
స్కిల్ ఇండియా అంబాసిడర్‌గా ప్రియాంకాచోప్రా
నైపుణ్య భారతం (స్కిల్ ఇండియా) ప్రచారకర్తగా నటి ప్రియాంకా చోప్రా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: నైపుణ్య భారతం (స్కిల్ ఇండియా) ప్రచారకర్తగా నటి ప్రియాంకా చోప్రా నియమితులయ్యారు. ఆమె ఈ కార్యక్రమానికి ఉచితంగా ప్రచారం చేయనున్నారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్ డీసీ) సీఈవో మనీశ్ కుమార్ మాట్లాడుతూ ‘ప్రచారకర్తగా ఉంటాననీ ప్రియాంకా చో ప్రానే కోరారు. అందుకు మేం ఒప్పు కుంటూ ఆమెకు ఓ లేఖ అందజేశాం’ అని చెప్పారు.