
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఎంపికయ్యారు. ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని టీపీఎల్ కార్యాలయానికి ఆయన గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా టీపీఎల్ సీఎండీ మన్నె గోవర్ధన్‌రెడ్డి అజహరుద్దీన్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలో ప్రారంభమయ్యే టీపీఎల్ రెండో ఎడిషన్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయన్నారు. మీడియా పార్ట్‌నర్లుగా ప్రముఖ చానళ్లు వ్యవహరిస్తున్నాయని, ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయన్నారు. టీపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అజహరుద్దీన్ అంగీకరించడం గర్వకారణమన్నారు.