Skill India
-
అనుభవానికే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ నియామకాల్లో ఐటీ ఉద్యోగం సంపాదించాలనేది దాదాపు అందరు విద్యార్థుల కోరిక. కానీ 2025లో క్యాంపస్ నియామకాలు అరకొరగానే ఉంటాయని స్కిల్ ఇండియా రిపోర్ట్–2025 అంచనా వేసింది. ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఐటీ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. సంస్థలు గతంలో కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుని, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఈ రిపోర్ట్స్పష్టం చేసింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగంవైపు కంపెనీలు మొగ్గుచూపటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లకే ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. 2025లో 33 శాతం కంపెనీలు ఏఐ టెక్నాలజీపై పట్టున్న నిపుణులనే ఉద్యోగాల్లోకి తీసుకొంటాయని అంచనా వేశారు. ఐటీ రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి మంచి అవకాశాలుంటాయని నివేదికలో పేర్కొన్నారు.ఫ్రెషర్స్‌లో నైపుణ్యం కొరతకొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులను ఏ ప్రశ్న వేసినా.. చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తున్నారని ప్రధాన కంపెనీలు పేర్కొంటున్నాయి. స్వతహాగా ఆలోచించే శక్తి వారిలో కన్పించడం లేదని అంటున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య, పలు యూనివర్సిటీలు, ప్రముఖ ఐటీ కంపెనీలు కలిసి నూతన ఇంజనీరింగ్ పట్టభద్రుల నైపుణ్యాలను పరీక్షించాయి. 86 శాతం విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం అవసరాలకు తగ్గట్టుగా లేదని గుర్తించాయి. 2025లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు 14 శాతానికి మించి ఉండకపోవచ్చని అంచనా వేశాయి. ఇంజనీరింగ్ సిలబస్‌లో ప్రస్తుత తరానికి పనికివచ్చే అంశాలు ఉండటం లేదని నిపుణులు గుర్తించారు. వీరికన్నా ఏఐ టెక్నాలజీ పది రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుందని పలు సంస్థలు అంటున్నాయి. అయితే, ఐటీ సంస్థల్లో ఫ్రెషర్స్‌కు అవకాశం వస్తే మాత్రం.. వారికి వేతనాలు భారీగానే ఉండొచ్చని నివేదిక వెల్లడించింది. మెరుగు పెట్టేందుకు మండలి కృషిప్రాంగణ నియామకాలు తగ్గిపోయే పరిస్థితి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నైపుణ్య కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వారి స్కిల్స్‌ను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. జేఎన్టీయూహెచ్ ఇన్చార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ముందుగా ఆ వర్సిటీ నుంచే ఈ ప్రయోగం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉండటంతో ఇందుకు సంబంధించిన కొత్త కోర్సులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. -
దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు
సాక్షి, అమరావతి: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరక్షరాస్యులతో పాటు విద్యావంతుల్లో కూడా నిరుద్యోగ రేటు తగ్గిందని తెలిపింది. 2021–22లో దేశంలో నిరుద్యోగ రేటు 4.1 శాతం ఉండగా 2022 – 23లో 3.2 శాతానికి తగ్గిందని తెలిపింది. నైపుణ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రారంభించిందని, మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలపై దేశంలోని యువతకు రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను, ఉత్పాదకతను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, జన శిక్షణ సంస్ధాన్, నేషనల్ అప్రెంటిస్íÙప్ ప్రమోషన్ స్కీమ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా అన్ని విద్యా సంస్థల్లో విద్యతో పాటు వృత్తి విద్యా కార్యక్రమాలను ప్రారంభించినట్లు పేర్కొంది. యువతకు స్వయం ఉపాధిని మరింత సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ప్రారంభించినట్లు తెలిపింది. దీని కింద స్వయం ఉపాధికి పూచీ కత్తు లేకుండా ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం మంజూరు చేయించడం ద్వారా సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్ధలను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. పీఎంఎంవై కింద గత ఏడాది నవంబర్ నాటికి 44.41 కోట్ల ఖాతాలకు రుణాలు మంజూరు చేసినట్లు వివరించింది. వీధి వ్యాపారుల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపింది. -
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మోడల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో ప్రతిబింబించాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ లైబ్రరీలు, పీఎం శ్రీ స్కూళ్ల ఏర్పాటుసహా మరికొన్ని కార్యక్రమాలకు రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిగా మారాయి. ‘టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్రం ఈ బడ్జెట్లో పొందుç³రిచింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అకడమిక్ ఎక్సలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంపై సమష్టిగా దృష్టి సారిస్తాయి. అయితే, రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు ద్వారా ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాష్ట్ర వర్సిటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం వంటి సంస్థలన్నీ కలిపి పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్లేలా దీన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధికి చర్యలు ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసి యువతకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంతకుముందే దృష్టి సారించింది. దీంతోపాటు ఉన్నత విద్యామండలి ద్వారా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను ఏర్పాటు చేయించి విద్యార్థులకు పలు సబ్జెక్టు అంశాలను అందుబాటులోకి తెచ్చింది. కాగా, నైపుణ్యాభివృద్ధి కోసం ‘స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ల’ ఏర్పాటుకు కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఏర్పాట్లు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు చదువులు పూర్తయ్యే నాటికే పూర్తి నైపుణ్యాలు కలిగి ఉండేలా తీర్చిదిద్దడంతో పాటు బయటకు వచ్చిన తరువాత కూడా అప్‌స్కిల్లింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 స్కిల్ హబ్‌లు, 26 స్కిల్ కాలేజీలు, రెండు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయిస్తోంది. నాడు–నేడు తరహాలో.. దేశంలో కొత్తగా భారతీయ భాషా యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. స్థానిక భాషల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తోంది. కాగా, పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం జాతీయ స్థాయిలో 14,500 స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో నాడు–నేడు పథకం కింద అన్ని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా రూ.16 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. -
National Apprenticeship Mela 2023: 9న పీఎం అప్రెంటిస్‌షిప్ మేళా
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా యువతకు కెరీర్ అవకాశాలను పెంపొందించేందుకు ఈ నెల 9న దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకొనేందుకు అవకాశాలు ఇవ్వనున్నాయి. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాను తెలంగాణలోని 6 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అభ్యర్థులు తమ పేర్లను apprenticeshipindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తమకు దగ్గరగా ఎక్కడ మేళా నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి.. 5వ నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొనవచ్చు. ఏమేమీ కావాలి.. రెజ్యూమ్ మూడు కాపీలు మార్క్షీట్లు, సర్టిఫికెట్ మూడు కాపీలు ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్) మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఎక్కడెక్కడంటే... తెలంగాణలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ (భద్రాద్రి కొత్తగూడెం), ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ(హైదరాబాద్), భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ(జయశంకర్ భూపాలపల్లి), పెద్దపల్లి ప్రభు త్వ ఐటీఐ(పెద్దపల్లి), అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ(రంగారెడ్డి), భువనగిరి ప్రభుత్వ ఐటీఐ(యాదాద్రి భువనగిరి)ల్లో మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రభుత్వ ఐటీఐ(బీ) (అనంతపురం), కాకినాడ ప్రభుత్వ ఐటీఐ (కాకినాడ), విజయవాడ ప్రభుత్వ ఐటీఐ(ఎన్టీఆర్ కృష్ణా), మాచర్ల ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐ (పల్నాడు), ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ(బీ) (ప్రకాశం), ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ(శ్రీకాకుళం), తిరుపతి ప్రభుత్వ ఐటీఐ(తిరుపతి), విశాఖపట్టణం ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) (విశాఖపట్టణం), కడప ప్రభుత్వ ఐటీఐ (వైఎస్సార్ కడప)ల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. (క్లిక్ చేయండి: విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు) -
స్కిల్ హబ్, కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు
సాక్షి, మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో స్కిల్ కాలేజీలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్కిల్ హబ్‌ల ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని సమావేశ మందిరంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు చెందిన 150 మంది ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ స్థాపనలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ హబ్‌లు, కాలేజీలు ఆ నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ లేదా, ఐటీఐ, లేదా డిగ్రీ కాలేజీల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ కాలేజీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వెంటనే ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు రావాలన్నారు. అందుకు అనుగుణంగా కోర్సుల ప్రారంభానికి ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. యువతీయువకులకు ఉద్యోగావకాశాలు రాష్ట్రంలోని యువతీయువకులందరూ ఉపాధి అవకాశాలు పొందే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు భాస్కర్ చెప్పారు. ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లోని పాలిటెక్నిక్, ఐటీఐ, కాలేజీల ప్రిన్సిపాల్స్, టీపీవోలు, నోడల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో ఆయన విడివిడిగా శనివారం సమావేశమయ్యారు. ముందుగా ఆయన పలు ప్రరిశ్రమలకు చెందిన వివిధ హోదాల్లోని 30 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో ఆయన విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీకి పనికొచ్చే నైపుణ్యాభివృద్ధి కోర్సుల ఏర్పాటు విషయమై ఆయన చర్చించారు. ప్రతి కోర్సు పరిశ్రమతో అనుబంధంగా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంటు కోర్సు నేర్చుకున్న ప్రతి విద్యార్థికి ఆ పరశ్రమలే ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. జూలై 1వ తేదీ నాటికి స్కిల్ హబ్‌లు, స్కిల్ కాలేజీలు ప్రారంభమవుతాయని డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. పలువురు పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారు. తమ పరిశ్రమల్లో ఉన్న శిక్షణ కేంద్రానికి శిక్షణనిచ్చే ఫ్యాకల్టీ కావాలని, మరికొందరు తమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే తామే శిక్షణనిస్తామన్నారు. కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ స్కిల్ కాలేజీల్లో అవసరమైన ల్యాబ్‌లు పెట్టి తాము శిక్షణనిస్తామని ఇందుకు అవసరమైన స్థలం ఇవ్వాలని కోరారు. దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని భాస్కర్ అన్నారు. కార్యక్రమంలో ఎపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీ రామకోటిరెడ్డి, కార్పొరేట్ కనెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.సత్యప్రభ ప్రసంగించారు. కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి, భీమిలి, నర్శీపట్నం, అనకాపల్లి ఆముదాలవలస, పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్ మురళీకృష్ణ, జీవీ రామచంద్రరావు, కె.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాస్, డాక్టర్ ఎన్.చంద్రశేఖర్, ఏపీఎస్ఎస్డీసీ వైజాగ్ నోడల్ ఆఫీసర్ సాయికుమార్ పాల్గొన్నారు. (చదవండి: సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు) -
డిజిటల్ స్కిల్ పై వాట్సాప్ ఇండియా శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు డిజిటల్ టెక్నాలజీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్ ఇండియా ముందుకువచ్చింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా డిజిటల్ స్కిల్ అకాడమీ శిక్షణ కార్యక్రమాన్ని వాట్సాప్ ఇండియా చేపట్టింది. కొత్తగా అందుబాటులోకి వస్తోన్న డేటా గోప్యత, సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత వంటి వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఇన్ఫీ పార్క్‌కు వాట్సాప్ ఇండియా అప్పగించింది. బుధవారం వర్చువల్‌గా ఈ డిజిటల్ అకాడమీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ప్రారంభించారు. చల్లా మధుసూధన రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కోర్సులో చేరడానికి 15,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరికి 10వ తేదీ నుంచి పది రోజులు పాటు శిక్షణ ఇచ్చి ఆన్లైన్ పరీక్ష ద్వారా వాట్సాప్ స్కిల్స్ స్టార్ కార్యక్రమానికి విద్యార్థులను ఎంపిక చేస్తారని చెప్పారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు వివిధ డిజిటల్ టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్ ఇస్తారన్నారు. వీరు శిక్షణ తీసుకున్న రంగాల్లో ఉద్యోగం పొందడానికి వాట్సాప్ ఇండియా సహకారం అందిస్తుందని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అనేక వినూత్నమైన శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వాట్సాప్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొండూరు అజయ్ రెడ్డి కోరారు. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం... విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి నైపుణ్యం కలిగించే విధంగా పలు అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కింద 40 సాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.30.79 కోట్లు వ్యయం చేస్తోంది. -
స్కిల్ ఇండియా కావాలంటే...!
‘‘నైపుణ్యంతో కూడిన శక్తితో వ్యక్తులు, సమూహాలు, దేశాలు ప్రగతి పథంలో సుసంపన్నమైన భవిష్యత్తువైపు మరింత ముందుకెళతాయని విశ్వసిస్తున్నాం’’ అని ఐక్యరాజ్య సమితి 2014, నవంబర్‌లో ప్రకటించింది. ఆ సమయంలో జరిగిన జనరల్ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీని ‘ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం’గా జరపాలని కూడా తీర్మానించింది. నిరుద్యోగాన్ని, ఉపాధి సమస్యలను అధిగ మించి, సామాజిక, ఆర్థిక అభివృద్ధి వైపు యువత అడుగులు వేయ డానికి, నైపుణ్య శిక్షణ చాలా అవసరమని గుర్తించారు. అప్పటి నుంచి ప్రతియేటా ఐక్యరాజ్య సమితితో పాటు సభ్య దేశాలన్నీ ఈ రోజుని ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆశించిన విధంగా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోని యువతరం ఈ నాటికే నైపుణ్యానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఇటీవల ‘ఐక్యరాజ్య సమితి బాలలనిధి’ (యూనిసెఫ్), గ్లోబల్ బిజినెస్ కో ఎవల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ (జీబీసీఈ) సంస్థలు సంయుక్తంగా దక్షిణాసియా దేశాల్లో నిర్వహించిన సర్వేలో కొన్ని నిరా శాజనకమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. రాబోయే పదిసంవత్స రాల్లో అంటే 2030 నాటికి భారతదేశంలోని యాభైశాతం యువత ఉద్యోగాలకు సరిపోయే విద్య, నైపుణ్యాలను అందుకోలేరని ఆ సర్వే తేల్చి చెప్పింది. అంటే వీరంతా పరిస్థితులకు అనుగుణమైన నైపు ణ్యాన్ని అందుకోలేక ఉద్యోగాలకు దూరమవుతారన్నమాట. వీరెవరికీ 21వ శతాబ్ది ఉద్యోగరంగంలో కావాల్సిన నైపుణ్యాలు లేవు. 2040 నాటికి దక్షిణాసియా నుంచి 180 కోట్ల మంది పాతికేళ్ళు నిండని యువత కార్మిక రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ సంఖ్యలో తొంబై శాతానికి పైగా మన దేశానికి చెందిన యువ తరమే ఉండనున్నారన్నది ఒక వాస్తవం. అయితే రోజు రోజుకీ పెరిగే శాస్త్ర, సాంకేతిక ప్రగతి కార్మికులు, ఉద్యోగులు, ఇతర వృత్తి వర్గాల నుంచి ఎంతో నైపుణ్యాన్ని ఆశిస్తున్నది. గతంలో లాగా శారీరక శ్రమ ద్వారా జరిగే ఉత్పత్తి, నిర్మాణ, ఇతర అంశాలేవీ భవిష్యత్‌లో కనిపిం చవు. ఇప్పటికీ మన దేశంలో నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు చాలా తక్కువ. వృత్తి విద్య లాంటి ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన యువతీ యువకుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇక సాధారణ డిగ్రీలు పొందిన వాళ్ళలో ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే ఉద్యోగ అర్హత కలిగి ఉన్నారు. మనకు సమీ పంలో ఉన్న చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతీయువకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ దేశాల్లో తొంభైశాతం వరకు నిపుణులైన కార్మికులు, ఉద్యోగులున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అది మన దేశంలో చాలా తక్కువ. అందువల్లనే ఈ దేశాలు వస్తూత్పత్తి, ఆటోమొబైల్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాయి. జపాన్ సాంకేతిక విజ్ఞానంతో తయారైన కార్లు మన దేశంలోని మార్కెట్లో అత్యధిక భాగాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఎలక్ట్రిక్, ఎల క్ట్రానిక్ వస్తువులు అందరి ఇళ్ళలోనూ, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చేతుల్లో దర్శనమిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా, ఇక ఎంతమాత్రం పాత తరహాలో ఆర్థిక రంగం మనుగడ సాగించలేని స్థితి వచ్చింది. ఇంతకుముందు పేర్కొన్న జీబీసీఈ సంస్థ మరొక అధ్యయన నివేదికను రూపొందించింది. ‘ప్రిపేరింగ్ టుమారోస్ వర్క్ ఫోర్స్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివ ల్యూషన్’ పేరుతో రూపొందిన ఈ నివేదిక ఇప్పటికి మూడు పారి శ్రామిక విప్లవాలు వచ్చాయనీ, నాల్గవ పారిశ్రామిక విప్లవంలోకి అడుగుపెట్టామనీ ప్రకటించింది. అంటే గత మూడు పారిశ్రామిక విప్లవాలలో ఉన్న నైపుణ్యాలన్నీ మార్పు చెందుతాయని, అందుకు అనుగుణంగా ప్రస్తుత యువత మారాలని ఆ నివేదిక స్పష్టం చేసింది. మొదటి పారిశ్రామిక విప్లవంలో యాంత్రీకరణ, ఆవిరి యంత్రాల ప్రభావం, రెండవ పారిశ్రామిక విప్లవంలో భారీ లాభాల రూపకల్పన అంచనాలను తలదన్నే ఉత్పత్తి, మూడవ పారిశ్రామిక విప్లవంలో ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక శక్తి, సమాచార రంగంలో వచ్చిన పెనుమార్పులున్నాయని ఆ నివేదిక తెలియజేసింది. అయితే, నాలుగవ పారిశ్రామిక విప్లవంలో వాటన్నింటినీ జీర్ణించుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధో పరిజ్ఞానం, డిజిటలైజే షన్, ఆటోమేషన్ నైపుణ్యాలు ప్రధాన పాత్ర వహించబోతున్నాయి. దానికిఅనుగుణంగానే అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగ, వృత్తి, స్వభావాలే మారిపోతున్నాయి. ఇటీవల చాలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్తులో మనుగడ సాగించే వృత్తులు, విద్యా కోర్సులు ఏవి ఉండ బోతున్నాయనే విషయాన్ని అంచనా వేశారు. ఇంటర్నెట్, కంప్యూటర్ రంగంలో దాదాపు 20 వృత్తులను గుర్తిం చారు. అందులో క్లౌడ్ కంప్యూటరింగ్, యుఎక్స్ డిజైన్ డిజిటల్ జర్న లిజం లాంటి వాటికి భవిష్యత్తు ఉండనున్నట్టు వెల్లడయ్యింది. వ్యవ సాయ రంగంలోనూ, వ్యవసాయ పరిశోధన, ఫీల్డ్ ఆఫీసర్, బయో కెమిస్ట్, క్రాప్ సైన్స్ మేనేజర్, అగ్రికల్చరల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు డిమాండ్ ఉండబోతున్నది. అట్లాగే హెల్త్ కేర్‌లో నర్స్‌లకు, ఫిజికల్ థెరఫిస్ట్లకు, రెస్పిరేటరీ థెరపిస్ట్, మసాజ్ థెరపిస్ట్, డాక్టర్ లేని సమ యంలో చూసే మెడికల్ అసిస్టెంట్లకు అవకాశాలు ఉండబోతు న్నాయి. ఉత్పత్తి రంగంలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ఎక్కువగా ఆటో మేషన్ వైపు వస్తూత్పత్తి రంగం ప్రయాణించే అవకా శాలు మెండుగా ఉన్నాయి. అయితే కొన్ని ఉద్యోగాలు మనకు భవి ష్యత్తులో కనుమరుగయ్యే అవకాశాలూ కోకొల్లలు. అందులో మొదట వచ్చేది డ్రైవర్లు, కొరియర్, క్లర్క్‌లు, పైలట్స్, లైబ్రేరియన్లు ఇంకా కొన్ని మాయమైపోవడం స్పష్టమౌతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు, విద్యా నిర్ణే తలు, ఆర్థిక నిపుణులు, రాజకీయ నాయకులు దేశ భవిష్యత్ కోసం యువతను నైపుణ్యం వైపు నడిపించడానికి సిద్ధం కావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఒక తంతులాగా సాగుతున్నది. అందులో సాధించిన ఫలితాలు పాక్షికమే. అందుకే దీనిని పూర్తిగా సమీక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ప్రముఖ ఆర్థిక వేత్త.సి.రంగరాజన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ‘నైపుణ్య శిక్షణ పాఠశాలలకు, కళాశాలలకు బయట జరగాల్సిందే. కానీ అది సరి పోదు. అది చేయిదాటిపోయినా దానిని సరిచేసుకోవడమే కానీ నిజంగా మన దేశం స్కిల్ ఇండియా కావాలంటే, నైపుణ్య శిక్షణ చదు వులో భాగం కావాలి. పాఠ్యాంశాలలోనే, అంటే పాఠశాల, కళాశాల చదువులోనే నైపుణ్య శిక్షణను భాగం చేయాలి’ అని సూచించారు. చదువు ముగిసిన తర్వాత యువతీయువకులకు ఉద్యోగం కావాలని, స్థిరపడాలన్న తపన ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ ఒక శిక్షణ నేర్చుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస తగ్గిపోతుంది. ఇది పాలకులకు అర్థం కావాలి. దాదాపు ఇరవై కోట్ల మంది డిగ్రీలు పుచ్చుకొని నడి వీధుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి. కానీ తగిన నైపుణ్యం వారికి లేదు. దేశంలో వనరులున్నాయి. వాటిని అభివృద్ధి చేసుకునే నైపుణ్యం లేదు. ఇది వైరుధ్యం. దీనిని పరిష్కారం చేయ కుంటే, ఇంతకుముందు నాలుగవ పారిశ్రామిక విప్లవం స్థానంలో, ఎవ్వరూ ఊహించని అసంతృప్తి సెగలు యావత్ సమా జాన్ని చుట్టు ముట్టడం ఖాయం. ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాది మంది తిండీ తిప్పలు లేకుండా మనుగడే ప్రశ్నార్థకంగా మారే స్థితి వస్తే, ఆ పరిస్థి తులు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 (నేడు ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం) -
ఉపాధికి నైపుణ్య మంత్రం
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య స్థితిగతులు, మార్కెట్ రంగంలో అనూహ్య మార్పులు చేసుకుంటున్న వేళ నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇతరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని యువతకు పిలుపునిచ్చారు. వరల్డ్ యూత్ స్కిల్ డేని పురస్కరించుకొని మోదీ బుధవారం యువతకు వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. అయిదేళ్ల క్రితం ఇదే రోజున స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మిషన్ ద్వారా గత అయిదేళ్లలో 5 కోట్ల మందికి పైగా వివిధ రంగాల్లో తమ నైపుణ్యాల్ని మెరుగుపరచుకున్నారన్నారు. తద్వారా యువతకి స్థానికంగా, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. కరోనాతో మారిన ప్రపంచం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచంలో త్వరితగతిన మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో నిపుణులైన యువతకి చాలా ప్రాధాన్యముంటుందని మోదీ చెప్పారు. కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపాలు పూర్తిగా మారిపోయాయని, పనిచేసే పరిస్థితుల్లో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీ కూడా దీనిపై ప్రభావం చూపిస్తోందన్నారు. కొత్త తరహా ఉద్యోగాలు, కొత్త తరహా పనితీరుతో మన దేశంలో యువత కొత్త నైపుణ్యాలను పెంచుకుంటోందని ప్రధాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానాలు, మార్కెట్ పరిస్థితుల్లో త్వరితగతిన వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఎలా మారాలన్న ప్రశ్నలు ఎక్కువమంది తనను అడుగుతున్నారని, దానికి తన దగ్గరున్న ఒకే ఒక్క సమాధానం ‘స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్’ అని చెప్పారు. నైపుణ్యం, దానిని మెరుగుపరచుకోవడం, ఇతరులకు నైపుణ్యాన్ని నేర్పించడమే యువతకు ఉపాధి కల్పించే మంత్రమని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘నైపుణ్యం వంటిది మరోటి లేదు. అది మిమ్మల్ని విభిన్నంగా తీర్చిదిద్దుతుంది. నైపుణ్యం ఒక జ్ఞాన సంపద వంటిది. దానిని మీ నుంచి ఎవరూ తీసుకువెళ్లలేరు. నైపుణ్యం స్వయంసమృద్ధి వంటిది. దాని వల్ల మీ కాళ్ల మీద మీరు నిలబడడమే కాదు, మీరే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు’’అని నైపుణ్యం ప్రాధాన్యతను వివరించారు. నిపుణులైన కార్మికుల్ని గుర్తించడానికి ఇటీవల ఒక పోర్టల్ ప్రారంభించామని, తిరిగి గ్రామాలకు వెళ్లిన వలస కార్మికులకు ఉపాధినివ్వడంలో దీనిని వినియోగించుకోవాలన్నారు. చర్చల ద్వారా వాణిజ్య వివాదాలు పరిష్కారం భారత్, ఈయూ సదస్సులో నిర్ణయం స్వేచ్ఛాయుత వాణిజ్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయి చర్చలు జరపాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. రక్షణ, అణు ఇంధనశక్తి, ఆరోగ్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా సంబంధా లను బలోపేతం చేయాలని, దానికి పంచవర్ష ప్రణాళికను రూపొందించాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. బుధవారం జరిగిన 15వ ఈయూ– ఇండియా సదస్సు వీడియో సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈయూలో ఉన్న 27 దేశాలతో సత్సంబంధాల ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
స్కిల్ ఇండియా వార్షికోత్సవం
-
పరిశోధనలకు పదును పెట్టండి
కాజీపేట అర్బన్: దేశాభివృద్ధికి, మానవాళి మనుగడకు తోడ్పడేందుకు నూతన ఆవిష్కరణలను అందిస్తూ ఇన్నోవేషన్ హబ్‌గా నిట్ వరంగల్ మారాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విద్యార్థులు ఆవిష్కరణలకు, పరిశోధనలకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెం టర్ ఆడిటోరియంలో సోమవారం నిట్ వ జ్రోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వజ్రోత్సవాల శిలాఫలకాన్ని, రూ.25 కోట్లతో పూర్వ విద్యార్థులు నిర్మించనున్న అల్యూ మ్ని కన్వెన్షన్ సెంటర్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆలోచనల ప్రతిరూపమే నిట్ అని, ప్రస్తుతం నిట్ వజ్రోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణలో తనకు నచ్చిన ఏకైక జిల్లా వరంగల్ జిల్లా అని.. నాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ సిటీ వరంగల్‌ను, ఏపీలో అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రకృతి సంపదను, కాకతీయుల వారసత్వాన్ని కాపాడుకుంటూ చరిత్రాత్మక చరిత్రగల ఓరుగుల్లును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. అత్యాధునిక ల్యాబ్‌లతో, నిష్ణాతులైన అధ్యాపకులతో సాంకేతిక విద్యకు కేం ద్రంగా నిలుస్తూ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కళా శాలగా నిట్ వరంగల్ పేరుగాంచిందని ఆయన కొనియాడారు. పూర్వ విద్యార్థులు రూ.25 కోట్ల తో అల్యూమ్ని కన్వెన్షన్ సెంటర్‌ను అందించడం అభినందనీయమన్నారు. యువతకు ఉపాధినందించేందుకు స్కిల్ ఇండియా ఇంటికో ఉద్యోగమిస్తామనడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని.. కొందరు హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోవని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇందు కోసం ప్రధాని మోదీ యువతకు ఉపాధినందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించి నిరుద్యోగులుగా మిగిలిపోకుండా స్వయం ఉపాధితో రాణించేందుకు స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా లు తోడ్పడుతున్నాయని ఆయన వివరించారు. యువత ఎల్పీజీకి సిద్ధంగా ఉండాలి నేటి ఆధునిక యుగంలో గ్రామాలను వీడి ప్రజ లు ఉపాధి కోసం నగర బాట పడుతున్నా రని వెంకయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధికి పోటీ పెరుగుతోందన్నారు. 2025లో ఎల్పీజీ (లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) యు వత ఉపాధికి పోటీగా మారనుందన్నారు. ఎల్పీజీకి దీటుగా నిలిచేందుకు నూతన ఆవిష్కరణ లు, పరిశోధనలతో ముందుకు సాగాలన్నారు. చరిత్రాత్మక సందేశాన్ని అందించే బతుకమ్మ మానవ జీవితం ప్రకృతి ఒడిలో మమేకమైన చరిత్రాత్మక సందేశాన్ని బతుకమ్మ పండుగ అందిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రకృతిలో పువ్వులను ఒక రూపంగా మార్చి పూజించడం భారతీయ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. తెలంగాణ పండుగలు జాతీయ సమైక్యతను తెలియపరుస్తుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నిట్ రిజిస్ట్రార్ గోవర్దన్ అధ్యక్షత వహించారు. -
స్కిల్ ఇండియా అంబాసిడర్‌గా ప్రియాంకాచోప్రా
న్యూఢిల్లీ: నైపుణ్య భారతం (స్కిల్ ఇండియా) ప్రచారకర్తగా నటి ప్రియాంకా చోప్రా నియమితులయ్యారు. ఆమె ఈ కార్యక్రమానికి ఉచితంగా ప్రచారం చేయనున్నారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ డీసీ) సీఈవో మనీశ్ కుమార్ మాట్లాడుతూ ‘ప్రచారకర్తగా ఉంటాననీ ప్రియాంకా చో ప్రానే కోరారు. అందుకు మేం ఒప్పు కుంటూ ఆమెకు ఓ లేఖ అందజేశాం’ అని చెప్పారు. -
యువత ఉపాధికే ‘స్కిల్ ఇండియా’
నెహ్రూ యువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు చంద్రశేఖరరావు శ్రీరాంనగర్‌లో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం మొయినాబాద్: యువతకు ఉపాధి కల్పించడం కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్కిల్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నెహ్రూ యువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖరరావు అన్నారు. మండల పరిధిలోని శ్రీరాంనగర్‌లో గ్రామ పంచాయతీ పాలకవర్గం మూడో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సన్వెల్లి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత అన్నిరంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. యువతలో వృత్తి నైపుణ్యం పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అనేక రకాల పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తుందన్నారు. యువత క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ఎన్నో నిధులు ఖర్చు పెడుతుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, మాజీ అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ మహిపాల్, మాజీ సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భూ బిల్లుపై తొలగని ప్రతిష్టంభన
నీతి ఆయోగ్ భేటీకి డజనుకు పైగా సీఎంల గైర్హాజరు * ముందే బహిష్కరించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు * భేటీలో బిల్లును వ్యతిరేకించిన బీజేపీయేతర పార్టీల సీఎంలు * బిల్లును అడ్డుకోవడం రైతుల ప్రగతిని అడ్డుకోవడమేనన్న ప్రధాని న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లును గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఒకవైపు, ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, మరోవైపు విపక్ష పార్టీలు ఐక్యంగా దీన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకోవడంతో దీనిపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం భూ సేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ పాలక మండలి రెండో సమావేశంలోనూ ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దాదాపు డజనుకు పైగా ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించగా.. హాజరైన బీజేపీయేతర సీఎంలు సైతం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్(పంజాబ్) కూడా రైతుల అనుమతి లేకుండా భూ సేకరణ చేయరాదని తేల్చి చెప్పడం విశేషం. మరోవైపు, భూ బిల్లుపై ఏర్పడిన ప్రతిష్టంభన గ్రామీణాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష సీఎంల గైర్హాజరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు తొమ్మిది మందితో పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), తమిళనాడు సీఎం జయలలిత(ఏఐఏడీఎంకే), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(బీజేడీ), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ)ఈ భేటీకి హాజరుకాలేదు. బిల్లుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను సైతం వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. భేటీకి హాజరైన 16 మంది ముఖ్యమంత్రుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు నితీశ్ కుమార్(బిహార్-జేడీయూ), అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ-ఆప్), ముఫ్తీ మొహమ్మద్ సయీద్(జమ్మూకశ్మీర్- పీడీపీ), మాణిక్ సర్కార్(త్రిపుర-సీపీఎం)లు ఉన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(ఆంధ్రప్రదేశ్), తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా గైర్హాజరయ్యారు. అభివృద్ధిని అడ్డుకోవద్దు నీతి ఆయోగ్ భేటీలో మాట్లాడుతూ.. భూ బిల్లుపై ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన గ్రామీణాభివృద్ధిపై ముఖ్యంగా.. ఆసుపత్రులు, పాఠశాలల ఏర్పాటు, రహదారులు, జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం.. తదతరాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్రాలు, కేంద్రం కలసికట్టుగా కృషి చేయాలన్నారు. రాజకీయ కారణాలతో గ్రామీణాభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. పార్లమెంటు సమావేశాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి భూ బిల్లుపై రాష్ట్రాల సూచనలు స్వీకరించాలనుకుంటున్నామంటూ విపక్షాలకు శాంతి సందేశం పంపించారు. ఏకాభిప్రాయంతోనే 2013 చట్టం.. 2013 భూ సేకరణ చట్టం కూడా పార్టీల ఏకాభిప్రాయంతోనే ఏర్పడినందున ఇప్పటికిప్పుడు ఆ చట్టానికి సవరణలు అవసరం లేదని భేటీలో నితీశ్ కుమార్ అభిప్రాయపడగా, 2013 చట్టానికి మరికాస్త సమయం ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారని జైట్లీ వెల్లడించారు. భూ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత స్పష్టం చేశారు. ఆల్రెడీ మాకో విధానముంది ఇప్పటికే తమ రాష్ట్రంలో భూ సేకరణ విషయంలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నామని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బుర్ద్వాన్‌లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో తేల్చిచెప్పారు. భూ బిల్లును వ్యతిరేకిస్తూ, ఇతర కార్యక్రమాల వల్ల నీతి ఆయోగ్ భేటీకి హాజరు కావట్లేదని వివరిస్తూ ప్రధానికి శనివారమే మమత ఒక లేఖ రాశారు. రాష్ట్రాల స్థానిక అవసరాల ప్రాతిపదికగా విధానాలు రూపొందించాల్సి ఉందని జమ్మూకశ్మీర్ సీఎం ఎంఎం సయీద్ సూచించారు. 2013 భూ సేకరణ చట్టం జమ్మూకశ్మీర్‌లో చెల్లదన్నారు. 2013 చట్టంలో ఎలాంటి మార్పులు అవసరం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. సొంత చట్టాల దిశగా రాష్ట్రాలు.. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని బహిష్కరించడంపై ముఖ్యమంత్రులు ఆత్మావలోకనం చేసుకోవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. భూ బిల్లులో సవరణలపై ఏకాభిప్రాయం వచ్చేవరకు ఏదురుచూడటం తమ వల్ల కాదని, బదులుగా సొంతచట్టాలను రూపొందించుకుంటామని అధికశాతం రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని భేటీ అనంతరం మీడియా సమావేశంలో జైట్లీ వెల్లడించారు. ‘ఈ బిల్లు విషయంలో కేంద్రం ఏకాభిప్రాయం సాధించలేకపోతే.. దీన్ని రాష్ట్రాలకే వదిలేయాల్సి వస్తుంది. వేగంగా అభివృద్ది చెందాలని కోరుకునే రాష్ట్రాలు సొంత చట్టాలను రూపొందించుకుంటాయి. కేంద్రం ఆయా చట్టాలకు ఆమోదం తెలుపుతుంది’ అన్నారు. -
యూజీసీ నెట్.. పరిశోధనలకు పిలుపు!
సాహిత్యం నుంచి స్పేస్ సైన్స్ వరకు రోజురోజుకీ పెరుగుతున్న రీసెర్చ్ ఆవశ్యకత..మేక్ ఇన్ ఇండియా.. స్కిల్ ఇండియా తదితర పథకాలతో భవిష్యత్‌లో ఆర్ అండ్ డీ విభాగాల్లో విసృ్తత అవకాశాలు.. పరిశోధన దిశగా ఔత్సాహికుల సంఖ్యను పెంచేందుకు భారీగా పెరిగిన ఆర్థిక ప్రోత్సాహకాలు.. దేశంలో పరిశోధనల ప్రాధాన్యాన్ని తెలిపే నిదర్శనాలివి.. ఈ పరిశోధనల అవకాశాలను.. ఆపై ఉన్నత కెరీర్‌ను అందుకునేందుకు తొలి అడుగే.. యూజీసీ నెట్(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్). బోధన రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించడానికి కూడా యూజీసీ నెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఏటా రెండు సార్లు నిర్వహించే యూజీసీ నెట్.. నోటిఫికేషన్ (యూజీసీ నెట్- జూన్ 2015) వెలువడిన నేపథ్యంలో నెట్లో విజయానికి మార్గాలు.. అవకాశాలపై విశ్లేషణ... ► నెట్ అభ్యర్థులందరికీ మొదటి పేపర్ ఒకే విధంగా ఉంటుంది. ఈ పేపర్లో అభ్యర్థిలోని రీసెర్చ్ ఆప్టిట్యూడ్; టీచింగ్ ఆప్టిట్యూడ్; జనరల్ అవేర్నెస్ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 60 ప్రశ్నలు ఉండే ఈ పేపర్లో.. తప్పనిసరిగా 50 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ► పేపర్-2, 3లు అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ సంబంధిత పేపర్లు. ► పేపర్-2లో 50 ప్రశ్నలు అడుగుతారు. అన్నిటికీ సమాధానం ఇవ్వడం తప్పనిసరి. ► పేపర్-3లో 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్లోనూ అన్నిటికీ సమాధానం ఇవ్వాలి. ప్రతి పేపర్‌కు వేర్వేరుగా కనిష్ట ఉత్తీర్ణత యూజీసీ నెట్లో మూడు పేపర్లలో ఉత్తీర్ణత శాతం వేర్వేరుగా ఉంటుంది. పేపర్-1, పేపర్-2లకు కనీసం 40 శాతం; పేపర్-3లో కనీసం 50 శాతం మార్కులు పొందితేనే మెరిట్ లిస్ట్ ప్రకారం తదుపరి దశకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మూడు పేపర్లలో సగటు మార్కులను గణించి అందులో మొదటి 15 శాతం అభ్యర్థులతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు నెట్ అర్హుల జాబితా రూపొందిస్తారు. ఈ జాబితా నుంచే జేఆర్ఎఫ్ కోసం ప్రత్యేకంగా మెరిట్ లిస్ట్‌ను తయారుచేస్తారు. 70 శాతం మార్కులు లక్ష్యంగా నెట్ ఔత్సాహిక అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులు లక్ష్యంగా సాధన చేస్తే జేఆర్ఎఫ్ అవకాశాలు మెండుగా ఉంటాయి. యూజీసీ నెట్ జూన్ - 2014లో ఆయా సబ్జెక్ట్‌లలో పేర్కొన్న కటాఫ్‌లే ఇందుకు నిదర్శనం. యూజీసీ నిర్వహించే నెట్ ద్వారా 3200 జేఆర్ఎఫ్లు అందిస్తుంది. ఈ క్రమంలో యూజీసీ నెట్ 2014ను 95 సబ్జెక్ట్‌లలో నిర్వహించగా.. జనరల్ కేటగిరీల్లో అన్ని విభాగాల్లో జేఆర్ఎఫ్ కటాఫ్ పర్సంటేజీ 60 శాతం నుంచి 70 శాతం మధ్యలో నమోదైంది. ఆబ్జెక్టివ్ పరీక్షకు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ► మొత్తం మూడు పేపర్లుగా పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే నెట్లో ఉత్తీర్ణతకు అభ్యర్థులు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించడం మంచిది. ► అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి పీజీ స్థాయి సిలబస్‌ను ఔపోసన పట్టడం ఎంతో అవసరం. ► అందరికీ ఉమ్మడిగా ఉండే పేపర్-1లో ఎక్కువగా టీచింగ్ ఆప్టిట్యూట్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, దేశంలో ఉన్నత విద్య-ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం ఆయా రంగాల్లో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ► వీటితోపాటు పేపర్-1లో డేటా ఇంటర్‌ప్రిటేషన్; లాజికల్ రీజనింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలు కూడా అడుగుతారు. అభ్యర్థుల పరిశీలన నైపుణ్యం, నిర్దిష్ట అంశంలోని ‘క్లూ’ పాయింట్లను గుర్తించడం, నిర్దిష్ట డేటా నుంచి ముఖ్యాంశాలను గుర్తించే విశ్లేషణ వంటి నైపుణ్యాలను ప్రాక్టీస్ ద్వారా సొంతం చేసుకోవాలి. ► పేపర్-2, 3లలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ఎలక్టివ్స్ నుంచి పీజీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ వాటికి నేపథ్యం తెలిస్తేనే సమాధానం ఇవ్వగలిగేలా ఉంటాయి. కాబట్టి సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో చదవాలి. ► ప్రతి అంశాన్ని బేసిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ► సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధిత సబ్జెక్ట్‌ల అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► వారానికో చాప్టర్ పూర్తి చేసుకునే విధంగా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. ► గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం చాలా అవసరం. ► మాక్ టెస్ట్‌లు రాయడం కూడా లాభిస్తుంది. ఈ మాక్ టెస్ట్‌లను కూడా పరీక్షలో లభించే నిడివిలోనే పూర్తిచేయాలి. ► పేపర్-2, 3లలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అయితే ఈ విషయంలో ఆందోళన చెందడం కంటే శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి. ► నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ముందుగా సమాధానాలు బాగా తెలిసిన ప్రశ్నలన్నిటినీ పూర్తిచేసి; సమాధానం తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్ టెక్నిక్ ఆధారంగా గుర్తించాలి. యూజీసీ నెట్ - జూన్ 2015 అర్హతలు ► అభ్యర్థులు హ్యుమానిటీస్; సోషల్ సైన్స్, మేనేజ్మెంట్, సైన్స్ విభాగాల్లో మొత్తం 85 సబ్జెక్ట్‌లలో నిర్వహించే నెట్లో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి పీజీ స్థాయిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. ► ఆయా సబ్జెక్ట్‌లలో పీజీ ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి: జూన్ 1, 2015 నాటికి 28 సంవత్సరాలు. ఓబీసీ (నాన్ - క్రీమీలేయర్), ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యుడీ తదితర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు. ► అసిస్టెంట్ ప్రొఫెసర్ ఔత్సాహిక అభ్యర్థులకు వయో పరిమితి లేదు. దరఖాస్తు విధానం ► అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఠీఠీఠీ.ఛిఛట్ఛ్ఛ్ట.జీఛి.జీ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేసి కేటాయించిన అప్లికేషన్ నెంబర్ ఆధారంగా లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి. నిర్దేశిత ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించొచ్చు. మూడు బ్యాంకుల్లో (సిండికేట్ బ్యాంక్/ ఐసీఐసీఐ బ్యాంకు/ కెనరా బ్యాంకుల) నెట్ ఈ-చలాన్ పేమెంట్ సదుపాయం కల్పించారు. ఈ-చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలనుకునే అభ్యర్థులు దాన్ని డౌన్లోడ్ చేసుకుని సంబంధిత బ్యాంకులో ఫీజును చెల్లించి వివరాలను మళ్లీ పొందుపర్చాలి. యూజీసీ వెబ్సైట్లో సిలబస్ నెట్ నిర్వహించే సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్ సిలబస్ యూజీసీ వెబ్సైట్ ఠీఠీఠీ.ఠజఛి.్చఛి.జీలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు కచ్చితంగా ఈ సిలబస్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆ మేరకు ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించాలి. యూజీసీ నెట్ జూన్ 2015 ముఖ్య తేదీలు ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2015, ఏప్రిల్ 16. ► ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2015, మే 15. ► ఈ-చలాన్/డెబిట్ కార్డ్/క్రెడిట్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ : 2015, మే 16. ► పరీక్ష తేదీ: 2015, జూన్ 28. ► అడ్మిషన్ కార్డ్ డౌన్లోడ్: జూన్ మొదటి వారం ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్. వెబ్సైట్ : www.cb.senet.nic.in యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు ► నెట్ ఉత్తీర్ణతతో ప్రతిష్టాత్మక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందేందుకు అర్హత లభిస్తుంది. ► నెలకు రూ. 25 వేల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందుకోవచ్చు. ► ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణులకు రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ప్రాధాన్యం. పీఎస్‌యూలకూ ప్రామాణికంగా నెట్ స్కోర్ యూజీసీ నెట్‌కు సంబంధించి తాజా మార్పు.. యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా పబ్లిక్ సెక్టార్ సంస్థలు నియామకాలు చేపట్టొచ్చనే నిర్ణయం. ఆయా పీఎస్‌యూల్లో ఆర్ అండ్ డీ, మేనేజ్మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో నియామకాలకు నెట్ ఉత్తీర్ణులను తీసుకునే అవకాశం కల్పిస్తూ యూజీసీ గత నవంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యూజీసీ నెట్ డిసెంబర్ 2014 మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులతో మేనేజ్మెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇదే బాటలో మరికొన్ని పీఎస్‌యూలు కూడా పయనించనున్నాయి. విశ్లేషణ, పరిశీలన నైపుణ్యాలు అవసరం యూజీసీ నెట్లో ఉత్తీర్ణతకు ప్రధాన సాధనాలు.. విశ్లేషణ, పరిశీలన నైపుణ్యాలు. ముఖ్యంగా కంపల్సరీ పేపర్స్‌గా అభ్యర్థుల ఎలక్టివ్ సబ్జెక్ట్స్‌లో ఈ నైపుణ్యాలు ఎంతో ఉపకరిస్తాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్ సమయంలో తులనాత్మక అధ్యయనం అవసరం. అప్పుడే ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. యూజీసీ నెట్‌కు సంబంధించి ఇటీవల కాలంలో లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల(ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర)కు కూడా ఆదరణ పెరుగుతోంది. ఆయా సబ్జెక్ట్‌లలో పీజీ స్థాయిలో అకడమిక్‌గా మంచి పట్టున్న అభ్యర్థులు ప్రస్తుత సమయంలో సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే మెరిట్ జాబితాలో చోటుసంపాదించొచ్చు. కేవలం రీడింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. తద్వారా తమ సామర్థ్యం తెలుసుకుని నైపుణ్యం పెంచుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. - ప్రొఫెసర్ ఎం.ఎ.అజీమ్, కో ఆర్డినేటర్, యూజీసీ నెట్ కోచింగ్ సెంటర్,మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ -
స్కామ్ ఇండియా కాదు, స్కిల్ ఇండియా: మోడీ
-
స్కామ్ ఇండియా కాదు, స్కిల్ ఇండియా: మోడీ
న్యూఢిల్లీ: స్కాం ఇండియాను స్కిల్ ఇండియాగా మారాలన్నదే తన స్వప్నం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. లోక్‌సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యాలను పెంచడానికి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభలో తాను కొత్త సభ్యుడినని చెప్పారు. ఎన్నికలలో మాత్రమే మనం పోటీ దారులం, సభలో మాత్రం ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులం అన్నారు. ప్రపంచానికి మన సత్తా చాటాలన్నారు. పేదరికం నుంచి పేదవాళ్లని బయటపడేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అధికధరలను తగ్గించేందుకు రియల్ టైం డేటాను అందుబాలోకి తీసుకుకొస్తామని చెప్పారు. యూపీ తరహా దారుణాలకు ఒడిగట్టేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు భద్రత ఇవ్వడం, వారిని గౌరవించడం 125 కోట్ల మంది భారతీయుల బాధ్యత అని చెప్పారు. ప్రజల నమ్మకాలను నిలబెడదామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. గుజరాత్లో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెబితి ఎవరూ నమ్మలేదు, అది సాధ్యం కాదన్నారు. అయితే అందరూ ముక్కుమీద వేలేసుకునేలా చేసి చూపించామని మోడీ చెప్పారు. ప్రతిపక్ష నేతల సందేహాలకు మోడీ సవివరంగా సమాధానాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ చేసి చూపిస్తానని చెప్పారు.