ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్‌లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు.. పెదాలకు లిప్ కేర్‌లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్‌లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు.
కాబట్టే భారత్ కాస్మోటిక్ రంగం గణనీయంగా వృద్ది సాధిస్తోంది. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ నుండి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఫలితంగా కాస్మోటిక్ సంస్థలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్‌ల కోసం మహిళలు సగటున రూ.1,214 ఖర్చు చేయగా.. దాదాపు 40 శాతం కొనుగోళ్లు ఆన్‌లైన్‌లో జరిగాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.
ఈ తరుణంలో అంతర్జాతీయ కాస్మోటిక్ సంస్థలు భారతీయ మహిళల్ని ఆకట్టుకునేలా స్టార్ హీరోయిన్‌లను తమ బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి. ఇక జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2, భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించింది.
షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా నియాకం ఆశ్చర్యానికి గురి చేసిందన్న మిల్కిబ్యూటీ.. దాదాపూ 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమన్నా - షిసిడో మధ్య ఒప్పందం భారత్ ఎంటర్‌టైన్ మెంట్ పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు దోహదం చేస్తుందని షిసిడో యాజమాన్యం భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment