినట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

సల్మాన్ పెళ్లి తేదీ వార్తలపై ఆయన గానీ, ఆయన కుటుంబంగానీ ఏమీ స్పందించలేదు. ఈ వార్తలను ధ్రువీకరించలేదు. మరోవైపు సల్మాన్‌-లులియా జంటగా కనిపిస్తున్న ఫొటోలు ఈ మధ్య దినపత్రికల్లో, వెబ్‌సైట్లలో బాగా హల్‌చల్ చేస్తున్నాయి. ప్రీతి జింటా వెడ్డింగ్ రిసెప్షన్‌కి ఈ ప్రేమజంట కలిసి వెళ్లి తొలిసారి పబ్లిక్‌కు కనిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement