గెటింగ్ మ్యారీడ్!
‘రంగ్ దే బసంతి, మీనాక్షి’ వంటి సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటుడు కునాల్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. అమితాబ్‌బచ్చన్ మేనకోడలు నైనా బచ్చన్‌తో ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ ఫార్ములా 3 రేసర్, ట్రైన్డ్ పైలట్ కునాల్.. త్వరలోనే వెడ్డింగ్ డేట్ ప్రకటిస్తామన్నాడు.
‘ప్రస్తుతం షూటింగ్‌లు, రేస్‌లు, స్క్రిప్ట్ రైటింగ్‌ల వంటి పనులతో తీరిక లేకుండా ఉన్నా. నైనా పరిస్థితీ అదే. మా ఫ్యామిలీస్ చర్చించి పెళ్లి రోజుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాయి’ అంటూ చెప్పాడు ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు.